2010 నుంచి బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇలా సుమారు 900 శాతం ధరలు పెరిగాయి. ఒక విధంగా ఇది మంచి వార్త. మరొక విధంగా నిరుత్సాహ పరిచేసమాచారం. బంగారు ధరలు పెరగడంతో బంగారు అంటే ఎంతో మక్కువ ఉన్న భారతీయులు బంగారు కొనడమే మానేశారు. బంగారు ధరల చరిత్రలో 2020 సంవత్సరం చాలా బలహీన సంవత్సరంగా మిగిలిపోతున్నది. ఎందుకంటే, బంగారు డిమాండ్ 25 సంవత్సరాల నాడు ఉన్న స్థాయికి పడిపోయింది.
2020 క్యాలెండ్ ఇయర్ మూడో క్వార్టర్ లో ఇండియాలో బంగారు డిమాండ్ కేవలం 86.6 టన్నులే. ఇది 2019 మూడో క్వార్టర్ లో ఉన్న డిమాండ్ 123.9 టన్నులతో పోలిస్తే 30శాతం తక్కువ.
ఆభరణాలకోసం కొనే బంగారు డిమాండ్ ఇంకా దారుణంగా పడిపోయింది. మూడో క్వార్టర్ లో ఈ డిమాండ్ కేవలం 52.8 టన్నులే నని ప్రపంచ బంగారు సమితి (World Gold Council) తెలిపింది.
అయితే ప్రజలు బంగారు లో ఇన్వెస్ట్ చేయడం ఎక్కువయింది.
ప్రజలు బంగారు కొనడం బాగా ఎక్కువయింది. పూర్వం కేవలం నగలకోసం బంగారు కొనేవాళ్లు.ఇపుడు ఇన్వెస్ట్ మెంటుగా బంగారం కొనిపెడుతున్నారు. ఎందుకంటే, ఈ పద్ధతిలో ఫిక్స్ డ్ డిపాజిట్ కంటే ఎక్కువ రాబడి ఉంటుంది.
మార్చి 2020లో కోవిడ్ లాక్ డౌన్ వల్ల బంగారు మార్కెట్లు పడిపోయినా ఇది కొద్ది కాలమే ఉండింది. జూలై 2020 బంగారు మళ్లి లేచి జూలు విదిలించింది. పదిగ్రాముల ధర రు. 50 వేలకు చేరింది.
బంగారు గురించి ఒక ఆసక్తి కరమయిన విషమేమంటే, ప్రపంచంలో బంగారు నిల్వలు తిరిగిపోతున్నాయి.గనుల నుంచి తవ్వుతున్న బంగారు తగ్గుతూ ఉంది. మార్కెట్లో డిమాండ్ పెరుగుతూ ఉంది. ప్రపంచంలో గనుల నుంచి తవ్వి తీసినవన్నీ వాడేసుకుంటారు. మనదగ్గిర ఏమీ మిగలేదు. ఉదాహరణకు పెట్రోలు వెలికితీస్తారు.వివిధ రూపాల్లో వాడేస్తారు. ఏమీ మిగలకుండా వాడేస్తాం. ఇలాగే అన్ని మైనింగ్ ప్రాడక్ట్ కొన్ని రోజులు తర్వాత మాయమవుతాయి. లేదా పనికిరాకుండా పోతాయి. తరిగిపోతాయి. ఒక్క బంగారు మాత్రమే తవ్వి తీసిందంతా శాశ్వతంగా అలాగే ఉండిపోతుంది. కొద్ది పాటి తరుగుపోవడం తప్ప. అందుకే తవ్వితీస్తున్న బంగారు తక్కువ. డిమాండ్ ఎక్కువ. కాబట్టి బంగారు ధరలు తగ్గుతాయనుకోలేం. పెరుగుతూనే ఉంటాయి.
అంతర్జాతీయంగా బంగారు ట్రేడింగ్ అమెరికన్ డాలర్లలో సాగుతుంది. దీనిని రూపాయల్లోకి మార్చి మనం బంగారు కొంటాం. డాలర్ మారకం విలువను బట్టి ఇండియాలో బంగారు ధరలు పెరుగడమో తగ్గడమో జరుగుతుంది. డాలర్ బలహీనపడితే, బంగారు ధర అమాంతం పెరుగుతుంది. ఇపుడు డాలర్ కు కష్టాల్ల్ ది. అందుకే డాలర్ కంటే బంగారు కొని భద్రంగా దాచుకుంటున్నారు. ప్రజలు అందుకే బంగారు ధరలు పెరుగుతున్నాయి.
భారతదేశంలో బంగారు ధరలను నిర్ణయించేది అంతర్జాతీయ బంగారు ధరలే. దీనితో పాటు డాలర్ మారకం విలు, ట్రాన్సాక్షన్ కాస్ట్, దిగుమతిసుంకాలు తదితర అంశాలుకూడా బంగారు ధరలను ప్రభావితం చేస్తాయి.
ప్రపంచ బంగారు సమితి (World Gold Council) 2020 కాలెండర్ సంవత్సరంలో భారతదేశంలో బంగారు డిమాండ్ బాగా పడిపోయింది. 1995 నాటి డిమాండ్ కంటే తక్కువ. 2020అక్టోబర్ నాటికి దేశంలో రికార్డయిన 252 టన్నులు మాత్రమే. ది. 2019 అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా 194 టన్నల డిమాండ్ ఉండింది. 2020 అక్టోబర్ – డిసెంబర్ మధ్య కూడ ఈ లెక్కలే తీసుకున్నా, 2020 క్యాలెండర్ ఇయర్ లో దేశంలో బంగారు డిమాండ్ 496 టన్నలు మించదు. ఇదే 2019 క్యాలెండర్ ఇయర్ డిమాండ్ ఎంతో తెలుసా? 696 టన్నలు.
అయితే, 2021 సంవత్సరంలో బంగారు డిమాండ్ పుంజుకుంటుందా? బంగారు పది గ్రాముల ధర రు. 50వేల కంటే తక్కువ ఉంటే డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.