తాండూరు మునిసిపల్ కౌన్సిల్ వద్ద తన్నుకున్న టిఆర్ ఎస్ తమ్మళ్లు

తాండూర్ మున్సిపాలిటీ పై ఆధిపత్యం కోసం ఎమ్మెల్యే పైలేట్ రోహిత్ రెడ్డి, మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ల మధ్య పోరు నడుస్తూ ఉంది. అయితే, ఈ రోజు జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఎజెండా అంశం మీద  అధికార తెరాస పార్టీలో చిచ్చు పెట్టింది. పార్టీ  రెండు వర్గాలుగా విడిపోయింది.
సమావేశం ప్రారంభమయ్యాక ఎజెండా అంశం చదువుతుండగానే కమిషనర్ ప్రమేయం లేకుండా ఎజెండా తయారు చేశారని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ జెండా ని చెత్తబుట్టలో వేయాల్సిందేనని అన్నారు.
పట్టణంలో పాడైన రోడ్లతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే సుమారు కోటిన్నర రూపాయల తో స్వాగత బోర్డులు( ఒక్కొక్కటి 40 లక్షల రూపాయలు, మొత్తం నాలుగు స్వాగత బోర్డులు) ఏర్పాటు చే అంశాన్ని అజండాలో చేర్చడానికి ఆయన అభ్యంతరం తెలిపారు.
దీంతో కాంగ్రెస్ సిపిఐ టీజెఎస్ సభ్యులు సమావేశంలోనే ఎజెండా కాపీని చించి స్టేజి పై కూర్చున్న కమిషనర్ పై విసిరేశారు. ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించారు.ఎమ్మెల్యే ఎమ్మెల్సీల మధ్య మాటల తూటాలు పేలాయి.అనంతరం ప్రతిపక్ష పార్టీల సభ్యులు లేకుండానే లేకుండానే ఎజెండాను ఆమోదింపజేశారు.
ఎమ్మెల్సీ, ఎమ్మెల్సీ తమ తమ అనుచరులతో సమావేశం ఏర్పాటు చేశారు.
 మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న తన ఛాంబర్లో అధికార పార్టీ కౌన్సిలర్ల తో సమావేశం నిర్వహిస్తుండగా… , ఎమ్మెల్యే అనుచరుడు, పట్టణ తెరాస సీనియర్ నాయకుడైన ఒక కౌన్సిలర్ భర్త నయీమ్ కు  ఎమ్మెల్సీ అనుచరుడు మసూద్ కు  మధ్య గొడవ మొదలయింది.   చైర్పర్సన్ చాంబర్ నుండి బయటకు వచ్చి రోడ్డు దాకా తన్నుకుంటూ వచ్చారు.
ఇదిలా ఉండగా నిబంధనలకు వ్యతిరేకంగా తయారు చేసిన ఏ జెండా పై డిసెంట్ నోటీసు ఇవ్వడానికి ప్రతిపక్ష పార్టీలైన బిజెపి, కాంగ్రెస్, సిపిఐ, టీజెయస్ కౌన్సిలర్లు వికారాబాద్ వెళ్లి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *