హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా నెల్లిమర్ల సమీపంలోని రామతీర్థం కోదండ రామ స్వామి ఆలయం ఘటన పై త్రిదండి చినజీయర్ స్వామీజీ స్పందించారు. ఈ ఆలయంలో డిసెంబర్ 28న రాత్రి దుండుగులు ప్రవేశించి కోదండ రాముడి విగ్రహం శిరచ్ఛేదం చేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన రాష్ట్రాన్నికుదిపేస్తూ ఉంది. దీని మీద ఈరోజు బిజెపి-జనసేన రామతీర్థానికి ధర్మ యాత్ర చేయాలనుకోవడం, ఫలితంగా హౌస్ అరెస్టు, అరెస్టులతోరాజకీయ వాతావారణం వెేడెక్కింది.
ఈ నేపథ్యంలో చిన్న జీయర్ స్వామి స్పందించారు. తాడేపల్లిలోని విజయకీలాద్రిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో ఆలయాలలోని విగ్రహాలకు రక్షణ లేదని, ఏ సమయంలో ఏంజరుగుతుందో తెలియని పరిస్థితి ఇక్కడ నెలకొందనిఆయన వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ లోని దేవాలయాల పై దాడులకు వ్యతిరేకంగా ఈ నెల 17 నుండి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనచేయాలని నిర్ణయించారు.
రామతీర్థం సహా ఏపీ లో ఇటీవల దాడులకు, అపవిత్ర కార్యాలకు గురైన దేవాలయాలన్నటింటిని ఆయన సందర్శిస్తారు.
ఆలయాల పరిరక్షణ కు తీసుకోవాల్సిన చర్యల తో పాటు దీర్ఘకాలిక చర్యల గూర్చి స్థానికులతో ప్రజలకు బోధన చేస్తారు. ఎక్కడ నుంచి యాత్ర ప్రారంభించాలనేది ఇంకా నిర్ణయించలేదని,తొందర్లోనే ప్రకటిస్తామని తెలిపారు.
“దెబ్బతిన్న ఆలయాలన్నింటినీ పరిశీలించిన తర్వాత ఏం చేస్తే బాగుటుందనే దానిపై పెద్దలతో కలిసి ఒక నిర్ణయం తీసుకుంటాము. ఇలాంటి దాడులు చర్చి, మసీదులపై జరిగినా కూడా తీవ్రంగా స్పందించాలి. దేవాలయం స్థానంలో చర్చి కానీ, మసీదు కానీ ఉంటే ప్రపంచం మొత్తం కదిలేది. యాబైకి పైగా విగ్రహాలపై దాడులు జరిగాయని అధికారింగానే తెలుసున్నది. “ అని ఆయన అన్నారు. అంతకు ముందు ఆయన టిిటిడి ఛెయిర్మన్ ను కూడా కలుసుకున్నారు.