మద్రాస్ ఐఐటిలో కరోనా లాక్ డౌన్

మద్రాస్ IITలో లాక్ డౌన్ ప్రకటించారు. తరగతి గదులు, హాస్టల్స్, ల్యాబొరేటరీ, లైబ్రరీలన్నింటిని మూసేశారు.
ఐఐటి క్యాంపస్‌లో కరోనా కేసులు  ఒక సారి పెరగడంతో ఈ చర్యలు తీసుకున్నారు. విద్యార్థులు, సిబ్బందితోకలసి మొత్తం 104 కరోనా కేసులు కనిపించడంతో ఐఐటిని మూసేయాలని అధికారులు నిర్ణయించారు. ఐఐటి మద్రాసు హాస్టల్స్ లో సుమారు 774  మంది విద్యార్థులుంటున్నారు. అయితే, వీరందరికి ఒకే ఒక మెస్ పని  చేస్తూ ఉంది. సిబ్బంది, అద్యాపకులు, విద్యార్థులంతా ఈ ఒక్క మెస్ దగ్గిరే గుమికూడుతూ ఉండటంతో ఐఐటిలో కరోనా వ్యాపించేందుకు కారణమయి ఉంటారని అనుమానిస్తున్నారు.
మొదటి దఫా పరీక్షల్లో 104 పాజిటివ్ కేసులు కనిపించడం మొత్తం విద్యార్థులందరికి కరోనా పరీక్షలు జరిపేందుకు శాంపిల్స్ సేకరిస్తున్నారు. ఇంతవరకు 444 శాంపిల్సను పరీక్షించారు. ఈ 104 అందులోనివే. కరోనా పాజిటివ్ కేసులన్నింటిని  కింగ్స్ ఇన్స్ స్టిట్యూట్ తరలించారు. కింగ్స్ ఇన్ స్టిట్యూట్ అనేది తమిళనాడు ప్రభుత్వం నడుపుతున్న కోవిడ్-19 వైద్యశాల.
ఒక్క అదివారం నాడే 71 మంది పాజిటివ్ అని తేలింది. సోమవారం నాడు మరొక 33 మంది పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది. దీనితో ఐఐటిలో కలకలం మొదలయింది.
ఫలితంగా  మెస్  ను మూసేశారు. అయితే, హాస్టల్లలో ఉంటున్న విద్యార్తులకు ఆహారాన్ని రూం దగ్గిరకు తీసుకువెళ్లి అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రయోగాలు చేస్తున్న రీసెర్చ్ స్కాలర్స్ ను క్యాంపస్ కు  14 రోజుల  క్వారంటైన్ తర్వాతనే అనుమతిస్తున్నారు. అయినా ఈ ఎమర్జన్సీ పరిస్థితి ఎదురైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *