ప్రభుత్వం వేధిస్తున్నది, జోక్యం చేసుకోండి: IPS అసోసియేషన్ కు ఎబివి లేఖ

ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం తనపై క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టు చేసిమళ్లీ సస్పెండ్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉందని, ఈవిషయంలో అసోషియేషన్ జోక్యం చేసుకోవాలని  1989 బ్యాచ్ కుచెందిన సీనియర్ ఐపిఎస్ ఆఫీసర్  ఏబీ వెంకటేశ్వరరావు ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్‌కు లేఖ రాశారు.

వెంకటేశ్వరరావు గతంలో చంద్రబాబు నాయుడు  ముఖ్యమంత్రి గా ఉన్నపుడు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నారు. జగన్ ముఖ్యమంత్రి కాగానే ఆయనను పదవినుంచి తొలగించారు. ఆయన మీద అవినీతి కేసు బుక్ చేశారు. తర్వాత సస్పెండ్ చేశారు. తర్వాత కోర్టు ద్వారా పునర్నియామక ఉత్తర్వులు తెచుకున్నారు. అయితే, తనని వేధించడం,అవమానించడం ఆగిపోలేదని ఆయన ఐపిఎస్ ఆఫీసర్ల ఆసోయేషన్  తెలిపారు.

తన మీద  కేసులు పెట్టందుకుప్రభుత్వం కుట్ర చేస్తున్నదని, దీనికి తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే నెలల తరబడి తనను ఉద్యోగం చేయనీయకుండా, జీతం ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం వేధిస్తున్నదని ఆయన లేఖలో పేర్కొన్నారు.

వెంటనే ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్‌ జనరల్ బాడీ ఏర్పాటు చేస్తే అన్ని విషయాలు ఆధారాలతో సహా వివరిస్తానని, నిష్పక్షపాత విచారణ జరగాలన్నది తన డిమాండ్ అని వెంకటేశ్వరరావు ఆ లేఖలో వివరించారు.

తన సభ్యుడిని ప్రభుత్వం వెటాడి వేధిస్తున్నపుడు , ఈకేసును పరిగణనలోనికి తీసుకుని మద్దతు ప్రకటించడం చేయాలని, అలాకాకపోతే, అసోసియేషన్ కు అదొక మాయని మచ్చ అవుతుందని ఆయన మూడు పేజీల లేఖలో పేర్కొన్నారు. లేఖ కాపీని కేంద్ర ఐపిఎస్ అధికారుల అసోసియేషన్ కూడా పంపించారు.

“ I am not seeking any favours from the Association but seeking attention as it is only a case of harassment by the government, without an iota of evidence, against an officer for their own nefarious ends,” అని ఆయన లేఖలో రాశారు.

గతంలో ఇలా ఐపిఎస్ అధికారలు ఇబ్బందులకు గురయినపుడు అసోసియేషన్ ఆదుకుందని చెబుతూ రాజేంద్రనాథ్ రెడ్డి కేసును ఉదహరించారు.

“… when Rajendranath Reddy, present ADGP Intelligence, AP was placed under suspension in 2009 December while he was working as CP, Vijayawada on the issue of  ‘escape ‘ of the then MP, Vijayawada from the hospital, the fellow IPS officers, including myself, met the then DGP and ensured that he was reinstated in  one week without any charges being pressed.” అని ఆయన ఆసోసియేషన్ కు గుర్తు చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *