ఐఐటి – జెయియి, ఐఐటి ఫౌండేషన్ కోర్సు ప్రిపరేషన్ ఎలా ఉండాలి?

ఐఐటి – జెయియి ఎంట్రన్సు పరీక్ష మన దేశంలో అత్యున్నతమైన ఇంజినీరింగ్ కాలేజిలకు జరిగే ప్రవేశపరీక్ష. ఇందులో అందరి దృష్టి 23 ఐఐటిల మీదే ఉంటుంది. ఆ తరువాత 31 నిట్ లు (National Institutes of Technology (NITs))లకు ప్రాధాన్యం ఉంటుంది. ఈ విద్యా సంస్థలల్లొ ప్రవేశం పొందేందుకు జరిగే ఐఐటి – జెయియి ఎంట్రన్సు పరీక్ష రెండు దశలల్లొ ఉంటుంది. ఈ రెండు పరీక్షలల్లొ మొదటిది ఐఐటి – మెయిన్సు ఆ తరువాతది ఐఐటి అడ్వాన్సుడ్.
ఐఐటి ఫౌండేషన్ కోర్సు అనేది 6 వతరగతి నుండి 10 వ తరగతి వరకు విద్యార్తులకు ఇస్తున్న ఒక అనుబంద కోర్సు ( supplementary course). ఈ కోర్సు ఉద్దేశ్యం  విద్యార్థులు ఇంటర్ చేరిన తరువాత  ఎంట్రన్సు పరీక్షలకు చక్కగా ప్రిపేరయేందుకు వేసే పునాది లాంటింది.
వీటిలో మొదట ఐఐటి మొయిన్సు పరీక్ష ఏప్రిల్ నెలలో జరుగుతుంది , దీనికి దేశం మొత్తం మీద సుమారు 12 లక్షల మంది హాజరవుతారు . ఈ మధ్య కాలంలో ఐఐటి మెయిన్సు పరీక్షను దశల వారిగా నిర్వహిస్తున్నారు
ఈ ఐఐటి మెయిన్స్ పరీక్ష ఫలితాలు ఒక రెండు వారాలల్లొ వచ్చెేస్తాయి. ఈ పరీక్షలో 12 లక్షల మందికి గాను ఒక 2 లక్షల మంది పాసయి మే నెలలో జరిగే ఐఐటి అడ్వాన్సుడ్ అన్న పరీక్ష వ్రాయడానికి అర్హత సంపాదిస్తారు.
అంతెేకాదు ఐఐటి మెయిన్సు ఎంట్రన్సు పరీక్షలో పాసయిన రెండు లక్షల మంది National Institutes of Technology( NIT – నిట్) అని పేరొందిన 31 నిట్ విద్యాలయలల్లొఉన్న 23,500 సీట్లకు ప్రవేశం పొందెేందుకు అప్లై చేసుకోవచ్చు. అక్కడ కౌన్సిలింగ్ లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా సీటు పొందవచ్చు.
ఈ పాసయిన రెండు లక్షల మంది లో ” మాకు నిట్ ప్రవేశం వద్దు , ఐఐటి ప్రవేశం కావాలి ” అని అనుకున్న వారు అడ్వాన్సుడ్ పరీక్ష కు హాజరవుతారు. ఈ పరీక్ష తరువాత ఆల్ ఇండియా ఐఐటి ర్యాంకులు ప్రకటిస్తారు. ఈ ఆల్ ఇండియా ఐఐటి ర్యాంకుల ఆధారంగా 21 ఐఐటిలల్లొ ఉన్న 11,200 సీట్లకు admissions జరుగుతాయి. ఐఐటి మెయిన్సు చాలా కష్టమైన పరీక్ష దాని కన్న కష్టమైన పరీక్ష ఐఐటి అడ్వాన్సుడ్ అని విద్యార్థులు భావిస్తూ ఉంటారు.
మెడికల్ అంటే MBBS వగైరా కోర్సులకు జరిగే నీట్ (NEET) ఎంట్రన్సు పరీక్ష కు Inter CBSE Books చదివితే సరిపోతుంది. అలాగే ఈ Inter CBSE Books ఐఐటి మెయిన్సు కు కూడా సరిపోతాయి, కాని ఐఐటి అడ్వాన్సుడ్ కు  Inter, CBSE Books తో ప్రిపరేషన్ సరిపోదు. CBSE Books ను దాటి ఇంకా స్టాండర్డ్ బుక్సును చదవాల్సి ఉంటున్నది.
ఐఐటి ఫౌండేషన్ కోర్సు
ఈ ఐఐటి ఎంట్రన్సు పరీక్షలకు కొరకు ఇంటర్ మీడియట్ నుండి మాత్రమే preparation స్టార్టు చేసినా చాలా మంది విద్యార్థులు success ను సాధించలేకపోతున్నారు.
ఈనాటి చాలా మంది విద్యార్థులు ఐఐటి ఫౌండేషన్ కోర్సు ను 6 లేదా 7 వ తరగతి నుండే మొదలు పెడుతున్నారు. కాని వీరిలొ కూడా చాలా మంది విజయం సాధించలేకపోతున్నారు. దీనికి కారణమేమిటి అని చూస్తే ఈ ఐఐటి ఫౌండేషన్ కోర్సు ను నడుపుతున్న చాలా పాఠశాలలు గైడ్సు వంటి బుక్సు తో కోచింగ్ కొనసాగిస్తున్నారు, అలాగే గైడ్సు కొరకు అని వీక్లీ టెస్టులనీ  , అవనీ ఇవనీ  పెద్ద మొత్తంలో ఫీజులయితే లాగేస్తున్నారు.
వీక్లీ టెస్టులల్లొ మార్కులు తక్కువ వచ్చాయని తల్లిదండ్రులు పిల్లల మీద విపరీతంగా కోపడ్డడం , అర్థం కావటం లేదని చెప్పి పిల్లలు భోరుమనడం రోజూ చూస్తున్నదే.  ఇలా ఈ ప్రిపరేషన్  ఎంతో తోవ్ర ఒత్తిడిని విద్యార్థులలో, తల్లిదండ్రులలో కల్గిస్తున్నది. ఈ గైడ్సు భోదన, వీక్లీ టెస్టుల లో వచ్చే మార్కుల వల్ల విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు తీవ్రమైన ఒత్తిడికి లోనవడం మానసిక వైద్యులను సంప్రదించడం ఈ రోజులల్లొ సాధారణమైపోయింది.
మరి దీనికి పరిష్కారం ఏమిటి?
 ఐఐటి ఫౌండేషన్ కోర్సు అన్నది గైడ్సు , ఫార్ములాలు , ప్రాబ్లమ్సు , వీక్లీ టెస్టుల మాత్ర మే పని జరగదు.ఇది కాకుండా సైన్సు , మ్యాధమాటిక్స్ కు చెందిన విషయాలను విద్యార్థులకు నిత్య జీవితంలో ఎదురయ్యేఅనుభవంతో లింక్ చేసి చెప్పడం వల్ల వారిలో అవగాహన శక్తి (Cognitive skills) పెరుగుతుంది.  నేర్చుకుంటున్న కొత్త విషయాలు బాగా పరిచయం ఉన్న విషయాలుగా విద్యార్థులు తెలుసుకుంటారు. ఇది కొందరిలో సహజంగా వస్తుంది. కొంతమంది విద్యార్థులు వీటిని కొద్ది కష్టపడి నేర్చుకుంటారు. మరికొందరికి వివరంగా చెబితే నేర్చుకుంటారు,కొంచెం నెమ్మదిగా. కోచింగ్ పాత్ర ఇక్కడే ఉంటుంది. అయితే, ఏ కోచింగ్ సెంటర్ కాగ్నిటివ్ స్కిల్స్ ను పెంచలేదు. అందుకే ఒక  కోచింగ్ సెంటర్ కు కొన్ని లక్షల  మంది హాజరయినా, వారు సెలెక్టు కాకపోవడం కాదు, వారి అవగాహన శక్తి ఇంటర్ పాసయిన నాటి నుంచి ఒక అంగుళం కూడా పెరగదు. ఐఐటి ఎంట్రన్స్ పాసయిన వారిలో చాలా మందిలో అవగాహన శక్తి ముందే కొద్దిగా ఒక షేప్ తీసుకుని ఉంటుంది. అయితే, దీనినే తమ గొప్పతనంగా కోచింగ్ ఇచ్చే సంస్థలు ప్రచారం చేసుకుని తల్లితండ్రలను మాయచేస్తుంటాయి.
కాగ్నిటివ్ స్కిల్స్ పెంచే  భోధన ఏ ఒత్తిడి ని విద్యార్థులలో కల్గించదు. అందుకు బదులుగా ఐఐటి ఫౌండేషన్ అన్నది ఒక అత్యంత ఆసక్తికరమైన కోర్సుగా మారుతుంది. నేర్చుకోవడం విద్యార్థి ఇన్వాల్వు మెంట్ కూడా ఉంటుంది.
ఉదాహరణకు Bernoulli Equation వివరించాలంటే విద్యార్థులకు ఒక water can tap నుండి వస్తున్న వాటర్ ప్రవాహం చూపి వివరించవచ్చు. water can పైన ఉన్న మూతను తీసేయడం వల్ల ఏ విధంగా air pressure వల్ల ఆ వాటర్ ప్రవాహం water can tap నుండి ఎక్కువౌతుందో వివరించడం వల్ల , విద్యార్థులు సులభంగా Bernoulli Equation ను అర్థం చేసుకుంటారు.
ఇలా సబ్జక్టు లో వచ్చే చాలా విషయాలకు నిత్య జీవితంలో ఎదురయ్యే అనుభావాలకు లింక్ చేసి ఒక టీచరు చెప్పవచ్చు. కాని ఇలా ఒక టీచర్ చెప్పాలంటే ఆ టీచరు గైడ్సు వంటి బుక్సు ను కాకుండా standard text books ను చదవాలి. ఆ text books ను బాగా పరిశోధించాలి, అపుడే ఆ టీచరు చక్కటి innovative ideas తో భోధన చేయగలడు. ఇటువంటి ఐఐటి ఫౌండేషన్ కోర్సు అన్నది హైస్కూలు విద్యార్థులను ఐఐటి ఎంట్రన్సులో ర్యాంకు తెచ్చుకొనేటట్లు చేయడమే కాకుండా ఐఐటిలల్లొ చేరిన తరువాత వారిని అక్కడి resources ను ఉపయోగించుకొని చక్కటి నిజమైన డిజైన్ ఇంజినీర్లుగా అయ్యేటట్లుగా దోహదం చేయగలదు.

(SVSC Prasad, Physics, Maths Coaching consultant. Ph 7901089276)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *