కెసిఆర్ నాగార్జున సాగర్ వ్యూహం మారుతున్నదా? నోముల ఫ్యామిలీకి ‘నోై

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో దెబ్బ తగిలాకా, అదే ప్రయోగాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ ఎస్ ) నాగార్జున సాగర్ లో చేయవద్దని భావిస్తూ ఉంది.
ఎందుకంటే నాగార్జునసాగర్ ఉపఎన్నికల  గెలుపును ముఖ్యమంత్రి చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారట. అందుకే ఎలాంటి ప్రయోగాలు చేయకుండా గెలుపే ధ్యేయంగా పనిచేయాలని, దాని కోసం ఏదైనా చేయాలని ఆయన పార్టీ నేతలకు సూచించారట.
  టిఆర్ ఎస్ ఎమ్మెల్యే  నోముల నరసింహయ్య హఠాన్మరణం (డిసెంబర్ 1)తో నాగార్జునసాగర్ ఉపఎన్నిక ఎదురవుతున్నది.దీనికి ఎన్నికల కమిషన్ ఎపుడైనా నోటిఫికేషన్ జారీ చేయవచ్చు.
సాధారణంగా సిటింగ్ ఎమ్మెల్యే చనిపోతే,  కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరికి  పార్టీ టికెట్ ఇవ్వడం  తెలుగు రాజకీయాల్లో ఆనవాయితీగా వస్తున్నది.
భర్త చనిపోతే, భార్యకు టికెట్ ఇవ్వడం జరుగుతుంది. భార్యకు వీలుకాకపోతే, వారుసుడికో వారసురాలికో టికెట్ ఇస్తారు. పూర్వం ఈ సానుభూతి చూపించి అన్ని పార్టీలను ఒప్పించి సాధ్యమైనంత వరకు ఎన్నిక ఏకగ్రీవంగా జరిగేలా చూసేవారు.
ఈ మధ్య ఎన్నిక ఏక్రగీవంగా జరగడం లేదు గాని, సాధ్యమయినంత వరకు భార్యకే టికెట్ ఇస్తున్నారు. ఆమె గెలుస్తూ వస్తున్నది.
కాని   ఈ వ్యూహం అనుసరించినా టిఆర్ ఎస్ కు దుబ్బాకలో పరాజయం ఎదురయింది. అక్కడి సిటింగ్ టిఆర్ ఎస్ ఎమ్మెల్యే  సోలిపేట రామలింగారెడ్డి చనిపోయినపుడు భార్య సుజాత కు టికెట్ ఇచ్చారు, ఆమె గెలవలేదు. అంతేకాదు, అది బిజెపికి బాగా ఉపయోగపడింది.
అందువల్ల ఇపుడు నాగార్జునసాగర్ లో నోముల నరసింహయ్య కుటుంబానికి టికెట్ నో అని చెప్పేందుకు పార్టీ సిద్దమవుతున్నట్లు సమాచారం బటయకు పొక్కింది.
నోముల కుటుంబానికి మరొక ప్రయోజనమేదో హామీ ఇచ్చి,  భార్యకు గాని, కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వకుండా మరొక సీనియర్ నాయకుడికి ఇచ్చి నియోజకవర్గాన్ని కాపాడుకోవాలని ముఖ్యమంత్రి కెసిఆర్ భావిస్తున్నారని పార్టీ వర్గాల్లో వినబడుతూ ఉంది.
ఎందుకంటే మూడో సారి బిజెపి చేతిలో ఓడిపోవడం పార్టీకి అవమానకరమవుతుంది. బిజెపి హ్యాట్రిక్ తో ఇక పగ్గాలు తెంచుకుని బీభత్సంగా దూకుడు పెంచుతుంది. అది ప్రమాదకరమని  ముఖ్యమంత్రే కాదు పార్టీ ప్రముఖలంతా ఆందోళన చెందుతున్నారని చెబుతున్నారు.
 కాంగ్రెస్ పార్టీ తరఫున జానారెడ్డి లేదా ఆయన కుమారుడు పోటీ చేయవచ్చు. ప్రాబల్యం ఉన్న రెడ్డి కుటుంబం పోటీ లో ఉంటే కొన్ని ఓట్లను చీల్చే ప్రమాదం ఉంది. అది  కూడా బిజెపికి ఉపయోగపడుతుంది. బిజెపి కూగీ రెడ్డిని నిలబెడితే, కాంగ్రెస్ ఎలాగూ గెలవదని రెడ్లు బిజెపి వైపు మొగ్గుచూపే డేంజర్ ఉంది.
అందువల్ల నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టిఆర్ ఎస్ తరఫున ఒక ‘పెద్ద రెడ్డి’ ని నిలబెడితే ఎలా ఉంటుందని  ముఖ్యమంత్రి యోచిస్తున్నారని వార్తలొస్తున్నాయి. దీని వల్ల రెడ్ల ఓట్లను లాగవచ్చు.
దీనితో మాజీ ఎంపి, ఇపుడు కౌన్సిల్ ఛెయిర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ని పేరు ప్రచారం లోకి వచ్చింంది.
ఆయనను టిఆర్ ఎస్ అభ్యర్థిగా నిలబెట్టవచ్చని పార్టీ వర్గాల్లో బాగా వినబడుతూ ఉంది. జానారెడ్డి కుటుంబానికి ధీటైనరెడ్డి సుఖేందర్ రెడ్డి అని చాలా మందిలో నమ్మకం. ఒక విధంగా నిజం కూడా. చాలా కాలంగా పదవిలో లేక జానారెడ్డి కుటుంబం కొద్ది గా వీక్ అయింది. సుఖేందర్ రెడ్డి ఎంపిగా ఉన్నపుడే  కాంగ్రెస్ నుంచి టిఆర్ ఎస్ లోకి వచ్చి బాగా బలపడ్డారు.
అయితే,   జాానారెడ్డినే ఏకంగా టిఆర్ ఎస్ లోకి లాగే ప్రయత్నం కూడా  చేశారు. ఏడు సార్లు నియోజకవర్గం నుంచి గెలిచి, 70 సంత్సరాలు పైబడిన నాయకుడిగా ఉన్న గౌరవ మర్యాదలను వదులుకుని పార్టీ మారలేనని జానా టిఆర్ ఎస్ కే కాదు, బిజెపికి కూడా చెప్పినట్లు సమాచారం.
ఒక వేళ రిస్కు తీసుకోవడం గుత్తాకు ఇష్టం లేకపోతెే ఎలా?
నియోజకవర్గంలో రెడ్లు, యాదవుల బలగం ఎక్కువ. అందువల్ల బలమయన రెడ్డి అభ్యర్థి దొరక్కపోతే, బలయమయిన యాదవ అభ్యర్థిని టిఆర్ ఎస్  నిలబెట్టాలి.
గతంలో నరసింహయ్యకు ఈ కులాల కూడికలు తీసివేతలు బాగా పనికొచ్చాయి. అందుకే  ఒకసారి ఓడిపోయినా రెండోసారి జానారెడ్డి మీద గెలిచాడు. నరసింహయ్యకు ఉండిన ఎడ్వాంటేజ్ వాళ్ల కుటుంబ సభ్యులకు ఉండకపోవచ్చు.
ఎందుకంటే, నరసింహయ్య కమ్యూనిస్టు రాజకీయాలలో ఫీల్డ్ స్థాయిలో బాగా పనిచేసి పేరు తెచ్చుకున్నాడు. కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యే గా రెండు దఫాలు బాగా పనిచేసి మంచి కీర్తి గడించాడు. అసెంబ్లీని ఉపేసిన వాడు. అందువల్ల ఆయన కుటుంబ సభ్యులకు ఈ కాలంలో నాటి నరసింహయ్య కీర్తి ఉపయోగపుడుతుందని భావించి టికెట్ ఇవ్వడం సాహసమే అవుతుంది.
ఈ కారణంతో నరసింహయ్యకు ధీటైన యాదవ్ లేదా బిసి నాయకుడిని వెదకాలి. అది చాలా కష్టం. అదీ  ఒక  కొత్త ప్రయోగమవుతుంది. రిస్క్.
బిజెపి తరఫున కె సుచరితారెడ్డి నిలబడవచ్చు. 2018 ఎన్నికల్లో ఆమెకు 1 శాతం ఓట్లే వచ్చి డిపాజిట్ పోయినా, మారిన పరిస్థితుల్లో ఆమెకే సీటు ఇచ్చే అవకాశం ఉంది.
అలా కాకపోతే, ఆ మధ్య టిడిపినుంచి బిజెపిలో చేరిన అంజయ్య యాదవ్ కు బిజెపి సీటు ఇస్తుందని భావిస్తున్నారు.  2018లో ఆయన టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి దాదాపు 30 వేల ఓట్లు తెచ్చుకున్నారు. అంటే అంజయ్య కూడా బలయయిన అభ్యర్తే అవుతారు.  అంటే రెండు బలమయిన కులాల అభ్యర్తులను ఎంపిక చేసుకుని  బిజెపి స్పష్టమయిన వ్యవూహంతోనే ఉందని అర్థమవుతుంది.
 ఈ కారణాలన్నంటితో  నాగార్జునసాగర్ లో  ప్రయోగాలకు, సానుభుతి వోటు జోలికి వెళ్లకుండా పచ్చి గెలుపుకోసం పనిచేయాలని, దానికి గుత్తా సుఖేందర్ రెడ్డి యోగ్యడని పార్టీ నాయకులు కొందరు ట్రెండిగ్ తెలుగున్యూస్ కు చెప్పారు.
ముఖ్యమంత్రి కూడా సుఖేందర్ రెడ్డి వైపు మొగ్గు చూపుతారు, ఎందుకంటే, గెలిస్తే సుఖేందర్ ని మంత్రిని చేస్తామని హామీ ఇచ్చి రంగంలోకి దించవచ్చు, అని ఒక టిఆర్ ఎస్ నాయకుడు భావించారు.
గెలవకపోయినా రిస్క్ తీసుకున్నారని సుఖేందర్ కు మంత్రి పదవి రివార్డు గా ఇచ్చే అవకాశం ఉంది. దానికి ఎవరూ గొణికే అవకాశం ఉండదు.
సుఖేందర్ తొలినుంచి మంత్రి పదవి కాంక్షిస్తూ వచ్చారు. అయితే, ఆయన కౌన్సిల్ ఛెయిర్మన్ అయ్యారు. అది అలంకారమే తప్ప రాజకీయాల్లో ఎదిగేందుకు పనికి రాదు.
అందువల్ల నాగార్జున సాగర్ ఎన్నికల్లో దూకడం సుఖేందర్ కు ఇది మంచి అవకాశం. ఈ ఎన్నికల్లో రిస్క్ తీసుకుంటే తనకయితే, పోయేదేమీ లేదు. కౌన్సిల్ సభ్యత్వానికి రాజీనామాచేయాల్సిన పని లేదు.ఛెయిర్మన్ పదవికి  కూడా రాజీనామాచేయాల్సిన పనిలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *