ఒక కిడ్నాప్ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, ఆళ్లగడ్ద మాజీ ఎమ్మెల్యే అఖిలప్రియ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను బోయినపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బోయిన్ పల్లిలో నిన్నబ్యాడ్ మింటన కళాకారుడు ప్రవీణ్ రావు,ఆయన సోదరుడి కిడ్నాప్ జరిగింది.
వీరు ముఖ్యమంత్రి కెసిఆర్ బంధువులని చెబుతున్నారు. దీనితో పోలీసులు ఆగమేఘాల మీద దర్యాప్తు ప్రారంభించారు. కేసు ను చేధించారు.
సంచలనం సృష్టించిన ఈకేసులో ప్రాథమిక విచారణలో దొరికిన ఆధారాలతో ఆంధ్రప్రదేశ్ ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే అఖిల అరెస్టు జరిగింది. ప్రవీణ్ రావుకి, భూమా అఖిల ప్రియ కుటుంబానికి ఒక భూమి విషయం తగాదా ఉందని, ఈ గొడవల వల్లే ప్రవీణ్ రావుని ఆయన సోదరులను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని చెబుతున్నారు. వారు ప్రవీణ్ రావును వికారాబాద్ లోని ఒక ఫామ్ హౌస్కు తీసుకెళ్లారు. అయితే, పోలీసులు ఈ కేసును చాలా ఈజీగా చేధించారు.దీనితో అఖిల ప్రియ కుటుంబం గురించి బయటపడింది. దీని ఫలితమే అరెస్టు. ప్రవీణ్ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసు టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగింది.
ఈ కేసులో ఆమె భర్త భార్గవ్ కోసం కూడా పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. భార్గవ్ సోదరుడు చంద్రహాస్ పోలీసుల అదుపులో ఉన్నారు. హఫీజ్ పేటలోని ఖరీదైన భూమి కి సంబంధించి ఈ రెండు కుటుంబాల మధ్య గొడవ నడుస్తూ ఉందని మీడియాలో రాస్తున్నారు.
తెలుగుదేశం ప్రభుత్వంలో ఆమె టూరిజం మంత్రి గా ఉన్నారు.
అఖిల ప్రియను ఆమె సొంత కారులోనే తరలించారు.