హైదరాబాద్ చలికి వణుకుతూ ఉంది…

హైదరాబాద్ చలికి వణుకుతూ ఉంది. గత సోమవారం ఈ సీజన్ లో  తీవ్ర చలిదినంగా నమోదయింది. ఆ రోజు   ఉష్ణోగ్రత 10.4 డిగ్రీల సెల్సియస్ కు పడిపోయింది. నార్మల్ గా ఆరోజు న ఉండాల్సిన టెంపరేచర్ కంటే ఇది 5 డిగ్రీల సెల్సియస్ తక్కువ. ఉత్తర, మధ్య భారతం మీదుగా వీస్తున్న చలిగాలులకు చాలాచోట్ల ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోతున్నాయి.
ఇపుడు తెలంగాణలో కోల్డ్ వేవ్ కండిషన్స్ ఉన్నాయని, ఇవి మరొక రెండు మూడు రోజులు కొనసాగుతాయని వాాతావరణశాఖ చెబుతూ ఉంది.
ఈ శాఖ చెబుతున్న దానిప్రకారం హైదరాబాద్ రికార్డు స్థాయిలో చలి పెట్టింది 2010 డిసెంబర్ 21న. ఆరోజు ఉష్ణోగ్రత 8.9 డిగ్రీల సెల్సియస్ కు పడిపోవడంతో హైదరాబాద్ లో అక్షరాల గడ్డకట్టే చలి అనుభవంలోకి వచ్చింది.ప్రజలు గడగడ వణికిపోయారు. ఆ తర్వాత 2019 డిసెంబర్ 31న 9.5డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది.
సోమవారం నాడు హైదరాబాద్ తో పాటు  మెదక్, ఆదిలాబాద్ జిల్లాలలో కూడా కోల్డ్ వేవ్ కండిషన్స్ కనిపించాయి.
హైదరాబాద్ కు సంబంధించి అనేక చోట్ల ఉష్ణోగ్రత లు ఇలా ఉన్నాయి. రాజేంద్ర నగర్ లో 7.3 డిగ్రీల సెల్సియస్ ఉంటే, లింగం పల్లిలో 7.8 డిగ్రీల సెల్సియస్ నమోదయింది. మారెడ్ పల్లిలో  9.2 డిగ్రీల సెల్సియస్ నమోదయయింది.
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 3.4 డిగ్రీలు రికార్డైంది. ఇక రానున్న 3 – 4 రోజులపాటు మధ్య భారతదేశంలో చలితీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *