తెలంగాణలో ప్రజలు కొత్త సంవత్సరానికి ప్రశాంతంగా, జోరుగా హుశారుగా స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన అయిదు విశేషాలు:
1. తెలంగాణలో కొత్త సంవత్సరం రోజును ప్రజలు ఫుల్ గా మందు సేవిచారు. మొత్తం రు. 759 కోట్ల వ్యాపారం జరిగింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మెదక్ జిల్లాల్లోనే భారీగా మద్యం కొన్నారు. ఈ జిల్లాల సేల్స్ దాదాపు రు. 300 కోట్లు.ఒక్క గురువారంసాయంకాలమే కొన్ని గంటల్లోనే రు. 189 కోట్ల మద్యం అమ్ముడువోయింది.
2. కొత్త సంవత్సరం వేడుకల్లో హైదరాబాద్ లో ఒక్క రోడ్డుప్రమాదం కూడా జరగ లేదు. డిసెంబర్ 31 రాత్రి 10 గంటలనుంచి శుక్రవారం అంటే జనవరి 1 తెల్లవారుజామున 4 గంటల దాకా ఒక ప్రమాదం నమోదుకాలేదు. నెక్స్ స్ రోడ్డు న్యూ ఇయర్ కోలాహాలానికి అందుబాటులో లేకుండా పోయింది.
3. హైదరాబాద్ నగరంలో ని ముగ్గురు పోలీస్ కమిషనర్లు స్వయాన రోడ్డెక్కి న్యూయర్ వేడుకలు ఎక్కడా పగ్గాలు తెంచుకోకుండా జాగ్రత్త తీసుకున్నారు. పబ్ లు, బార్లు ఆంక్షలను ఉల్లంఘించలేదు.
4.హైదరాబాద్,సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లలో డ్రంక్ డ్రైవ్ కేసుల మీద గట్టి నిఘా పెట్టడంతో 1814 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు గచ్చిబౌలి, మాదాపూర్, కూకట్ పల్లి, మియాపూర్ , జీడిమెట్ల లలోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి.
5. ఎక్కువ వేడకలు జరగాల్సిన ఐటి కారిడార్ కొత్త సంవత్సరానికి చలా సైలెంట్ గాస్వాగతం పలికింది.