రానా ‘విరాట పర్వం’ ఫస్ట్ లుక్

‘నీదీ నాదీ ఒకే కథ’ సినిమాతో దర్శకుడిగా మారిన వేణు ఊడుగుల, రానా హీరోగా విరాట పర్వం అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సాయి పల్లవి హీరోయిన్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియమణి కీలక పాత్రలో కనిపిస్తున్నది. ఇప్పటి వరకూ ఈ సినిమా నుండి ప్రియమణి లుక్ తో పాటు, సాయి పల్లవి లుక్ కూడా రివీలైంది. ఈ రెండు ఫస్ట్ లుక్ లకి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. తొంభై శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం నుండి తాజాగా మరో  అప్డేట్లు వచ్చింది. ఈ సినిమా నుంచి రానా కు చెందిన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు.
ఈ రోజు (డిసెంబరు 14వ తేదీ) రానా పుట్టిన రోజు కావటంతో ..విరాట పర్వంలో రానా లుక్ ని రివీల్ చేయనున్నారు.  అలాగే 11: 07నిమిషాలకి ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేస్తారట. ఈ ఫస్ట్ లుక్ లో రానా రవి అన్న అనే  ఒక నక్సలైట్ యోధుడిగా కనిపిస్తున్నాడు అడవిలో ఫాగ్ మధ్యలోంచి ఉద్యమకారుల టీమ్ నడిచి వస్తున్నారు. ఆలివ్ గ్రీన్ యూనిఫాంలో రానా రూపం ఉద్యమస్ఫూర్తిని నిండి ఉండటం మనం గమనించవచ్చు.
ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ సమర్పిస్తూ ఉండగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమా బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో రానాతో పాటు ప్రియమణి, జరీనా వాహబ్, నందితా దాస్, నివేదా పేతురాజ్, నవీన్ చంద్ర వంటి వాళ్లు కీలక పాత్రలలో నటిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *