కరోనా పాండెమిక్ తర్వాత సినిమా హాళ్లు మాయమవుతాయా?

ఒకసారి ప్రపంచం కరోనా పాండెమిక్ నుంచి బయటపడగానే సర్వత్రా మంచి రోజులొస్తాయని, అదొక కొత్త సామాజిక, సాంస్కృతిక విప్లవానికి దారితీస్తుందని చెబుతున్నారు.
ఇది రోరింగ్ ట్వంటీస్ (Roaring Twenties)లాగా తలపిస్తుందని చెబుతున్నారు. రోరింగ్ ట్వంటీస్ అంటే 1918,1919లలో ప్రపంచాన్ని కుదిపేసిన స్పానిష్ ఫ్లూ (Spanish Flu) పాండెమిక్ ముగిశాక 1920 నుంచి మొదలయిన దశాబ్దం.
స్పానిష్ ఫ్లూ మూడు తరంగాలుగా ప్రపంచాన్ని కుదిపేసింది. ఇండియాలో బాంబే నుంచి విస్తరించడంతో  దానిని బాంబే ఫీవర్ అనేవాళ్లు.  ఈ రెండు సంవత్సరాల కాలంలో సుమారు కోటిన్నర మంది చనిపోయారు. ప్రపంచమంతా కనీసం 50కోట్ల మంది చనిపోయారు. అప్పటికి ఇది వైరస్ నుంచి వస్తున్నదని కూడా తెలియదు. ఇలాంటి సంక్షోభం నుంచి ప్రపంచం బయటపడింది. పడటంకాదు, వూహించనంత వేగంగా ప్రపంచం అభివృద్ధి చెందింది.
ఆర్థిక రంగం, సైన్స్, సాంకేతిక రంగం,  కళా రంగం ఒకటేమిటి ఇపుడు మనం చూస్తున్న ఆధునిక ప్రపంచానికి పునాది పడింది అక్కడే.
నిజానికి మొదటి ప్రపంచ యుద్ధంతో అన్ని దేశాల అర్థిక వ్యవస్థ లు చితికిపోయాయి. ఇలాంటపుడు స్పానిష్ ఫ్లూ వచ్చి ఇంకా నాశనం చేసింది. అయితే, పాండెమిక్ ఎత్తేయడం మొదలయ్యాక, ఒక కొత్త శకం మొదలయింది. అదే రోరింగ్ ట్వంటీస్.
ఆర్థిక వ్యవస్థ కోలుకుంది. ప్రపంచ జిడిపి రాకెట్ లాగా దూసుకుపోయింది. సాంస్కృతిక రంగంలో జాజ్ మ్యూజిక్ వచ్చింది. అటోమొబైల్ విప్లవం వచ్చి కారును సర్వసాధారణం చేసింది. అనేక దేశాలలో మహిళలకు ఓటు హక్కు వచ్చి రాజకీయాలలో విప్లవం తెచ్చింది.
అమెరికాలో మహిళలకు ఓటు హక్కు వచ్చింది కూడా 1920 నుంచే. కరెంటు ఇళ్లలోకి వచ్చి ఇంటిని కాంతివంతం చేసింది. ఇంట్లో విప్లవం తీసుకువచ్చింది.
స్పానిష్ ఫ్లూ పాండెమిక్ తర్వాత పట్టణాల నిర్మాణం లో పెను మార్పలు వచ్చాయి. బాంబే,న్యూయార్క్, పారిస్  వంటి నగరాల ఆధునికీకరణ మొదయింది 1920 నుంచే. ఆకాశహర్మ్యాల (Skyscrapers) అనే నిర్మాణ శైలి మొదలయింది కూడా 1920 తర్వాతే. స్టైలిష్ అపార్ట్ మెంట్లు, ఫైవ్ స్టార్ హోటళ్లు, ఎక్కడ చూసినా విమనాశ్రయాలు వచ్చింది ఈ దశాబ్దంలోనే.
ఇదంతా స్పానిష్ ఫ్లూ పాండెమిక్ తర్వాత ప్రపంచం న్యూనార్మల్ కి వచ్చాక  ప్రజలంతా కసితీరా పనిచేయడమే కారణం అనేది చాాలా మంది వాదన.
ఇపుడు వచ్చిన  కరోనా పాండెమిక్ తర్వాత ప్రపంచం కొత్త ప్రపంచంగా మారుతుందని చెబుతున్నారు. దీనికి అన్ని హంగులు సిద్ధంగా ఉన్నాయి, త్వరలో రానున్న 5G ఈ సామాజిక, సాంకేతిక విప్లవానికి బాట వేస్తుందని చెబుతున్నారు.
కరోనా పాండెమిక్ వెళ్లిపోయా అనేక పాత అలవాట్లు మాయమైపోయి, కొత్త అచారాలు,అలవాట్లు, ఆలోచనా ధోరణలు వస్తాయని చాలా మంది సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే ఇవి  మొదలయ్యాయి. షేక్ హ్యాండ్ పోయి నమస్కారం వస్తూఉంది. శానిటైజర్ కామన్ అంది.ముఖానికి మాస్క్  ఇక ముందు ఏదో ఒక రూపంలో కొనసాగనుంది.
కొన్ని వ్యవస్థలు పూర్తిగా పోతాయని చెబుతున్నారు. ఇందులో ప్రధానమయిందని సినిమా హాళ్లు. ఇప్పటికే సినిమా హాళ్లు బాగా నష్టాలతో నడుస్తున్నాయి. సింగిల్ స్క్రీన్ ధియోటర్లన్నీ  షాపింగ్ కాంప్లెక్స్ లు గానో, రెసిడెన్సియల్ కాంప్లెక్స్ గానే మారిపోతున్నాయి.
పట్టణాలలో మల్టిప్లెక్స్ పెద్ద ఎత్తున వస్తున్నాయి. వీటి వల్ల సినిమా చూడటం అనే ఎక్స్లూజివ్ అనుభూతి పోయి, అది షాపింగ్ లో ఒక భాగమయిపోయింది. అయితే, పాండెమిక్ వల్ల షాపింగ్ అనుభవానికే ముప్పురావంతో మల్టీప్లెక్స్ ల భవిత్యం కూడా కొడిగట్టింది.
అందుకే OTT (Over-The Top)  లు పాపులర్ అవుతున్నాయి. కరోనా పాండెమిక్ పోయినా, కరోనా భయం పట్టి పీడిస్తుందని   షాపింగ్, సినిమా ధియోటర్లకు జనం పడిపడి పోవడం మీద  దాని దుష్ప్రభావం  చాలా కాలం కొనసాగుతుంది. అంతకాలం భారీ పెట్టుబడులు పెట్టి కట్టించిన మల్లిప్లెక్స్ లు తట్టుకుని బతకడం కష్టం.
పాండెమిక్ కాలంలో OTT streaming సక్సెస్ కావడంతో మల్టిప్లెక్స్ ల  వోనర్లు దానిని తీవ్రంగా ఖండించారు. ఇది రాబోయే యుద్ధానికి సూచన. చాలా మంది సినిమా తెర చనిపోదని, సినిమా ధియేటర్లో సినిమా చూసిన ఆనందం వేరని, జనం దానిని వదలుకోరని చెబుతున్నారు. ఇది ఆత్మసంతృప్తికలిగించే ప్రకటనే.
పూర్వం సినిమా ధియోటర్లు లో  సినిమాచూసిన ఆనందం వేరు. ఇపుడు సినిమా చూసే తీరు వేరు. ఇపుడు సినిమా చూడటం అనేది ప్యూర్ కన్సమ్ షన్ (Pure consumption). ఇపుడు కోక్ తాగుతూ, పాప్ కార్త్న తింటూ సినిమా వినోదం పొందుతున్నారు.
పూర్వం సినిమా చూడటంలో ఇన్వాల్వ్ మెంటు ఉండేది. సినిమా చూడటానికి వెళ్లడమనేది ప్రత్యేక కార్యక్రమం. అలాగే సినిమా ఎలాంటి అంతరాయం లేకుండి తదేకంగా చూడటం పద్ధతి.  అంటే సినిమా ధియోటర్ అనుభూతి అప్పటి నుంచి ఇప్పటిదాకా  చాలా మారిపోతూ వచ్చింది. ఇపుడు ఒటిటితో పెనుమార్పునకు లోనుకానుంది.
ఇలాగే పాండెమిక్ తర్వాత అర్బనైజేషన్ వికేంద్రీకరణ అయి, చిన్న పట్టణాలు అభివృద్ధి అయి అక్కడ లగ్జీరీ జీవితాలు మొదలు కావచ్చు. అక్కడ రియల్ ఎస్టేట్ పెరిగితే, అన్ని రంగాలు వూపందుకుంటాయి. దీనితో  రూరల్ ఏరియాస్ నుంచి లగ్జీరీ గూడ్స్ డిమాండ్ పెరిగిపోతుంది. ఇ-కామర్స్ మారుమూల పల్లెలకు విస్తరిస్తుంది.
పోస్టల్ డిపార్టమెంట్ అయప్ప ప్రసాదాన్ని మారుమూలపల్లెలకు సరఫర చేయడం మొదలుపెట్టింది. లగ్జరీ గూడ్స్ ని ఇలాగే సబ్ పోస్టాఫీసు ఉన్న ప్రతివూరికి సప్లై చేయవచ్చు.
అందుకే పాండెమిక్ పోయిన తర్వాత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని, మనిషిలేని కన్స్యూమర్ మళ్లీ కట్టుతెంచుకుని , గత ఆరునెలల హోం జెయిల్ జీవితానికి స్వప్తి పలికి ఆనందంవైపు మనిషి పరుగు పెడతాడని, ప్రజలు విపరీతంగా తమ ఆనందం, ఆహ్లాదం, వినోదం కోసం ఖర్చు పెడతారని చెబుతున్నారు.  అయితే, ఇది ఇంతకు ముందులాగా రోడ్లమీద కనిపించకపోవచ్చని చెబుతున్నారు. ప్రజలు ఖర్చు చేయడం పెరుగుతుంది, అన్ని రంగాలు దీనితో యాక్టివేట్ అవుతాయి, ఇది కొత్త పద్ధతిలో సాగుతుందని, సమాజం కొత్త వాతావారణానికి (new normal) అలవాటుపడుతుందని చెబుతున్నారు.

కరోనా పాండెమిక్  తర్వాత ప్రపంచవ్యాపితంగా ఎలాంటి మార్పులు రానున్నాయో చెబుతూ బిజెపి లోక్ పభ ఎంపి జయంత్ సిన్హా (పై ఫోటో) ఒక మంచి విశ్లేషణ రోరింగ్ ట్వీంటీస్ కమింగ్ ఎగైన్?  పేరుతో రాశారు.   కొలంబియా, ఆయన హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ల లో చదువుకున్నారు. 5G నెట్ వర్క్, క్లౌడ్ కంప్యూటింగ్ సెంటర్స్, చార్జింగ్ స్టేషన్స్,ఇంటెలిజెంట్ హైవేస్, గ్రిడ్ కనెక్టె డ్ బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థలు ప్రపంచాన్ని,మనుషుల్ని మార్చేస్తాయని ఆయన చెబుతున్నారు. దానికి తోడు క్లైమేట్  చేంజ్ వత్తిడి జనం పెరిగి నిర్మాణరంగ స్వరూపాలు కూడా మారిపోతాయని ఆయన చెబుతున్నారు.
ఆసక్తి ఉన్న వాళ్లు ఆయన వ్యాసం చదవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *