(SVSC Prasad)
ఈ రోజు విద్యార్థులు చాలా ఎంట్రన్సులు వ్రాయాల్సి ఉంటున్నది.
ఈ ఎంట్రన్సు లకు ఎలా ప్రిపేర్ కావాలి అలాగే ఎలా మంచి ర్యాంకు తెచ్చుకోవాలో ఒకసారి చూద్దాం.
ఎంట్రన్సు పరీక్షలో మంచి ర్యాంకు రావడంలో స్టూడేంట్ చేసే శ్రమ 90% వరకు , కోచింగ్ 10 % వరకు పనిచేస్తాయి. కాని దురదృష్టమేమంటే ఈ కోచింగ్ సెంటర్ల యొక్క కోట్ల రూపాయలతో కూడిన ప్రకటనల వల్ల చాలా మంది తల్లిదండ్రులు ర్యాంకులనేవి మంచి కోచింగ్ వల్ల వస్తాయి అని ఒక అభిప్రాయానికి వస్తున్నారు .ఇది చాలా తప్పు.
కోచింగ్ లేకుండా మంచి ర్యాంకు తెచ్చుకున్నా , కోచింగ్ కు వెల్లి మంచి ర్యాంకు తెచ్చుకున్నా ఈ రెండింటిలో మనం గమనించేది ఏమంటే స్టూడెంట్ శ్రమ 90 % వరకు ఉన్నట్లుగా గుర్తిస్తాం.
ఎంట్రన్సు టెస్టు కు కావాలసినది సబ్జక్టు టాపిక్స్ ను చక్కగా అర్థం చెసుకోవడం , ఆ టాపిక్స్ కు సంబందించిన ప్రాబ్లం ను చేయడం. సబ్జక్టు టాపిక్స్ ను అర్థం చేసుకోవాలంటే చదవడం ఒక్కటే సరిపోదు , చదివిన దానిని గురించి వివిధ రకాలుగా ఆలోచించాలి. అలా ఆలోచించి అర్థం చేసుకున్నదానిని own sentences లతో , own rough diagrams లతో నోట్సు తయారు చేసుకోవాలి. ప్రతి నాలుగు రోజుల కొక సారి preparation dayను పెట్టుకొని అంత వరకు నేర్చుకున్న వాటిని revision చేయడం చాలా చాలా ముఖ్యం. ఎంట్రన్స్ పాస్ అయిన వారిలో కనిపించే కామన్ గుణం వాళు పాాఠాలను బాగా అర్థం చేసుకుని ఉండటమే.
రాత్రి 2 గంటల వరకు చదవాలనేమీ లేదు. ఎపుడైనా చదవచ్చు. మేము రాత్రి 9 కే పడుకుంటాం అంటే రాత్రి 2 లేదా 3 గంటలకు లేచి ఉదయం 8 గంటల వరకు చదవాలి. మల్లి ఉదయం 10 నుండి రాత్రి నిద్ర పోయేంత వరకు ఎంత సమయం వీలవుతుందో అంత వరకు చదవాలి.
ఏవైన టాపిక్స్ కష్టంగా ఉన్నాయంటె వాటిని postpone చేసి సులభంగా ఉన్న వాటిని అద్యయనం చేయాలి.
కష్టంగా ఉన్నటాపిక్సు కొరకు వెంటనే ఇంటర్ నెట్ ను search చేయకూడదు.
మొదట text book లో ఆ టాపిక్ కు సంబందించిన ఒక పేపర్ ను చదవాలి , ఆ చదివిన దానిని గురించి వివిధరకాలుగా ఆలోచించాలి. అలా ఆలోచిస్తున్నపుడు మనకు వివిధ రకాలైన doubts వస్తాయి. అపుడు ఆ doubts ను clarify చేసెందుకు ఇంటర్ నెట్ ను search చేయాలి. అలా చెసినపుడు 99% ఆకష్టమైన టాపిక్ అర్థమౌతుంది. టెక్టు బుక్ లోని end chapter problems చెయడం వల్ల చాలా doubts clarify ఔతాయి.
సిలబస్ కాలేదే అన్న తొందర ఎంతమాత్రం పనికి రాదు . ఎంట్రన్సు కు ప్రిపేర్ కావడమంటే T20 match ను last ball వరకు వెల్లి last ball ను six కొట్టి గెలిచినట్లుగా ఉంటుంది.
Total syllabus complete చేసామా లెేదా అన్నది ముఖ్యం కాదు నేర్చుకున్నది ఎంత చక్కగా నేర్చుకున్నామా అనేది చాలా ముఖ్యం. అలాగే నేర్చుకున్నదంతా చక్కగా confusion లేకుండా గుర్తున్నదా లేదా అన్నది చాలా ముఖ్యం.
ఎంట్రన్సు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి Previous questions papers ను అలా పైపైన చూస్తే చాలు . అంతేకాని weekly test లని ఆ టెస్టుల మార్కులని చూసుకుంటు పోతే ఏ మాత్రం లాభం ఉండదు. టైం వేస్టు తప్ప.
ముఖ్యమైనదేమంటే ప్రతి నాలుగు రోజుల కొక సారి preparation dayను పెట్టుకొని అంత వరకు నేర్చుకున్న వాటిని revision చేయడం చాలా చాలా ముఖ్యం.
ఎంట్రన్సు ప్రిపరేషన్ సమయంలో సినిమాల ను , టీవి ప్రోగ్రామ్స్ ను అసలు పట్టించుకోకూడదు. భవిష్యత్తులో తామొక గొప్ప సైంటిస్టులు కాబోతున్నామన్న ఫీలింగ్ ను కల్గిఉండటమన్నది చాాలా అవసరం. దీన్నే డాక్టర్ కలామ్ డ్రీమ్ బిగ్ అంటూ వచ్చారు.
ఇలా చేస్తే మంచి ర్యాంకు రావడం ఖాయం. ఎంట్రన్స్ లో మంచి ర్యాంకు రావడమన్నది స్టూడెంట్ శ్రమ మీద ఆధారపడి ఉన్నది తప్ప కోచింగ్ సెంటర్ మీద కాదు. కోచింగ్ సెంటర్ వల్ల టైం వేస్టు చాలా ఎక్కువుగా ఉంటుంది ఎందువల్ల అంటే ఈనాటి కోచింగ్ సెంటర్లు విద్యార్థులు టాపిక్స్ ను సరిగ్గా అర్థం చేసుకుంటున్నారా లేదా అన్నది చూడకుండా టెస్టు ల మీద టెస్టులు conduct చేస్తూ పోతున్నారు.
(SVSC Prasad, Physics, Maths Coach. ఉచిత సలహాలకోసం 79010892760)