ఆంధ్రలో జర్నలిస్టుల అరెస్టు, గుడుల దాడులంటూ అసత్యప్రచారాల కేసు

ప్రకాశం జిల్లా, సింగరాయకొండ, లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ఘటనలో కుట్రతో కూడిన అసత్యాలను, వదంతులను వ్యాప్తి చేసిన మరియు టెలివిజన్ లో ప్రసారం చేసిన వ్యక్తులను ప్రకాశం పోలీసులు అరెస్టు చేశారు.

ఈవిషయాన్ని ప్రకాశం జిల్లా, అడిషినల్ ఎస్పీ(అడ్మిన్)  బి.రవిచంద్ర  తెలిపారు.

ఆయన విడుదల చేసిన ప్రకనట వివరాలు:

Cr.No.2/2021 u/s 120(B),153(A), 295(A), 504 r/w 34 IPC of సింగరాయకొండ పోలీస్ స్టేషన్ లో తేది: 05.01.2021 న కేసు నమెదు చేసినారు.

సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ గ్రామంలో ఉన్న శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ముఖ ద్వారంపై ఉన్న లక్ష్మి నరసింహ స్వామి బొమ్మ, అమ్మవారి బొమ్మలను ఎవరో గుర్తు తెలియని వారు ధ్వంసం చేశారని, స్థానికుడు అసత్య ప్రచారం చేశాడు.

దానిని సోషల్ మీడియాలో , టెలివిజన్ లో  ప్రసారం చేసి భక్తుల మనోభావాలను దెబ్బ తీసేవిధంగా చిత్రీకరించినటువంటి వ్యక్తులను ఈరోజు సింగరాయకొండ పోలీసులు అరెసు చేశారు.వారి పేర్లు 1) మద్దాసాని మౌలాలి- లారి డ్రైవర్, 2) అంబటి శివ కుమార్ –బహుజన మీడియా, సింగరాయకొండ, 3) సాగి శ్రీనివాసరావు – ధర్మ వ్యూహం న్యూస్ పేపర్, సింగరాయకొండ, 4) పోకూరి కిరణ్ – ABN ఆంధ్ర జ్యోతి రిపోర్టర్ సింగరాయకొండ, 5)SK.భాషు –NTV రిపోర్టర్ సింగరాయకొండ, 6) కాట్రగడ్డ రామ్మోహన్ HMTV రిపోర్టర్ సింగరాయకొండ లను పై కేసులో అరెస్టు చేయటం అయినది.

సోషల్ మీడియాలో ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టర్ లో కూడా ఇదే విషయాన్ని నిజాలను మభ్యపెట్టి కావాలని దురుద్దేశంతో కుట్రతో పోస్టులు పెట్టిన వారిపై మరియు టెలివిజన్ లో ప్రసారం చేసిన వ్యక్తులపై కూడా ఈరోజు ( 06.01.2021) న సింగరాయకొండ పోలీస్ స్టేషన్ Cr.No.4/2021 u/s 120(b), 153(A), 295(A) 504 r/w 34 IPC and section 16 of cable network act క్రింద ABN ప్రతినిధులు, TV 5 ప్రతినిధులు, ETV ప్రతినిధులు మరియు యు ట్యూ ఛానల్స్ కు సంబంధించిన మరికొందరి పై కేసు నమోదు చేయడం జరిగింది.

వారిపై కూడా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాము.

ఈ ఘటన పై ఆలయ ఈవో వై. బైరాగి గారు ఇచ్చిన పిర్యాదులో ఇచ్చిన స్టేట్ మెంట్ లో ఉన్న వివరాలు ఇవి. సింగరాయకొండ పట్టణంలో రెండు కిలోమీటర్ల దూరంలో సుమారు 20 సంవత్సరాల క్రితం సిమెంట్ తో ఆర్చి నిర్మించబడింది.  ఆఆర్చి పై లక్ష్మి నరసింహ స్వామి మరియు అమ్మవారు బొమ్మలను సిమెంటుతో ఏర్పాటు చేయటం జరిగింది.  అ బొమ్మలు ఎవరు ధ్వంసం చేయలేదు.  బొమ్మలు పాతవి అయిన కారణంగా సిమెంటు పెచ్చులు ఊడిపోయయి. లక్ష్మీ నరసింహ స్వామి,  అమ్మవారు కుడి చేతులు అప్పటికే విరిగి పోయి ఉన్నాయి.  ప్రతి సంవత్సరం విగ్రహాలకు మరమ్మత్తులు చేసి, పెయింటింగ్ చేస్తూ ఉండేవాళ్లమన్నారు. దాదాపు గత రెండు సంవత్సరాల క్రితమే ఈ ఆర్చికి మరమ్మతులు చేయించాలని అనుకున్నట్లు, కానీ గత సంవత్సరం కరోనా కారణంగా పెయింటింగ్ మరియు సిమెంటు పగుళ్ళ మరమ్మతులు చేయలేదు. ప్రతిరోజు వెళ్లేటప్పుడు ఈ దేవుని బొమ్మలను ఈవో గారు గమనిస్తున్నారు. ఇది 05.01.2021 న జరిగిన చర్య కాదు. గతంలోనే ఈ విగ్రహాలకు సిమెంటు పెచ్చులు పగిలిపోయి విరిగిపోయినవి.

అడిషినల్ ఎస్పీ(అడ్మిన్) శ్రీ బి.రవిచంద్ర  మాట్లాడుతూవెల్లడించిన విశేషాలు:

రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో ఇటీవల చోటు చేసుకుంటున్న సంఘటనల నేపథ్యంలో జిల్లా పోలీసుశాఖ దేవాలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద పటిష్ట భద్రత, బందోబస్తు, నిరంతర నిఘా, పెట్రోలింగ్  జరుతుతున్నది.

పగలు, రాత్రి బీటు సిస్టమును మరియు సివిల్ దుస్తులలో ప్రత్యేక నిఘాను జిల్లా వ్యాప్తంగా అన్ని దేవాలయాలలో/ప్రార్ధన మందిరాలలో ప్రకాశం జిల్లా ఎస్పి శ్రీ సిద్ధార్థ్ కౌశల్ ఐపియస్ గారి ఆదేశాల మేరకు ఏర్పాటుచేశారు.

1) జిల్లాలో మొత్తం మతపరమైన నిర్మాణాల సంఖ్య: 6712,

2) జిల్లాలో మొత్తం మతపరమైన ముఖ్య నిర్మాణాలు సంఖ్య: 161,

3) జిల్లాలో ఏర్పాటు చేయించిన సీసీ కెమెరాల సంఖ్య: 2169,

4) జిల్లాలోని ఏర్పాటు చేయించిన వాచ్ మెన్స్/గార్డ్స్/వాలంటీర్స్ సంఖ్య: 863,

5) జిల్లాలో సెక్యూరిటీ ఆడిట్ పూర్తిచేసిన నిర్మాణాల సంఖ్య:6712,

6) జిల్లాలో సెక్యూరిటీ సెక్షన్ క్రింద బైండోవర్ చేసిన వ్యక్తుల సంఖ్య: 2764,

7) సెక్యూరిటీ సెక్షన్స్ క్రింద కట్టిన కేసుల సంఖ్య: 448,

8)కౌన్సిలింగ్ చేసిన వ్యక్తుల సంఖ్య:4525,

9)జిల్లాలో ఏర్పాటు చేసిన గ్రామ రక్షక దళాలు(DEFENSE COMMITTEES) సంఖ్య:760,

10) మొత్తం 760 గ్రామ రక్షక దళాలు లో పని చేయుచున్న గ్రామ రక్షక సభ్యుల(DEFENSE COMMITTEE MEMBERS) సంఖ్య:5636,

11)జిల్లాలో ఏర్పాటుచేసిన సద్భావన మీటింగ్ ల సంఖ్య: 2129,

12) జిల్లాలో APPS ఏక్ట్ మరియు 149 Cr.P.C. క్రింద జారీ చేసిన నోటీసులు సంఖ్య:6712

దేవాలయాల పూజారులు, ఆలయ కమిటీ నిర్వాహకులు, ఫాస్టర్లు, ఇమామ్ లు, గ్రామస్తులతో పాటు పరిసర ప్రాంతల ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండేలా ఎస్పీ గారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నారు.

10.11.2020 న టీవీ9 లో వచ్చిన డాక్యుమెంటరి కథనంలో పాత సింగరాయకొండ శ్రీ వరహా లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయము ముఖద్వారము దేవాలయ విషయాల మీద  కథనము ప్రసారం చేసి ఉన్నారు.

ఆ వీడియోలో కూడా ఆ సిమెంటు దేవుని విగ్రహాలు అప్పటికే సిమెంటు పెచ్చులు ఊడిపోయి, విరిగిపోయినట్లుగా ఉన్నాయి.

ఆ విషయం తెలిసినప్పటికీ, వాస్తవాన్ని చెప్పినప్పటికీ ఉద్దేశపూర్వకంగా దుండగులు, ఆకతాయిలు కుట్రతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తూ, భక్తులు మరియు ప్రజల మనోబావాలను కించపరచే విధంగా మరియు దెబ్బతిచే విధంగా వదంతులు వ్యాప్తి చేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని అడిషినల్ ఎస్పీ(అడ్మిన్)  తెలియజేశారు.

అసత్యాలు ప్రసారం చేయరాదని అంతేకాక ఇలాంటి విగ్రహాలు చాలా సున్నితత్వంతో కూడుకొని భక్తులు,ప్రజల మనోభావాలతో ఎవరు ఆటలాడరాదని ఆయన అన్నారు.

ఇక ముందు ఎవరైనా ఇలాంటి అసత్యాలకు పాల్పడిన లేక ఇలాంటి అసత్యాలను టెలివిజన్ లో ప్రచారం చేసిన వారిపై మరియు వదంతులు సృష్టించిన వారిపై కూడా ఖచ్చితంగా చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని ఆయన చెప్పారు.

నిజానిజాలను సంబంధిత అధికారుల నుండి తెలుసుకొని తర్వాత మాత్రమే నిజలను మాత్రమే ప్రసారం చేయాలని అడిషినల్ ఎస్పీ(అడ్మిన్) తెలియజేశారు.

దుండగులు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు మరియు అసత్య ప్రచారాలు చేస్తున్న వ్యక్తుల సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత పోలీసులకు లేదా డయల్ – 100 కు సమాచారం ఇవ్వాలని జిల్లా అడిషినల్ ఎస్పీ(అడ్మిన్)  విజ్ఞప్తి చేసినారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *