కమర్షియల్ కాంప్లెక్స్ లో నారాయణ కాలేజీ, విద్యార్థి నేతల ఆందోళన

కర్నూలు నగరంలోని నారాయణ కళాశాలలో సరైన భద్రత ప్రమాణాలు కూడా పాటించడం లేదని, కమర్షియల్ కాంప్లెక్స్ లో కాలేజీ నిర్వహిస్తున్నారని, ఇది ప్రమాదకరమని జిల్లా విద్యార్థి సంఘాల జెఎసి చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు ఆందోళన వ్యక్తం చేశారు.

“ఐదు అంతస్తుల భవనాలలో కేవలం ఒక్క చోట మాత్రమే స్టెప్స్ ఏర్పాటు చేశారు. గోడలకు గ్రిల్స్ లేకుండా ఇష్టానుసారంగా బిల్డింగ్స్ ఉన్నాయి., దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే విద్యార్థులు ఆ బిల్డింగ్ లో చిక్కుకొని బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. దీనిని దృష్టిలో పెట్టుకుని కళాశాల యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలి,’ అని కర్నూులు జిల్లా డిఆర్ఓ  పుల్లయ్య ని కోరారు.

భద్రత ప్రమాణాలు పాటించని నారాయణ కార్పొరేట్ కళాశాలల గుర్తింపు రద్దు చేసి, యాజమాన్యం పై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని విద్యార్థి సంఘాల జెఎసి నేతలు కోనేటి వెంకటేశ్వర్లు, ఎం మోహన్, ఎంవిఎన్ రాజు యాదవ్, బండారి సురేష్ బాబు, బి భాస్కర్ నాయుడు  కలెక్టరేట్ లో జిల్లా రెవెన్యూ అధికారి కి కలసి వినతి పత్రం సమర్పించారు.

“నారాయణ విద్యా సంస్థల తప్పుడు ప్రచారాలు నమ్మి కర్నూలు జిల్లాలో అనేక మంది విద్యార్థులు చేరి చివరకు సరైన మార్కులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.  కర్నూలు నగరంలో గత నెల బైపిసి ఫస్టియర్ పూర్తి చేసుకున్న విద్యార్థిని ఒకరు తక్కువ మార్కులు రావడంతో ఆత్మహత్య చేసుకున్నారు. డిసెంబర్ 31 తేదీన మరో విద్యార్థి ప్రమాదవశాత్తు కింద పడి గాయపడ్డాడు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నారాయణ కళాశాల యాజమాన్యం కచ్చితం భద్రతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలి,’ అని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *