‘సెంట్రల్ యూనివర్శిటీలలో OBCలకు అన్యాయం’

(ఆలిండియా ఓబిసి స్టుండెంట్స్ అసోసియేషన్)

40 కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో కేవలం 9 మంది  మాత్రమే OBC ప్రొఫెసర్లు ఉన్నారని యు. జి.సి ఒక RTI దరఖాస్తు దారుడికి  కి ఇచ్చిన సమాధామీయడంతో OBC  లల్ పెద్ద  చర్చకు దారి తీసింది. ఇదే పరిస్థితి అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ లో కూడా చూడవచ్చు.

మండల్ కమీషన్ ప్రవేశపెట్టి 30 ఏళ్ళు అవుతున్నా OBCలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో, కేంద్ర ఉన్నత విద్యా సంస్థలైన కేంద్ర కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో, IITs, IIMs, AIIMs, NITs తీరని అన్యాయం జరుగుతుందని చెప్పవచ్చు.

20డిసెంబర్ 1978 అప్పటి దేశ ప్రధాని అయిన మొరార్జీ దేశాయిగారు రెండవ జాతీయ వెనుకబడిన కమిటీని బి.పి మండల్ గారి అధ్యక్షతన ఏర్పాటు చేశారు. బి.పి మండల్ గారు సెప్టెంబర్ 7, 1980లో భారత ప్రభుత్వానికి నివేదికను సమర్పించారు. మండల్ కమీషన్ మొదటి పేజిలో ఈ విధంగా రాశారు. “సమానంగా ఉన్నవాళ్ళలో మాత్రమే సమానత్వం ఉంటుంది. అసమానతలను సమానంగా చేయాలంటే, అసమానత మార్గాలను ఎంచుకోవల్సి వస్తుంది.” రిజర్వేషన్లను ఒక రకంగా అసమానంగా కనిపించిన సమానత్వం కోసం ఉపయోగపడుతాయి.

మండల్ కమీషన్ ఆధారంగా 1993లో కేంద్రం ప్రభుత్వ ఉద్యోగాలలోOBC రిజర్వేషన్లను అమలు చేసినప్పటికిఉన్నత విద్యా సంస్థలలో 2007 నుండి
సెంట్రల్ ఎడ్యుకేషన్ ఇనిట్యూషన్స్ (రిజర్వేషన్స్ ఇన్ అడ్మిషన్స్) 2006 చట్టం ద్వారా అమలులోకి వచ్చాయి.

కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకుంటున్నా అన్ని విద్యా సంస్థల బోధన సిబ్బంది మరియు విద్యార్థుల అడ్మిషన్ సీట్లలో 27% OBC రిజర్వేషన్లను అమలులోకి తెచ్చారు. అంటే 13 సంవత్సరాల నుండి OBC రిజర్వేషన్లు అమలవుతున్న OBCలు, SC, ST బోధన సిబ్బంది కన్నా తక్కువగా ఉన్నారు. దేశంలో 40 కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో 2498 ప్రొఫెసర్లు, 5011 అసోసియేట్ప్రొ ఫెసర్లు, 10830 అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండగా OBCలకు 313 ప్రొఫెసర్లు, 735 అసోసియేట్ ప్రొఫెసర్లు, 2232అసిస్టెంట్ ప్రొఫెసర్లను కేటాయించారు. కాని అసలు రావాల్సింది 674 ప్రొఫెసర్లు, 1352 అసోసియేట్ప్రొఫెసర్లు, 2924అసిస్టెంట్ ప్రొఫెసర్లను OBCలకు కేటాయించాలి.

కేటాయించిన OBC పోస్టులలో కేవలం 9మంది ప్రొఫెసర్లు,38 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 1327 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను మాత్రమే భర్తీ చేయడం జరిగింది. అంటే 97.12% ప్రొఫెసర్లు, 94.82% అసోసియేట్ ప్రొఫెసర్లు 40.54% అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ కాలేదని చెప్పవచ్చు. ఈ RTI ఇచ్చిన సమాచారం ద్వారా OBCలకు రెండు రకాల అన్యాయాలను చూడవచ్చు.

ఒకటి 27% కేటయింపులో అన్యాయం జరిగితే, కేటాయించిన పోస్టులను భర్తీ చేయకపోవడం రెండవ అన్యాయం.

