ఆంధ్రప్రదేశ్ తమ్మినేని సీతారాం దేశంలోనే విలక్షణమయిన స్పీకర్.సాధారణంగా స్పీకర్లు బాగా తక్కువగా మాట్లాడతారు. సంచలన ప్రకటనలు చేయరు. అయితే, ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారం రాజకీయాల్లో కొత్త వరవడి సృష్టించారు. ఆయనే ఎక్కడున్నా ఆయనే ప్రధాన స్పీకర్ అవుతారు. ఘాటైన వ్యాఖ్యాలు చేస్తారు. పదునైన విమర్శలు చేస్తారు. సభలోనే కాద, సభ వెలుపల కూడా ఆయన తన ఉనికిని చాలా బిగ్గరగ ప్రకటిస్తారు. ఈ రోజు శ్రీకాకుళంలో మాట్లాడుతూ ఆయన ప్రతిపక్ష నాయకుడుచంద్రబాబు నాయుడి మీద ఇలాగే దాడి చేశారు. పత్రికల వాళ్ల భాషలో చెప్పాలంటే ‘విరుచుకు పడ్డారు’.
ప్రతిపక్షనాయకుడికి, రూలింగ్ పార్టీకి వాగ్యుద్ధం కామన్. ఇపుడు రామతీర్థం సంఘటన మీద రూలింగ్ ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలయుద్దం నడుస్తూ ఉంది. ఇందులోటిడిపి తరఫున చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడ, కొత్తపల్లి జవహర్, దేవినేని ఉమా, కాల్వ శ్రీనివాసులు,బండారు సత్యానారాయణ మాట్లాడుతూంటే, వీళ్లకి మంత్రులు బోత్సా సత్యానారయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని, విజయసాయిరెడ్డి, ఇలా ఎందరో సమాధానమిస్తున్నారు. ఇందులో స్పీకర్ ప్రమేయం అవసరం లేదు. అయినా సరే, తమ్మినేని సీతారాం రంగ ప్రవేశం చేశారు చంద్రబాబు నాయుడిిని తీవ్రంగతా మందలించారు, హెచ్చరించారు.
ఇవిగో ఆయన చేసిన ఘాటైన సంచలన వ్యాఖ్యలు:
రామతీర్థం ఘటనలో నిందితులను పట్టుకుని శిక్షించే పయత్నం చేస్తుంటే నీతిమాలిన రాజకీయం చేస్తున్నారు.
అలిపిరి సంఘటన చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలి.
వెంకటేశ్వరస్వామి ఒకసారి హెచ్చరిక చేసినా చంద్రబాబుకు ఇంకా బుద్ధిరాలేదు.
శ్రీరాముడు పుట్టిన రామభూమిలో జరిగిన ఈ ఘటనను ఎవరిమీదకు నెట్టేస్తారు?
మతాలు , కులాల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టేందుకు చేసే కుట్ర ఇది?
దోషులు ఎవరైనా సరే ప్రభుత్వం శిక్షిస్తుంది?
ప్రభుత్వం పై బురదజల్లి రాజకీయలబ్ధి పొందాలని చూడటం సరికాదు?
రాముడిని ఆరాధించే సమాజం ఇది… తప్పు ఎవరు చేసినా తప్పే?
దేవాలయాల్లో జరుగుతున్న ఘటనల్లో సీఎం జగన్ పై బురద జల్లాలని చూస్తున్నారు?
ఒక్కసారి గతానికి వెళ్లండి,దేవాలయాలకు సంబంధించి ఎవరెన్ని కుంభకోణాకు పాల్పడ్డారో చరిత్ర చెబుతుంది?
వైసీపీ పార్టీకి పెరుగుతున్న ప్రతిష్టను ఓర్వలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు?
కుట్రతో , పథకం ప్రకారం దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేసి జగన్ పై ఆరోపణలు చేస్తున్నారు?
మనుషుల్లో దేవుడిని చూసే గొప్ప మానవతావాది సీఎం జగన్?
శ్రీరామచంద్రుడుని పూజించే గొప్ప వ్యక్తి జగన్?
అలాంటి వ్యక్తి పై నీలాపనిందలు వేయడం సరికాదు?
జగన్ పై వస్తున్న ఆరోపణలను అందరూ ముక్తకంఠంతో ఖండించాలి?
దేవాలయాల్లో విధ్వంసాలకు పాల్పడుతున్న వారు ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎంను కోరుతున్నా?