టీఎస్‌ఆర్టీసీ సంక్రాంతికి 5 వేల స్పెషల్ బస్సులు

హైదరాబాద్: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ నెల 8 నుంచి 14 వరకు తెలంగాణలోని వివిధ ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్‌కు టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపుతున్నది.   హైదరాబాద్ నుంచి తెలంగాణలోని జిల్లాలతో పాటుె  ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు 4,980 ప్రత్యేక బస్సులను నడుపుతుంది. వాటిలో తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు 3,380 ప్రత్యేక బస్సులు, ఏపీకి 1,600 బస్సులను నడుపుతుంది. ఈవిషయాన్ని టిఎస్‌ఆర్టీసీ రంగారెడ్డి జిల్లా ప్రాంతీయ మేనేజర్ బి.వరప్రసాద్‌ వెల్లడించారు.

వివరాలు:

నగరంలోని ఎంజీ బస్ స్టేషన్, జూబ్లీ బస్ స్టేషస్, సెంట్రల్‌ బస్ స్టేషన్‌ (సీబీఎస్‌), ఉప్పల్ క్రాస్ రోడ్, ఎల్బీ నగర్, లింగంపల్లి, చందానగర్, ఈసీఐఎల్‌, కేపీహెచ్‌బీ కాలనీ, ఎస్‌ఆర్‌ నగర్, అమీర్‌పేట, టెలిఫోన్ భవన్‌, దిల్‌సుఖ్‌నగర్‌ ప్రయాణ ప్రాంగణాల నుంచి ప్రత్యేక బస్సులు నడుస్తాయి.

జంట నగరాల పరిధిలోని శివారు కాలనీలలో నివసించే వారికి సమీపంలోని ముఖ్యమైన పాయింట్ల నుంచి కూడా ప్రత్యేక బస్సులను నడపుతారు.

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విజయనగరం, తెనాలి, గుంటూరు, గుడివాడ, రాజమండ్రి, కాకినాడ, రాజోలు, పోలవరం, మచిలీపట్నం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, విశాఖపట్నం, శ్రీకాకుళం, భీమవరం, నర్సాపురం, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, ఉదయగిరి, కనిగిరి, కందుకూరు, పామూరు, పొదిలి తదితర ప్రాంతాలకు సంక్రాంతి ప్రత్యేక బస్సులు నడుస్తాయి. పండుగ వేళ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా www.tsrtconline.in వెబ్‌సైట్‌ ద్వారా అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ చేసుకునేందుకు ఏర్పాట్లు కూడా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *