గాంధీజీకి ‘రామనామస్మరణ‘ నేర్పిందెవరు?

ఎంతటి సాహసం చెయ్యడానికైనా నిరాయుధంగా తెగించే   శక్తి సామర్థ్యాలు  బక్కపల్చటి గాంధీజీకి ఎక్కడి నుండి వచ్చాయి? ఇది ఆయన కు ఇంట్లో పనిచేసే ఆయా  నుంచి వచ్చిందంటే నమ్ముతారా? ఇదిగో ఇదే సాక్ష్యం.

మోహన్ దాస్ ఒక సున్నిత  మనోభావం గలిగిన వాడు. భయగ్రస్థుడైన  పిరికి  పిల్లవాడు. ఇంటి పక్కన నల్లటి కృష్ణ విగ్రహం ఉన్న చీకటి కృష్ణ దేవాలయం ఉండేది. అదంటే ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదు.  అర్థం కాని మంత్రాలు, కుళ్లి పోతున్న పూలు, కాలిన నూనె దుర్గంధం  ఆయనకు నచ్చేవి కాదు, అసహ్యమనిపించేవి. అందువల్ల ఆ గుడిని ఆయన ఎపుడూ తప్పించుకుని తిరిగేవాడు. తల్లి తండ్రులతో అక్కడికి వెళ్లే వాడే కాదు. మోహన్ దాస్ తల్లి పుత్లీబాయికి మాత్రం చీకటి అన్నా, నల్లనయ్య అన్నా భయము లేదు. దేవుని ప్రీత్యర్థం, వానకాలం నాలుగు నెలలూ ఆమె ఉపవాసం చేస్తూ, నిరాడంబరంగా ఇతర నోములు,వ్ర తాలను ఆచరిస్తూ, దేవుళ్లను   ప్రార్థించేది.

మోహన్ దాస్ ను చూసుకునేందుకు రంభ అనే ఆయా ఉండేది. మోహన్ దాస్ ఆమెతో బాగా చనువుగా ఉండేవాడు.  తనకి భూతాలంటే చాలా భయమని ఆమెకు చెప్పే వాడు. మోహన్ దాస్ లో ఉన్న దెయ్యాల, భూతాల భయం పొగొట్టాలని ఆయా రంభ  నిర్ణయించింది. రంభ మాటలను మోహన్ దాస్ చాలా సీరియస్ గా తీసుకునే వాడు. “భూతాలు లెేవు. గీతాల్లేవు.  నీకు భయమైతే ‘హే రామ్’ రామనామం జపించు, భయం పారిపోతుంది,”అని సలహా ఇచ్చింది. అంతే, గాంధీజీ రామభక్తుడయ్యాడు.  అప్పటి నుంచి దయ్యాల భయం పోయేందుకు మోహన్ దాస్ రామనామ జపం మొదలుపెట్టాడు.

విష్ణువు అనెేకానెేక పేర్లలో రామ ఒకటి. ఆ రోజు మొదలు పెట్టి, డెబ్బై సంవత్సరాల దాకా గాంధీజీ  “రామ” జపం వదల్లేదు. దీనితో ఆయనకు దయ్యాల భయమే కాదు, అన్ని రకాల భయం పోయింది. నిరాయుధంగా ఏ భయాన్నయినా ఎదిరించే శక్తి వచ్చింది.  చివరకు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అన్నా భయం పోయింది. దేన్నయినా రఘపతి రాఘవ రాజారాం అంటూ ఎదుర్కొనే శక్తి సంతరించుకున్నాడు.

రామ నామాన్ని తన కడపటి ఊపిరిలొ కూడా జపించినాడు.

జీవితమంతటా భగవంతుని పై తన అచంచల విశ్వాసాన్ని వ్యక్త పరుస్తూ, తన భగవంతుడు, రాముడేనంటూ, రామ భజనే తనకు బలం, ధైర్యం అని విశదీకరిస్తూ వచ్చారు. సమాకాలీన సమాజాంలో గాంధీ అంతటి రామభక్తుడు మనకు కనిపించడు.

“If someone shot at me and I received his bullet in my bare chest without a sigh and with Ram’s name on my lips, only then should you say that I was a true Mahatma.” అని గాంధీజీ చెప్పేవాడు. చివరకు జరిగిందదే.

(source: Robert Pyne, The life and death of Mahatma Gandhi, Page, 26. )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *