డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవాళ్లు టెర్రరిస్ట్ లతో సమానం: సజ్జనార్

తెలంగాణ రాజధాని సైబరాబాద్ పరిధిలో మద్యం సేవించి  వాహనం నడిపితే ఐపీసీ 304 కింద కేసులు నమోదు చేసి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడేలా చూస్తామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవాళ్లు టెర్రరిస్ట్ లతో సమానం అని ఆయన వర్ణించారు.
కరోనా సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను పోలీసులు నిలిపివేశారు.
అయితే, ఇపుడు మళ్లీ ప్రారంభించారు. పెద్ద ఎత్తున యువకులు డ్రంక్ డ్రైవ్ కు పాల్పడుతూ ఉండటం పోలీసులు గుర్తించారు. అందుకే కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు.
నిన్న ఒక్క రోజే 402 మంది తాగి వాహనం నడిపినవారిపై కేసులు నమోదు చేశామని చెబుతూ  ఈ వారం మంతా సైబరాబాద్ పరిధిలో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ టీమ్స్ నిఘా ఉంటుందని సజ్జనార్ తెలిపారు. వీరు  ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, ఏఆర్ తో అదనంగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పాల్గొంటారని, తాగి రోడ్లపైకి వచ్చి డ్రైవ్ చేసేవారిని ఎవ్వరినీ వదిలేది లేదు.
సైబరాబాద్ 2020 నేరాలిలా ఉన్నాయి…
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2020 లో 6.65 శాతం క్రైమ్ రేట్ పెరిగింది.
సైబర్ క్రైమ్ నేరాలు 135 % పెరిగాయి. ఆర్థిక నేరాలు 42 % పెరిగాయి. హత్యలు, హత్యాయత్నాలు 8 శాతం తగ్గాయి. దోపిడీలు, చోరీలు గత ఏడాది తో పిలిస్తే 12 శాతం తగ్గాయి.
రోడ్డు ప్రమాదాలకు సంబంధించి 625 కేసులు నమోదు అయ్యాయి. అంటే గత ఏడాది పోలిస్తే 22.7 శాతం తగ్గాయి . మహిళలు వేధింపులకు సంబంధించి 2302 కేసులు నమోదు కాగా గత ఏడాది తో పోలిస్తే 18.66 శాతం తగ్గాయి.
చిన్న పిల్లలు పై వేదింపులు 559 కేసులు నమోదు అయ్యాయి. అలాగే ఈఏడాది 76 మర్డర్ కేసులు నమోదయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *