నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం భూములను వైద్య కళాశాలకు బదలాయింపుకు నిరసనగా రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉద్యమాన్ని ప్రారంభించింది. ఇందులో ఒక ముఖ్యమయిన ఘట్టం బిక్షాటన.
నంద్యాల ఒక ప్రభుత్వం వైద్య కళాశాల ఏర్పాటుకు పట్టణ పరిసర ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్న భూములను బదలాయింపు చేయడానికి ప్రభుత్వం సుముఖంగా లేదు.
ఈ మెడికల్ కాలేజీకి పట్టణంలో 115 సంవత్సరాల కిందట ఏర్పాటుచేసిన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనకేంద్రం భూములను తీసుకోవాలనుకుంటున్నారు. ఇవన్నీ పచ్చని పరిశోధనా పంటలభూములు. ఇక్కడ జరిగిన పరిశోధనలు దేశానికి ఎంతో మేలు చేశాయి. అయితే, మెడికల్ కాలేజీకి చుట్టపక్కల ఉన్న ప్రభుత్వ భూములను కేటాయించకుండా ఈ పచ్చని పొలాలను తీసుకోవాలనుకోవడానికి రాయలసీమల వ్యతిరేకత వచ్చింది. నిరసన వ్యక్త మయింది. అయితే, ప్రభుత్వ వాదన చిత్రంగా ఉంది. ప్రయివేటు భూములను కొనేందుకు ప్రభుత్వం దగ్గిర నిధులు లేవని అందుకే రీసెర్చ్ స్టేషన్ (RARS) భూములను తీసుకోవాలనుకుంటున్నట్లు ప్రభుత్వం చెప్పింది. దీనికిస్పందిస్తూ నిధులు మేము నిధులంందిస్తాం, భూములు కొనండి, ప్రాంతీయ పరిశోధనా కేంద్రం భూముల జోొలికి వెళ్ల వద్దని నేడు బిక్షాటన ప్రారంభించారు.
వైద్య కళాశాల ఏర్పాటుకు భూముల కొనుగోలుకు డబ్బులు లేవంటూ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం భూముల బదలాయింపుపై మొండి పట్టుదలతో ఉందని ప్రజలకు నచ్చ చెబుతూ వారి దగ్గిర నుంచి బిక్షం తీసుకుంటున్నారు. చివరకు బిక్షగాళ్లు కూడా ప్రభుత్వానికి నిధులు సమకూర్చేందుకు బిక్షమీయడానికి ముందుకు వచ్చారు..
బిక్షాటన కార్యక్రమాన్ని డిసెంబర్ 28, 2020 వెలుగోడు లో ప్రారంబించడమైనది.
వెలుగోడు మండలం ప్రజలు ఈ కార్యక్రమంలో అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలు, చిన్నారులు, వృద్దులు, యువకులు, విధ్యార్థులు, వ్యాపారులు, చిరు వ్యాపారులు, వాహనాల రిపైరు పనులు చేసేవారు, చెప్పులు కుట్టే ప్రొఫిషనల్స్ పైసలు దానం చేసారు. వీరితో పాటు మేము సైతం అంటూ సాధువులు, బిక్షగాల్లు కూడా పైసలు దానం చేసారు. పైసలు దానం చేసిన బిక్షాటన చేసి జీవనం గడిపే వ్యక్తి ఎందుకు దానం చేసావంటే “ప్రజల బాగుకోసం” అన్న సమాధానం పాలకులకు వినపడుతుంది, కదా!