ప్రసిద్ది చెందిన ఇండియన్ ఇన్య్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యా సంస్థలో 8856 బోధన సిబ్బంది ఉంటే, కేవలం 329 మంది OBC బోధన సిబ్బంది మాత్రమే ఉన్నారు. 18ఇండియన్ ఇన్య్టిట్యూట్ఆ ఫ్ మెనెజ్మెంట్లలో724 బోధన సిబ్బంది ఉంటే, కేవలం 27 మంది OBC సిబ్బంది మాత్రమే ఉన్నారు.

కాని 52% ఉన్న OBCల విషయంలో(None suitable candidate found) నో సూటబుల్ క్యాండిడేట్ ఫౌండ్ అని, పోస్టులను మూడు సార్లు వేసి, నాలుగవ సారి జనరల్ గా మార్చుతున్నారు. అంతేకాకుండా కేంద్రీయ
విశ్వవిద్యాలయాలకు చదువుకోవడానికి వస్తున్నా OBC
విద్యార్థులు, SC, ST విద్యార్థులలాగా సంఘటితం కాకపోవడం, కులాలవారిగా విడిపోయి వీళ్ళకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపడంలో విఫలం అయ్యారనే చెప్పవచ్చు.

ఇలాంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే OBC సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. 52% ఉన్న OBCలకు ఉన్నత విద్య సంస్థలలో
తీరని అన్యాయం జరుగుతుంది. మొత్తం మంజూరు అయిన 27% OBC
ఉద్యోగాలను అమలు చేయాలి. ఉన్నత విద్యా సంస్థలలో ఖాళీలుగా ఉన్న ఉద్యోగాలను దశల వారిగా భర్తీ చేయాల్సిన బాద్యత కేంద్ర ప్రభుత్వానిదే. సెంటల్ యూనివర్శిటీ వైస్చా న్సలర్స్, IIT, IIM డైరెక్టర్లు ఈ విషయం పై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. కేంద్రీయ విశ్వవిద్యాలయాలు రాజ్యంగం
కల్పించిన రిజర్వేషన్లను అమలు చేయల్సిన అవసరం ఉంది. రిజర్వేషన్లను అమలు చేయకపోతే రాజ్యంగంలో ఉన్న ఆర్టికల్ 15(4), 16(4)ను, సెంట్రల్ ఎడ్యుకేషన్ ఇనిట్యూషన్ ఆక్ట్ 2006ను (Central education institution Act, 2006)ఉల్లంఘించనట్లే అవుతుంది. నో సూటబుల్ క్యాండిడేట్ ఫౌండ్(No suitable candidate found) అన్న విషయంలో జగ్రత్తగా చూడాలి. ఎందుకంటే ఈ పద్ధతి ద్వారా అన్యాయం జరుగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కేంద్ర ప్రభుత్వం యూ.పి.ఎస్.సి (UPSC) తరహా
జాతీయ రిక్రుట్ మెంట్ సంస్థతో ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్
ప్రొఫెసర్లను నియమించడం ద్వారా అక్రమాలు జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.

 NEET లో కూడా OBCలకు అన్యాయం

2013 నుండి జాతీయస్థాయిలో జరిగే జాతీయ అర్హత మరియు ప్రవేశ పరీక్ష ‘నీట్’ (National Eligibility cum Entrance Test NEET)లో ప్రతి రాష్ట్రం 15% ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ సీట్లని, పీజీలో 50% సీట్లని ఆల్ ఇండియా కోటా (AIQ) క్రింద ఉంచడం జరుగుతుంది. అయితే ఈ జాతీయ కోటాలో ఎస్సి, ఎస్టీ కోటాని అమలు చేస్తున్నా, ఓబీసీ రిజర్వేషన్ ని మాత్రం 2013 నుండి అమలు చేయడం లేదు. దాదాపు 72,491 సీట్లలో (వైద్య & దంత) అఖిల భారత కోటా క్రింద ఓబీసీకి ఒక్క సీటు కూడా కేటాయించలేదు. ఇందులో రిజర్వేషన్ అమలు కాకపోవడమే కాకుండా, తిరస్కరణకు గురి అయ్యింది. ఈ ఏడాది జాతీయ కోటాలో తెలంగాణలో 230 సీట్లు, ఆంధ్రప్రదేశ్ లో 468 సీట్లు కేటాయించగా ఓబీసీ లకు ఒక్క సీట్ గూడా భారత ఆరోగ్య మండలి (MCI) కేటాయించలేదు. నీట్‌లో ఓబిసి రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని మేము కోరుతున్నాము.

ఉన్నత విద్యా సంస్థల్లో ఫీజుల విషయంలో ఎస్సీలు, ఎస్టీలతో సమానంగా ఓ.బి.సి విద్యార్థులను పరిగణించండి.

ఓ.బి.సి. లు సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతుల క్రిందకు వస్తారు మరియు రిజర్వేషన్లు పొందటానికి నాన్- క్రిమిలేయర్(NCL) కూడా వర్తిస్తుంది. 8 ఏప్రిల్ 2016 నాటి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ లేఖ ప్రకారం, ఎస్సీ, ఎస్టీ మరియు పి.హెచ్ విద్యార్థులందరికీ ఐఐటిలు , ఎన్‌ఐటిలలో పూర్తి ఫీజు మినహాయింపు లభిస్తుంది. 1 లక్ష వార్షిక ఆదాయం కంటే తక్కువ ఆదాయ స్థాయిని కలిగి ఉన్న ఓ.బి.సి విద్యార్థులకు మరియు 5 లక్షల లోపు ఆదాయ స్థాయి ఉన్న విద్యార్థులకు 2/3 మాత్రమే ఫీజు
మినహాయింపు ఉంటుంది. ఓ.బి.సి కేటగిరీలో రిజర్వేషన్లు పొందిన ఓ.బి.సి విద్యార్థులకు కేంద్ర విశ్వవిద్యాలయాలు, ఐఐటిలు, ఐఐఎంలు, ఎన్ఐటిలు, ఐసర్, ఐఐఎస్సి లాంటి అన్ని ఉన్నత విద్యా సంస్థలలో (హెచ్ఇఐ) పూర్తి
ఫీజు మినహాయింపు లభిస్తుంది.

భారత దేశ ఉన్నత విద్యాసంస్థలను శక్తివంతం చేయడానికి మరియు ప్రపంచ స్థాయి బోధన మరియు పరిశోధనా సంస్థలుగా మారడానికి భారత ప్రభుత్వం ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్ (IoE) పథకం ప్రారంభించింది. ప్రపంచ స్థాయి బోధన మరియు పరిశోధనా సంస్థలుగా అవతరించడానికి పది ప్రభుత్వ మరియు పది ప్రైవేట్ సంస్థలను గుర్తించాలి. ఇవి భారతీయులకు అధిక నాణ్యత గల విద్యకు అందించటంలో తోడ్పడుతుంది. IoE గా గుర్తించబడిన ప్రతి ప్రభుత్వ సంస్థకు ఐదేళ్లకు రూ.1000 కోట్లు అందిస్తుంది. యుజిసి (ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ విశ్వవిద్యాలయాలు) రెగ్యులేషన్స్, సెక్షన్ 15 ప్రకారం, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్, రిజర్వేషన్ల విధానాన్ని ప్రవేశాలు మరియు నియామకాలలో అమలు చేస్తుంది. న్యూ డిల్లీలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) ఐఒఇ రిక్రూట్‌మెంట్‌లో రిజర్వేషన్లను అమలు చేయగా, హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఐఒఇ రిక్రూట్‌మెంట్లలో రిజర్వేషన్లను అమలు చేయలేదు. ఏదైనా IoE సంస్థ రిజర్వేషన్ విధానం యొక్క ఉల్లంఘనను మంత్రిత్వ శాఖ తీవ్రంగా పరిగణించాలి.

ఆలిండియా ఓబిసి స్టూడెంట్స్ అసోసియేషన్ వారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కి అదేవిధంగా NCBC వారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది వాటిలో ఉన్నటువంటి డిమాండ్లను వచ్చే పార్లమెంటు సమావేశాల లోపు కేంద్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని లేనియెడల దేశవ్యాప్తంగా గా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని అదేవిధంగా ఢిల్లీలో కూడా భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని కచ్చితంగా పార్లమెంటు సమావేశాల లోపు మా యొక్క మా యొక్క న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి.

(ఆలిండియా ఓబిసి అసోసియేషన్ (All India OBC Students Association (AIOBCSA)  ప్రతినిధులు National Commission for Backward Classes (NCBC)కి వినతి పత్రం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *