‘నగరి నోస్’ చిత్తూరు జిల్లాలో ని ఎత్తయిన శిఖరం.దూరాన్నుంచి ఈ శిఖరం పక్షి ముక్కులాగా కనిపిస్తుంది (పై ఫోటో). దక్షిణ భారతదేశంలోని ఎత్తయిన శిఖరాల్లో ఒకటి. బ్రిటిష్ కాలంలో ఈ శిఖరాన్ని సంట్రీ టవర్ గా వాడే వారు. ఇపుడు ఈ అందమయిన శిఖరాన్ని విస్మరించారు. సముద్ర మట్టం నుంచి 855 మీ ఎత్తున ఉంటుంది. కొద్ది సేపటి కిందట రచయిత భూమన్ (తిరుపతి ) బృందం ఇక్కడి నడుచుకుంటూ వెళ్లింది.
ఎక్కడో సుదూరంగా ఉన్న ప్రదేశాలను సందర్శించేముందు తెలుగువాళ్లంతా ముందు తెలుగు నేల సొబగు చూడాలని భూమన్ చెబుతుంటారు. ఆయన తిరుపతి చుట్టూర అడవుల్లో కొండల్లో ఉన్న దర్శనీయ ప్రదేశాలు అంటే కోనలు,గుండాలు, మడుగులు, జలపాతాలను అన్వేషించే పనిలో ఉన్నారు. ఈ రోజు ఆయన నగరి నోస్ కు పాదయాత్ర (ట్రెక్ ) జరిపారు.
నగరి నోస్ మీది నుంచి తీసిన వీడియో ఇది.