లాక్ డౌనో లో బిర్యానీ నెంబర్ వన్ ఫుడ్ ఐటెం అయింది. ఇపుడు ఇండియాలో అత్యంత ఆదరణ ఉన్న ఫుడ్ ఐటెం గా బిరియానీ నిలబడిండి. లాక్ డౌన్ లో ప్రజలు అతిఇష్టంగా తిన్న ఐటెంగా బిర్యానీ రికార్డు సృష్టించింది. ప్రతిసెకన్ కు ఒకటి కంటే ఎక్కువ బిర్యానీలను అర్డర్ చేసినట్లు ఒక సర్వే వెల్లడించింది. ఇందులో కూడా చికెన్ బిర్యానీ కింగ్ అయింది. స్విగ్గీ లెక్కల ప్రకారం, రెగ్యులర్ గా బిర్యానీ అర్డర్ చేసే వాళ్లేకాకుండా లాక్ డౌన్ పీరియడ్ లో లక్షమంది కొత్త వాళ్లు బిర్యానీ అర్డర్ చేశారు.
ప్రతి ఒక్క వెజిట బుల్ బిరియానీకి అరు చికెన్ బిరియానీ ఆర్డర్లువచ్చాయి.దీని తర్వాతి స్థానం మసాలదోశెకుదక్కింది.
లాక్ డౌన్ కాలంలో భారతీయులు బాగా ఇష్టంగా తిన్నవాటిలో పన్నీర్ బటర్ మసాలా, చికెన్ ఫ్రైడ్ రైస్, గార్లిక్ బ్రెడ్.
ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ లో మరొక పాపులర్ ఐటెం పానీ పూరీ, లాక్ డౌన్ వల్ల ఇదెవరికీ దొరకలేదు. దీనితో స్వీగ్గీ పానీపూరీని కూడా సప్లైచేయడం మొదలుపెట్టింది. లాక్ డౌన్ ఎత్తేశాక ఈకంపెనీ 2లక్షల పానీపూరీ పార్సిళ్లుసప్లయి చేసింది.