జమ్మూ-కశ్మీర్‌లోని కథువాకు చెందిన పూజాదేవి కాశ్మీ ర్ రోడ్ల మీద హెవీ వెహికల్ నడిపిన మొట్టమొదటి మహిళా డ్రైవర్ అయ్యారు.
హెవీ వెహికిల్ డ్రైవింగ్ అనేది ఇంకా మగవాళ్ల గుత్తాధిపత్యంగానే ఉంది. అయితే, ఇపుడిపుడే మహిళలు బస్సులు నడిపేందుకు ముందుకు వస్తున్నారు. ఈ విషయంలో తెలంగాణకు ఎపుడో గుర్తింపు వచ్చింది. తెలంగాణకు చెందిన మహిళ ఒకరు ఢిలీ ఆర్టీసీ లో డ్రైవర్ గా ఉన్నారు. ఆమెయే మొట్టమొదటి ఆర్టీసి బస్ డ్రైవర్.అమె పేరు వంకాదరత్ సరిత. 2015లోనే ఆమె ఢిల్లీ ఆర్ టిసి మొదటి మహిళా బస్ డ్రైవర్ అయ్యారు. తెలంగాణలో ఆర్టీసీలోకి రావాలనేది ఆమె కోరిక. కుటుంబ పోషణకు మొదట ఆటో డ్రైవర్ గా మారి , తర్వత హోలీ మేరీ కాలేజ్ బస్ డ్రైవర్ గా మారారు. ఆటో డ్రైవర్ గా సరిత నాలుగేళ్లు పనిచేశారు. తర్వాత ఆమె కుటుంబం ఢిల్లీకి వలసపోయింది. అక్కడ ఆమె డిటిసిలో డ్రైవర్ ఉద్యోగం సంపాదించి దేశంలోనే మొట్టమొదటి బస్ డ్రైవర్ అయ్యారు. ఆమె రోజు 135 కి.మీ దూరం బస్సు నడుపేవారు. ఇపుడు జమ్ముకు చెందిన పూజాదేవి తెలంగాణ సరితలో బాటలో ప్రయాణిస్తున్నారు.
పూజాదేవీ ఒక ప్రవేట్ బస్సు లో డ్రైవర్ గా చేరారు. మొన్న సొంతవూరు కథువానుంచి జమ్ముకు బస్సు నడిపి కశ్మీర్ లో రికార్డు సృష్టించారు.
పూజాదేవి వయసులు 30 దాటాయి. అమెకు ఇద్దరు పిల్లలు. నిన్న బస్సునడుపుతున్నపుడు చిన్న కొడుకు ఆమె పక్కనే ఉన్నాడు.
Congratulations to J&K Jammu’s first woman bus driver Pooja Devi who ferries passengers from Kathua to Jammu. Proud of you @AnissaNabi1 @DrSyedSehrish @rachitseth @smritiirani @OfficeOfLGJandK @UN_Women pic.twitter.com/cVa3nOt1JB
— Randeep Bhandari (@BhandariRandeep) December 24, 2020