కాంగ్రెస్ నేత జంగా రాఘవరెడ్డి అరెస్టు పై వరంగల్ సిపి వివరణ

భూతగాదా విషయంలో కిడ్నాప్ పాల్పడినట్లుగా ఖచ్చితమైన ఆధారాలతోనే జనగాం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డిని అరెస్టు చేసినట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్  పి. ప్రమోద్ కుమార్ శనివారం ప్రకటించారు.
జనగాం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడుని కుట్రపూరితంగా పోలీసులు అరెస్టు చేసినట్లుగా కాంగ్రెస్ రాష్ట్రనేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని   వరంగల్ పోలీసు కమిషనర్  వాఖ్యానించారు.    ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ నేతలు ఈ రోజు వరంగల్ జైలుకు వెళ్లి తమ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
జంగా రాఘవ రెడ్డి అరెస్టు మీద కాంగ్రెస్ నేతల నిరసన
పోలీస్ కమిషనర్ వివరణ ఇది:
జంగా రాఘవ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడంలో ఎలాంటి ఒత్తిళ్ళు లేవు. ఇది కేవలం ఓ ఫిర్యాది ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు స్పందించి అరెస్టు చేయడం మాత్రమే. నిందితుడు జంగా రాఘవరెడ్డి ఫిర్యాదిని బెదిరించి కొట్టి అతనిని కిడ్నాప్ చేయడం లాంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడటంతోనే అతనిపై కేసు నమోదు చేయడం జరిగింది. నిందితుడు రాఘరెడ్డి నిజంగా ఎలాంటి నేరానికి పాల్పడనప్పుడు అతనే స్వయంగా పోలీసుల ముందుకు వచ్చి సంజాయిషీ ఇవాల్సింది. కాని అతడు అలా చేయకుండా తాను నేరానికి పాల్పడినట్లు తన అంతరాత్మకు తెలుసుకాబట్టి తన పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయిన మరుక్షణమే రాఘవరెడ్డి అజ్ఞాతంలోకి జారుకున్నాడు. అయినా పోలీసులు అరెస్టు చేసింది వరంగల్ కమిషనరేట్ పరిధిలో భూకజ్జాలకు పాల్పడుతూ, తన మాటవినని వారిపై తన అనుచరులతో దాడులకు పాల్పడంతో పాటు, అవసరమనుకుంటే కిడ్నాపులకు పాల్పడి భాధితులతో పాటు వారి కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాడు. ఇదే  తన వృత్తిగా ఎన్నుకున్న ఓ రౌడీ షీటర్‌ను ఘన చరిత్ర కలిగిన వున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు నిందితుడుతరఫున వకాల్తా పుచ్చుకోవడం సరికాదు. ఇతని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏడుకు పైగా కేసులు వివిధ పోలీసు స్టేషన్లలో నమోదయి వున్నాయి.  కాంగ్రెస్ నాయకులు దీనిని గుర్తించాల్సి వుంది. ముఖ్యంగా వరంగల్ పోలీసులు ప్రజల పక్షాన పనిచేస్తారు. ఎవరైతే ప్రజల ఆస్తులకు నష్టం కలిగిస్తారో, వారి హక్కులను భంగం కలిగిస్తారో, అలాంటి వారిపైనే తక్షణం చర్యలు తీసుకుంటుంది. మీ స్వార్ధం కోసం, ఓ నేరస్తుడి విడుదల కోసం కాంగ్రెస్ నాయకులు పోలీసులపై అసత్య ప్రచారం సరికాదు. ఇకనైనా కాంగ్రెస్ నాయకులు తమ ఆలోచన విధానంలో మార్చుకుంటారని కోరుకుంటున్నాను.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *