కూల్చిన గుళ్ల పునర్నిర్మాణం, జగన్ శంకుస్థాపన

* గత ప్రభుత్వం పుష్కరాల సమయంలో కూల్చినట్ల చెబుతున్న కొన్ని ఆలయాల పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భూమిపూజ నిర్వహించారు.

దక్షిణముఖ ఆంజనేయస్వామి, సీతమ్మవారి పాదాలు, రాహు-కేతువు, బొడ్డుబొమ్మ, గోశాల కృష్టుడి ఆలయం, కృష్ణా నది ఒడ్డున సీతమ్మ పాదాల వద్ద ఆలయాల పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసారు.

అలాగే రూ.77 కోట్లతో ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులకు సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

ఆల‌యాల నిర్మాణం దేవాదాయ శాఖ‌, సుంద‌రీక‌ర‌ణ ప‌నుల‌ను పుర‌పాల‌క శాఖ చేప‌డుతుంది.

కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, బొత్స సత్యనారాయణ, కొడాలి శ్రీవేంకటేశ్వర రావు,దుర్గ గుడి చైర్మన్ పైల సోమినాయుడు,దేవాదాయ శాఖ కార్యదర్శి గిరిజాశంకర్,కమీషనర్ అర్జునరావు,జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్,

న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ బ‌త్తిన శ్రీనివాసులు, స‌బ్ క‌లెక్ట‌ర్ హెచ్.ఎం.ధ్యాన‌చంద్ర‌, డీసీపీ విక్రాంత్‌పాటిల్‌, దుర్గ‌గుడి ఈవో ఎం.వి.సురేష్‌బాబు ఎమ్మెల్యే లు మల్లాది విష్ణు, రక్షణ నిధి, జోగి రమేష్, సింహాద్రి రమేష్,వల్లభనేని వంశీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

విజయవాడలో పునర్నిర్మాణం చేపట్టే ఆలయాలు..
* రూ.70 లక్షలతో రాహు-కేతు ఆలయ పునర్నిర్మాణం
* రూ.9.5 లక్షలతో సీతమ్మ పాదాలు ఆలయ పునర్నిర్మాణం
* రూ.31.5 లక్షలతో దక్షిణాభిముఖ ఆంజనేయస్వామి ఆలయ పునర్నిర్మాణం
* రూ.2 కోట్లతో రాతితో శ్రీ శనీశ్వర ఆలయ పునర్నిర్మాణం
* రూ.8 లక్షలతో బొడ్డుబొమ్మ ఆలయ పునర్నిర్మాణం
* రూ.20 లక్షలతో శ్రీ ఆంజనేయస్వామి ఆలయ పునర్నిర్మాణం(దుర్గగుడి మెట్ల వద్ద)
* రూ.10 లక్షలతో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీ దాసాంజనేయ ఆలయ పునర్నిర్మాణం
* రూ.10 లక్షలతో వీరబాబు ఆలయం పునర్నిర్మాణం (పోలీస్‌ కంట్రోల్‌ రూం సమీపంలో)
* రూ.20 లక్షలతో కనకదుర్గ నగర్‌లో శ్రీ వేణుగోపాలకృష్ణ మందిరం, గోశాల పునర్నిర్మాణం

విజయవాడ దుర్గగుడి అభివృద్ధి విస్తరణ పనులు..
* రూ.8.5 కోట్లతో ప్రసాదంపోటు భవన పునర్నిర్మాణం
* రూ.5.6 కోట్లతో మల్లేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణం
* రూ.2 కోట్లతో మల్లేశ్వరస్వామి ఆలయ ప్రాకారం విస్తరణ
* రూ.23.6 కోట్లతో కేశఖండనశాల భవన నిర్మాణం
* రూ.19.75 కోట్లతో అన్నప్రసాదం భవన నిర్మాణం
* రూ.5.25 కోట్లతో కనకదుర్గ టోల్‌ప్లాజా నిర్మాణం
* రూ.6.5 కోట్ల నిధులతో ఘాట్‌ రోడ్‌లో మరమ్మతులు
* కొండచరియలు విరిగి పడకుండా మరమ్మతులు, పటిష్ట చర్యలు
* రూ.2.75 కోట్లతో ఆలయం మొత్తం ఎనర్జీ, వాటర్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ పనులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *