చంద్రబాబునాయుడు రామతీర్థం వెళ్లేవరకు అక్కడున్న జిల్లామంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆ జిల్లాకు చెందిన ఇన్ ఛార్జ్ మంత్రిబోత్సా సత్యనారాయణ ఆలయం వైపు కన్నెత్తయినా చూడకుండా ఏం చేశారని తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది.
ఎవరు వెళ్లమంటే రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి రామతీర్థం వెళ్లారు. చంద్రబాబు వెళ్లాలనుకున్నతర్వాతే, చంద్రబాబు కంటే ముందే చేరుకోవాలని విజయసాయి రెడ్డికి చెప్పిందెవరు?
రాజకీయ కుట్రలో భాగంగానే విజయసాయి రామతీర్థం వెళ్లాడు. అక్కడున్న వారిని రెచ్చగొట్టి, చంద్రబాబుపైకి ఉసిగొల్పాలని చూశాడు. అవేవీసాధ్యం కాకపోవడంతో, చావుతప్పి కన్నులొట్టపోయి విశాఖకు పారిపోయాడు. విజయసాయిని రామతీర్థానికి పంపింది ముఖ్యమంత్రి కాదా? కావాలని రామతీర్థంలో గొడవలు సృష్టించాలని చూసింది వైసిపి నేతలు కాదా అని తెపాలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు విమర్శించారు.
రాష్ట్రంలో ఆలయాలమీద జరుగుతున్న దాడుల మీద ఈ రోజు టిడిపి పాలిట్ బ్యూరో సమావేశమై చర్చించింది. మంగళగిరిలోని ఎన్టీయార్ భవన్ లో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. అనంతరం కాల్వశ్రీనివాసులు, విలేకరులకు సమావేశం వివరాలు వెల్లడించారు.తెలంగాణ టిడిపిఅధ్యక్షుడు ఎల్ రమణ కూడా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో హిందూ ఆలయాలమీద దాడులు జరుగుతున్నాయి. ప్రతి పక్ష పార్టీ నేతల మీద దాడులు జరుగుతున్నాయి. మొత్తంగా రాష్ట్రంలో ఒక భయానక వాతావరణ నెలకొందని,దీని మీద టిడిపి పాలిట్ బ్యూరో ఆందోళన వ్యక్తం చేసిందని శ్రీనివాస్ తెలిపారు.
“టీడీపీ అధినేత ముందుగానే చెప్పి, అనుమతి తీసుకొని రామతీర్థానికి వెళితే, అడుగడుగునా అడ్డుకున్నారు. ఆయన వాహనశ్రేణికి లారీలు అడ్డుపెట్టారు. స్థానిక ప్రజలు చంద్రబాబు వెన్నంటి నిలిచి ఆయన్ని రామతీర్థానికి తీసుకెళ్లారు. ఆయన అక్కడకు వెళ్లాక, కులాలకు, పార్టీలకు అతీతంగా ప్రజలనుంచి లభించిన ఆదరణచూసిన ప్రభుత్వం, వెంటనే సంఘటనకు కారణమైన మూలాల్లోకి వెళ్లకుండా, జాగ్రత్తపడకుండా ప్రతిపక్షం పై తిరుగుబాటు ప్రారంభించింది,’ అని శ్రీనివాస్ పేర్కొన్నారు.
చంద్రబాబునాయుడు రామతీర్థం వెళ్లగానే వేలమంది తరలివచ్చి, హిందూధర్మాన్ని కాపాడాలని ఆయన్ని వేడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? జగన్మోహన్ రెడ్డిపై, ఈ ప్రభుత్వంపై వ్యక్తమైన ప్రజాగ్రహాన్ని చూసి, కడుపుమండి గుండెపగిలిన ప్రభుత్వం చంద్రబాబునాయుడిపై, అచ్చెన్నాయుడిపై, కళా వెంకట్రావుపై కేసులు పెట్టిందని ఆయన ఆరోపించారు.
కాల్వ ఇంకా ఏమన్నారంటే…
రాష్ట్ర ముఖ్యమంత్రి క్రైస్తవుడు, హోంమంత్రి క్రైస్తవమతాన్ని ఆచరిస్తారు. డీజీపీకూడా అదేమతానికి చెందినవ్యక్తి. వారు ముగ్గరూ ఒకేమతానికిచెందిన వారుఅయినప్పుడు, ఇతర మతాల భావోద్వేగాలకు సంబంధించిన అంశాల్లో చాలా సున్నితంగా, సుని శితంగా గమనించి వ్యవహరించాలి. కానీ వారు ఏనాడూ అలా చేయలేదు.
దుర్గగుడిలో సింహాలు మాయమైతే ఒక మంత్రి చులక నగా మాట్లాడాడు. ఆంజనేయస్వామి విగ్రహం ధ్వంసమైతే, విరిగింది బొమ్మేకదా అంటాడు.
హిందువులు, వారి ధర్మాలు రాష్ట్ర మంత్రులకు హేళనగా కనిపిస్తున్నాయి. వారి విశృంఖలత్వం, పైశాచకత్వం చివరకు రామతీర్థంలో రాముని శిరస్ఛేధం జరిగే వరకు తీసుకొచ్చింది.
ఈముఖ్యమంత్రి నిజంగా లౌకిక వాదే అయితే, అన్నిధర్మాల పట్ల సమానఆదరణ చూపేవాడే అయితే, తనమంత్రివర్గంలోని వ్యక్తులుచేసిన వ్యాఖ్యలను ఎందుకు ఖండించ లేదని టీడీపీ ప్రశ్నిస్తోంది.
ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినప్పటినుంచీ, ఒక మతానికి అనుకూలంగానే వ్యవహరిస్తు న్నాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక జెరూసలెం వెళ్లినా తాము తప్పుపట్టలేదు. ఒక మతాన్ని గౌరవించడాన్ని, ప్రేమించడాన్ని తాము తప్పుపట్టడం లేదు. మరోమతంపై జరిగే దాడినే ఖండిస్తున్నాం. భారతదేశంలో ప్రజల్లానే రాష్ట్రంలోకూడా అన్నిమతాలవారు కలిసిమెలిసి ఉండాలనే అభిలషిస్తున్నాం.