ఉలిక్కి పడిన టిఆర్ ఎస్… బండి సంజయ్ కు వివరణ

గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల వాతావరణ అలుముకుంటున్న సమయంలో  తెలంగాణ  భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ వరంగల్ కోట మీదికి  ముూడు  వరంగల్  బాణాలు ప్రయోగించారు.

ఇవి  బాగా తగిలాయి. ఈ మూడు అస్త్రాలు వరంగల్ మీద ప్రభావం చూపిస్తాయని టిఆర్ ఎస్  భయపడినట్లుంది. ఇందులో ఒక అస్త్రానికి స్పందిస్తూ సుదీర్ఘ వివరణ ఇచ్చింది.  మునిసిపల్ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్వి అర్వింద్ కుమార్ బండిసంజయ్ దాడికి వివరణ ఇవ్వడం విశేషం.వివరణ జాగ్రత్తగా చదివితే బండి సంజయ్ చేసిన ఆరోపణ నిజమేనా అనిపిస్తుంది. అంటే బండి సంజయ్ వరంగల్ కోట ముట్టడికి బాగా హోం వర్క్ చేస్తున్నారనుకోవాలి.

బండి సంజయ్ ని  ఇంతవరకు ఒక నాయకుడిగా గుర్తించేందుకు టిఆర్ ఎస్ ఎపుడూ సుముఖంగా లేదు. అలాంటపుడు ఆయన చేసిన విమర్శకు సుదీర్ఘ వివరణ ఇవ్వాలనుకోవడం ఆశ్చర్యం.

కాని, బండి లెేవనెత్తిన అంశాలు వరంగల్ ప్రజలను తాకుతాయని అందువల్ల  వాటికి సమాధానమీయాలని టిఆర్ ఎస్ భావించినట్లుంది. సమాధానం ఎవరీయాలి?  చివరకు, బాగా నిబద్ధత ఉన్నవాడు, విజినరీ, కార్యదక్షుడని పేరున్న సీనియర్ ఐఎఎస్అధికారి చేత ఈ వివరణ  ఇప్పించారు.

సీనియర్ ఐఎ ఎస్ అధికారి, మునిసిల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్ ఇచ్చిన  వివరాల్లోకి వెళ్లే ముందు బిజెపి అధ్యక్షుడు  సంజయ్ కుమార్  ముప్పేట ఏమిటో చూద్దాం.

నిన్న బండి సంజయ్  సంధించిన మూడు అస్త్రాలు:

1. వరంగల్ ను ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్లక్ష్యం చేశారు. ఆయన ఎజండాలో వరంగల్ లేదు.

2. వరంగల్ వరద పాలయినపుడు ముఖ్యమంత్రి కెసిఆర్ వరంగల్ రాలేదు. హైదరాబాద్ వరద బాధితులకు ఇచ్చినట్లు వరంగల్ వరద బాధితులకు పదివేల రుపాయల నష్టపరిహారం ఇవ్వలేదు.

3. వరంగల్ అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధులను టిఆర్ ఎస్ ప్రభుత్వం దారి మళ్లించింది. ఈ నిధులకు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్  గ్రాంట్ ఇవ్వ లేదు. వరంగల్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ. 196 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఆ నిధులను కెసిఆర్ ప్రభుత్వం  దారి మళ్లించింది.  కేవలం రూ. 40 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది.

ఇందులో పైరెండు విమర్శలను ఎవరూ కాదనలేరు. ఎందుకంటే రెండూ కరెక్టే. ఇక మూడోది అంకెల వ్యవహారం కాబట్టి సమాధానమీయవచ్చు.

అర్వింద్ కుమార్ సమాధానం తెలంగాణ టుడే ఆంగ్ల పత్రికలో No Diversion of Funds అనే శీర్షికతో వచ్చింది. నిజానికి ఇది సంజయ్ ఆరోపణలను ఒక విధంగా ధృవీకరించినట్లుంది.  అర్వింద్ కుమార్ వివరణలోని  వివరాలు:

  1. స్మార్ట్ సిటి మిషన్ (Smart City Mission) కింద కేంద్రం 2016 నుంచి 2020 దాకా రు.196.4 కోట్ల నిధులందించింది. ఈ నిధులను 100 శాతం వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ స్మార్ట్ సిటి మిషన్ కు విడుదల చేశాం. ఈ నిధుల మళ్లింపు జరగలేదు. ఇందులో రు. 46.67కోట్లు ఖర్చయ్యాయి. ఖర్చుచేసింది
  2. మ్యాచింగ్ గ్రాంట్ గురించి చెబుతూ కేంద్ర నిధుల కింద పథకాలు చేపట్టి,వాటిని పూర్తి చేసి, బిల్లులు చెల్లించేటపుడు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తుంది. ( The state government will meet the matching grant under Smart Cities project once the works are executed and the bills are ready for the same: Arvind Kumar)

వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ అభివృద్దికి సమృద్ధిగా నిధులున్నాయని భూసేకరణ వంటి కార్యక్రమాల వల్ల తొలుత ఈ పనులు  ఆలస్యమయ్యాయని, ఇపుడు ఈపనులన్నీ మొదలయ్యేందుకు రెడీ గా ఉన్నాయని అన్నారు. అర్వింద్ కుమార్ వివరణ లోని రెండు ముఖ్యాంశాలు

1.While sufficient funds have been made available to Warangal, there were initial delays in undertaking the actual works, and issues like land acquisition and preparation of Detailed Project Report (DPR) had taken their time as is the case in any major project.

2. While 63 works were taken u at a cost of Rs 1,029 crore, works costing Rs 46.67 crore had been completed utilizing Rs 40.67 crore.

మొత్తానికి  మునిసిపల్ ముఖ్యకార్యదర్శి  అర్వింద్ కుమార్ వివరణలో కూడా సంజయ్  మెదడకు దండిగా మేత ఉంది.

ఆయన వరంగల్ దాడి తీవ్రం చేయవచ్చు.

సంజయ్ వ్యూహం ఇదే…

మొన్న వరంగల్ వరదలను బండి సంజయ్ పెద్ద ఇష్యూచేస్తున్నారు. తెలంగాణలో రెండో పెద్ద నగరమయిన వరంగల్ ను పేరుకు తగ్గట్టుగా అభివృద్ధి చేయలేదని,  వరంగల్ నిర్లక్ష్యంచేశారని, అసలు ముఖ్యమంత్రి అజండాలో వరంగల్ లేదని ఆయన వాదిస్తూన్నారు.

ఈ వాదనతో వరంగల్ ప్రజలను వప్పించే ప్రయత్నం చేస్తున్నారు.

మొన్న వరదల్లో వరంగల్ మునిగిపోతే, ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక సారైన ఇటు వైపు చూడని విషయాన్ని ఆయన నొక్కి చెబుతున్నారు.

‘‘వరంగల్‌ వరదల్లో అతలాకుతలం అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటువైపు ఎందుకు రాలేదు,”  అని ఆయన మొదటి అస్త్రం వరంగల్ నుంచే ప్రగతి భవన్ మీద  సంధించారు.

“హైదరాబాద్ వరద బాధితులకు పదివేలు ఇచ్చిన కేసీఆర్ వరంగల్‌ వరదబాధితుకులకు నష్టపరిహారం  ఎందుకు ఇవ్వలేదు,”అని రెండో అస్త్రం విసిరారు.

కెసిఆర్ కు జిహెచ్ ఎంసి తర్వాత వరంగల్ భయం పుట్టుకుందని ఆయన చెప్పారు.

“కేసీఆర్ బడా చోర్. జిహెచ్ ఎంసిలో  జరిగిందే వరంగల్‌లోనూ జరగబోతోంది. ఇది గ్రహించాడు.  వరంగల్‌లో బీజేపీ గెలవబోతోందని సర్వేలు కూడా చెబుతున్నాయి. అందుకే వరంగల్‌లో ఎన్నికలు పెట్టడం లేదు, వాయిదా వేస్తున్నాడు,” అంటూ కెసిఆర్ కవ్వించే వ్యాఖ్యలు చేశారు.

వరంగల్ అభివృద్ధి నిర్లక్ష్యంచేస్తున్నారని, అక్కడ అభివృద్ధి ఏంచేశారని చెబుతూ ఈ విషయంమీద వరంగల్  భద్రకాళీ ముందర ప్రమాణానికి వరంగల్ ఎమ్మెల్యేలు, మంత్రులు సిద్ధమా? అని సవాల్ విసిరారు.

ఒక వైపు వరంగల్ మీద వివక్ష చూపుతూ మరొక వైపు వరంగల్‌లో టీఆర్ఎస్ నాయకులు భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.

 

https://trendingtelugunews.com/top-stories/breaking/telangana-bjp-bandi-sanjay-sharpens-greater-warangal-election-strategy/

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *