గుడివాడ పేకాట ఎందుకు రచ్చరచ్చయిందంటే….

గుడివాడ పేకాట గొడవ రచ్చరచ్చ అయింది. నిన్న పోలీసులు వెళ్లి ఒక పేకాట శిబిరం మీద దాడి చేసి  33  మంది అరెస్టు చేయడంతో గుడివాట పేట  బ్యానర్ న్యూస్ అయింది. ఎందుకంటే. అంతవరకు గుడివాట పేకాటకేంద్రంమని జనసేన పవన్ కల్యాణ్,  కాదు, పేకాటను నిర్మూలించాలనని మంత్రి  కొండాలి వెంకటేశ్వరరావు (నాని) చెబుతూ వచ్చారు. ఈ మధ్యలో తెలుగుదేశం  ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేకాట శిబిరం మీద రైడ్ జరగిందని భారీగా డబ్బు దొరికిందని  నిన్న మీడియాలో చెప్పారు. దీనితో  కృష్ణా జిల్లాఎస్ పి రవీంద్ర నాథ్ బాబు మీడియా ముందుకు వచ్చి రైడ్ జరిగిన విషయాన్ని ధృవకరించారు.కోట్లలో కాదుగాని భారీ డబ్బు స్వాదీనం మయిందని 33 మందిఅని అరెస్టు చేశామని చెప్పారు.

దీనితో గొడవ మొదలయింది.

ఈ  పేకాటి శిబిరం నిర్వహణ వెనక మంత్రి నాని ఉన్నాడని, ముందున్నదేమో మంత్రి కొడాలి నాని  అనుచరుడు దొండపాడు పీఏసీఎస్ అధ్యక్షుడు మురళీ అని చెబుతూ ముఖ్యమంత్రి వెంటనే నానిని క్యాబినెట్ నుంచి తొలగించాలని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు

బిజినెస్ మెన్, భరత్ అనే నేను సినిమాలు చూడటం కాదు జగన్ అనే నేను అని ప్రమాణం చేసావు కదా దమ్ము, ధైర్యం ఉంటే పేకాట రాయుడ్ని బర్తరఫ్ చెయ్యండి అని ఆయన ఈరోజు జగన్ కు  సవాల్ విసిరారు.

జగన్ గుడివాడ సంక్రాంతి సంబరాలకు వచ్చి శిబిరాలను ప్రోత్సహించారు 19 నెలలుగా  ఆధ్వర్యంలో పేకాట శిబిరాలు నిర్వహిస్తుంటే యంత్రాంగం ఏం చేస్తున్నదని ఆయన ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతోనే ఒక బాధ్యత గల మంత్రి ఈ రకంగా బూతులు మాట్లాడుతూ యంత్రాంగాన్ని భయపట్టే విధంగా వ్యవహరిస్తున్నారని తీవ్రమయిన ఆరోపణ చేశారు.

దేవినేని ఉమ చేసిన తీవ్రమయిన ఆరోపణలు

నిన్న రాత్రి కోట్ల రూపాయలు డబ్బులు దొరికి వాహనాలు సీజ్ అయితే ఏ సెక్షన్ల పై కేసులు పెట్టారు కోర్టుకు ఎందుకు పెట్టలేదు

42 లక్షలు దొరికాయని డిఎస్పీ, 55లక్షలు దొరికాయని ఎస్పీ చెప్తున్నారు ప్రజలు 10కోట్లు దొరికాయని చెప్తున్నారు మిషన్లతో లెక్కించిన గోనెసంచుల్లో పట్టబడ్డ డబ్బులన్నీ తాడేపల్లి రాజప్రసాదానికి వెళ్లాయా ?

 

ముఖ్యమంత్రి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి  కొడాలికి వాటాల్లో తేడా వచ్చే సరికి పేకాట శిబిరాలు బయటకు వచ్చాయి

 

బూతులమంత్రి పేకాటశిబిరాలతో వేలాదికుటుంబాలు రోడ్డునపడ్డాయి, తమిరశలో గడ్డంగ్యాంగ్ పేకాట డెన్ లో ఒకరోజు టర్నోవర్ ఇరవైకోట్ల పైనే

పట్టుబడిన మొత్తాన్ని కోర్టులో స్వాధీనం చేయాలి

మంత్రి, అనుచరులపై కేసు నమోదుచేసి మంత్రిని బర్తరఫ్ చేసి, సిబిఐతో సమగ్రవిచారణ చేయించాలి

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *