2024 నుంచి యాపిల్ డ్రైవర్ లేని కార్లు…

2024 నాటికల్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను తీసుకువచ్చందుకు యాపిల్ కంపెనీ టార్గెట్ గా పెట్టుకుంది.
అద్భుతమయన సొంత బ్యాటరీ టెక్నాలజీ తో ఈ కార్లు అందుబాటులోకి రానుంది. యాపిల్ అంటే ఇంతవరకు ఐఫోన్ అని మాత్రమే తెలుసు. ఇపుడు యాపిల్ అంటే కారు అని  కూడా అనిచెప్పుకోవాలి.
యాపిల్ తయారు చేస్తున్న డ్రైవర్ అవసరం లేని ఈకార్ల  తయారీ ప్రాజక్టు పేరు ప్రాజక్టు టైటన్ (Project Titan). 2014 నుంచి  ఇలాంటి కార్ల తయారీలో  మునిగిఉంది. ఈ కార్ల ప్రత్యేకత  LFP (Lithium Iron Phosphate) బ్యాటరీ. ఈ బ్యాటరీ వోవర్ హీటెక్కదు. అందువల్ల ఇతర లిధియమ్ అయాన్ బ్యాటరీల కంటే ఇది సురక్షితం. ఈ బ్యాటరీ రేంజ్ కూడా చాలా ఎక్కువ. దీనికి పెద్ద స్థలం కూడా అవసరం ఉండదు. అందుకే ఈ యాపిల్ ఈబ్యాటరీలను పరీక్షిస్తూ ఉంది.
మొదటివిడతలో లక్షకార్లను తయారుచేసేందుకు యాపిల్ కొన్ని సంస్థలతో ఒప్పందం పెట్టుకోవాలనుకుంటున్నది. నిజానికి మాగ్నా ఇంటర్నేషనల్ తో చర్చలు ప్రారంచింది. యాపిల్ కార్ల తయారీ ప్లాన్ స్పష్టంగా లేకపోవడంతో  అవి ముందుకు సాగలేదని చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *