విజయసాయి రామతీర్థం ఎందుకు వెళ్లారు?: టిడిపి అనుమానం

ఉరుకుల పరుగుల మీద వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి రామతీర్థం వెళ్లింది ఎందుకు?  టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి కంటే ముందుకు అక్కడి చేరుకోవాలని ఎందుకు ఆరాట పడ్డారు?

చంద్రబాబు రామతీర్థ  పర్యటన జాప్యమయ్యేలా ఆయన మార్గంంలో ఆటంకం సృష్టించింది ఎందుకు?

ఈ ప్రశ్నలకు రాష్ట్ర టిడిపి అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి సమాధానం చెబుతున్నారు.

బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ  రామతీర్థంలో శ్రీరాముని తల నరికి వేసిన సంఘటనలో ప్రభుత్వం తీరు అనేక అనుమానాలకు తావిస్తోందని చెప్పారు.అనేక ఆసక్తి కరమయిన విషయాలు చెప్పారు.

ఆయన చెప్పిన వివరాలు:

రామతీర్థంలో సంఘటన జరిగిన నాలుగు రోజులు పట్టించుకోని ప్రభుత్వం ఈ నెల రెండవ తేదీన తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పర్యటించడానికి సిద్దపడగానే ఆందోళన చెందింది. అందుకే ఆ రోజు చంద్రబాబు కంటే ముందే వైకాపా ఎంపి విజయసాయి రెడ్డి కొండపైకి వెళ్ళి సాక్ష్యాలు చెరిపి వేశారు.

చంద్రబాబుకు అడుగడుగునా ఆటంకాలు కల్పించారు. తీరా కొండపైకి వెళ్లిన తరువాత గుడి తలుపులు మూసేశారు.  అలాగే దీనిపై సిబిఐ విచారణ జరపాలని చంద్రబాబు కోరితే సిఐడి విచారణకుఆదేశించారు. సిఐటి  చివరకు  అన్య మతస్తుడైన ఎడిజి సునీల్ కుమార్ ను దర్యాప్తు అధికారిగా నియమించారు.

మంగళవారం సంఘటన స్ధలంలో పర్యటించిన సునీల్ కుమార్ విగ్రహ విధ్వంసం పక్కా ప్రణాళికతో జరిగిందని చెప్పడం గమనార్హం.

దీనిని బట్టి ఈ కేసును తప్పదారి పట్టించి రాజకీయ రంగు పూసే ప్రయత్నం జరుగుతున్నదని భావించాల్సి వస్తోంది.  ప్రభుత్వ సలహాదారైన సజ్జల రామకృష్ణారెడ్డి రిపోర్టునే సునీల్ కుమార్ దర్యాప్తు రిపోర్టుగా కోర్టుకు సమర్పించబోతున్నారు.

మంగళవారం బిజెపి నేతలు , స్వాములను కొండపైకి వెళ్ళకుండా నిర్బంధించడంలోను కుట్ర దాగివుంది. ఎంపి విజయసాయి రెడ్డిని కొండపైన, గుడిలో యధేచ్ఛగా తిరగనిచ్చిన ప్రభుత్వం ప్రతిపక్ష నేత చంద్రబాబును గుడిలోకి, మిగిలిన వారిని కొండపైకి అనుమతించక పోవడమం వెనుక  మతలబు ఏమిటి?

ముఖ్యమంత్రి, హోంమంత్రి, డిజిపి, దర్యాప్తు అధికారి అందరూ అందరూ ఒకే మతస్తులు కావడంతో హిందువులకు న్యాయం జరుగుతుందనడం సందేహాస్పదం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దీనిపై సిబిఐ దర్యాప్తు చేయించాలని లేదా సిఐడి దర్యాప్తు అధికారిని అయినా మార్చాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *