‘టెలిగ్రామ్’తో జర్నలిస్టును ఉరితీసిన ఇరాన్…

ఒక చిన్న జర్నలిస్టును, అందునా వెబ్ సైట్ నడుపుకునే జర్నలిస్టును చూసి ఇరాన్ ప్రభుత్వం వణికిపోయింది.
ఇరాన్ లో 2017లో వచ్చిన భూకంపం ఈ చిన్న జర్నలిస్టు సృష్టి అని  అక్కడి ప్రభుత్వం జడిసి పోయింది.
2017, 18 లలో ఇరాన్ దేశమంతా ఆందోళనలు చెలరేగాయి. పేదరికం, ఆర్థిక  వ్యవస్థ పతనం, నిరుద్యోగం, పెరుగుతున్న ధరలను భరించలేక లక్షలాది మంది ప్రజలు రాజధాని టెహరాన్ వీధుల్లోకి వచ్చారు. ప్రభుత్వం వణికిపోయేందుకు ఇదే కారణం.
దీని వెనక ఒక జర్నలిస్టు ఉన్నాడని, అతగాడే తన వెబ్ సైట్ తో  టెలిగ్రామ్ చానెల్ తో ఇలా  ప్రభుత్వాన్ని కూల్చేసే కుట్ర చేస్తున్నాడని భయపడి పోయింది.
ఆ జర్నలిస్టు గత ఏడాది అక్టోబర్ లో ప్రాన్స్ నుంచి ఎత్తుకొచ్చి అరెస్టు చేశారు. ఈ ఏడాది జూలైలో ‘భూమ్మీద అవినీతిని వ్యాప్తిచేస్తున్న’డనే నేరం మోపారు. కోర్టు మరణ శిక్ష విధించింది. సుప్రీంకోర్టు దీనిని దృవీకరించింది.
ఆ జర్నలిస్టు పేరు రుహొల్లా జామ్ (Ruhollah Zam). ఆయనను ఇరాన్‌  శనివారం ఉదయం ప్రభుత్వం ఉరితీసింది.
ఫ్రాన్స్ లో రాజకీయాశ్రయం పొందిన జామ్ ని ఇరాన్ పోలీసులు ఆమధ్య అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఇదెలా జరిగిందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. తర్వాత ఆయన ‘భూమ్మీద అవినీతిని ప్రోత్సహిస్తున్నాడు’ (corruption on earth) అనే కేసు పెట్టారు. ఇందులో రెండు ప్రధానాంశాలున్నాయి. ఒకటి: బయటి దేశాలకు రహస్య సమాచారం చేరవేయడం, రెండు: ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు కుట్రచేయడం.
ఇంతకీ రుహొల్లా జామ్ ఎవరు?
రొహొల్లా ఆన్ లైన్ జర్నలిస్టు.అమద్ న్యూస్ (AmadNews) అనే వెబ్ సైట్ స్థాపించి ఆయన ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో క్యాంపెయిన మొదలుపెట్టాడు. ఇది బాగా విజయవంతం కావడంతో టెలిగ్రామ్ యాప్ లో ఒక న్యూస్ చానెల్ కూడా ప్రారంభించాడు. ఆయన కు సుమారు పది లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు.జామ్ ఒక  షియాతెగకు చెందిన మహమ్మద్ అలీజామ్  అనే ఒక మత గురువు కుమారుడు. 1980 దాకా ఇరాన్ ప్రభుత్వంలో పని చేసే వారు. అయితే, ఆయన తనకుమారుడి కార్యకలాపాలను వ్యతిరేకించాడు.
2017 ఇరాన్ ప్రదర్శనల్లో జామ్ పాత్ర
2017 ఇరాన్ ప్రభుత్వాన్ని కుదిపేస్తూ  ధరల పెరుగుదల,నిరుద్యోగం వంటి సమస్యల, చితికి పోతున్న ఆర్థిక వ్యవస్థ, పెరిగిపోతున్న పేదరికం మీద  దేశమంతా ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు జరిపారు. ఈ నిరసన వెల్లువ వెనక రుహొల్లా  కీలక పాత్ర పోషించడమేగాక, తన న్యూస్‌ ఛానల్‌ ను ఉపయోగించి సోషల్ మీడియా సందేశాలతో  ఆందోళనలను వూతమిచ్చారు.
ఈ ఆందోళన  సమయంలో ప్రభుత్వం దాదాపు 5వేల మందిని అరెస్టు చేసింది. ఆయేడాది పొడీతా జరిగిన ఈ ఆందోళనలతో సుమారు 25 మంది చనిపోయారు.
ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానికి, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి ఇంతవరకు ఇలాంటి రాజకీయ సవాల్ ఎదురుకాలేదు. దీనితో ఇరాన్ ప్రభుత్వం కలవరపడింది. ఈ  ఆందోళన వార్తలను ఏ ప్రతిక రాయకుండా దేశంలో జాగ్రత్త తీసుకున్నా జామ్ తన వెబ్ సైట్ ద్వారా  టెలిగ్రామ్ చానెల్ ద్వారా ప్రపంచమంతా చేరవేశారు.
చివరకు ఇరాన్ ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్ మేనేజ్ మెంట్ మీద కూడా వత్తిడి తీసుకువచ్చింది. జామ్ పెట్రోల్ బాంబులుఎలా తయారు చేయాలో టెలిగ్రామ్ ప్రచారం చేస్తున్నాడని ప్రభుత్వం ఆరోపించింది. దీనితో టెలిగ్రాం జామ్ చానెల్ ను మూసేసింది.
జామ్ దీనికి బెదిరిపోలేదు. తన చానెల్ ను కొత్త పేరుతో మాళ్లీ సోషల్  మీడియాలోకి తీసుకువచ్చాడు.  ఈ సారి  ఇరాన్ సాగుతున్న షియా నియంతృత్వం మీద తిరుగుబాటు లేవనెత్తాడు.
అప్పటికే ఆయన ఫ్రాన్స్ లో తలదాచుకుని తన కార్యకలాపాలు సాగిస్తున్నాడు. 2009లో ఆయనకు ఫ్రాన్స్ రాజకీయాశ్రయం కల్పించింది.
అయిత,2019 అక్టోబర్ జామ్ ను ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ అరెస్టు చేసినట్లు ప్రభుత్వవం ప్రకటించింది. దీంతో అతడిపై ఇరాన్‌ చట్టంలోనే  అత్యంత తీవ్ర నేరమైన అవినీతి కేసు నమోదైంది. అంతేగాక, పలు దేశాల నిఘా సంస్థలు జామ్‌కు రక్షణ కల్పిస్తున్నాయని ఇరాన్‌ ఆరోపించింది. దేశ భద్రతను పణంగా పెట్టి ఫ్రాన్స్‌, మరికొన్ని దేశాలకు గూఢచర్యం చేస్తున్నాడని అతడిపై కేసులు నమోదుచేసింది.
ఆయనకు  corruption on earth కేసుకింద జూలై ట్రయల్  కోర్టు మరణ శిక్ష విధించింది. దీనిని సుప్రీం కోర్టు ధృవీకరించింది. నిన్న ఉరితీశారు.
జామ్ మీద పెట్టిన కేసులు?
జామ్ మీద  ప్రభుత్వం చేసిన ఆరోపణలు: ఆస్తుల విధ్వంసం,  ఇరాన్ ఆర్థిక వ్యవస్థలో జోక్యం చేసుకోవడం, ప్రాన్స్, అమెరికా వగైరా దేశాలకు ఇరాన్ రహస్యాలు చేరవేయడం ( Destruction of property,  interfering in Iran’s economy,  conspiring with the US and spying on behalf of French intelligence).
జామ్ అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజన్సీతో కలసి పనిచేస్తున్నాడని కూడా ఇరాన్ అధికారులు ఆరోపిస్తున్నారు.
“This individual committed criminal and corrupt acts against the security and livelihood of the Iranian people through running the antagonistic  AmadNews and Telegram channel and espionage communication with elements linked with foreign services that are against the Iranian Peoples’  security,”అనే ది ఆయన మీద వచ్చిన ఆరోపణలు అని ఇరాన్ అధికారిక    న్యూస్ వెబ్ సైట్ మీజాన్ (Mizan) రాసింది.
ఆయన  మీద మీద మోపిన నేరం భూమ్మీద అవినీతి వ్యాప్తి చేయడం (spreading corruption on earth  or Mofsed fel-Arz) అనేది నిజానికి చాలా అస్పష్టమయిన నేరారోపణ అని చాలా మంది చెబుతున్నారు.
ఇరాన్ చట్టాల ప్రకారం జాతీయ భద్రకు భంగం కల్పించినా, లేక అబద్దాలు ప్రచారం చేసినా  10 సంవత్సరాల జైలు శిక్ష మాత్రమే విధించాలి. ఇదే నేరాలను ‘పెద్ద ఎత్తున’ చేస్తే మరణ శిక్ష ఉంటుంది.  ఈ ‘పెద్దఎత్తున’ అనే క్లాజ్ చూపించి ఆయనకు మరణ శిక్ష అమలు చేశారు. ‘పెద్ద ఎత్తున’  అనేమాటకు నిర్వచనం ఏమిటో వివరించలేదు. అందుకే ఇదిరాజకీయ కక్ష సాధింపు అని అంతర్జాతీయంగా మానవతా వాదులు, ప్రజాస్వామిక వాదులు నిరసిస్తున్నారు.
ఇరాన్ లో జర్నలిస్టుల కష్టాలు
ప్రపంచంలో జర్నలిస్టులను వేధించడం ఎక్కువగా ఉన్న దేశాలలో ఇరాన్ ఒకటి. గత 40 సంవత్సరాలుగా ఇరాన్ స్వేచ్ఛా జర్నలిజం  హరించిపోయిఉందని రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ (Reporters Without Borders) అనే సంస్థ చెబుతూ ఉంది. 1979 నుంచి ఇప్పటి దాకా ఇరాన్ లో 860  మంది జర్నలిస్టులు బాధితులు. ఇందులో చాలా మందిని ఇరాన్ ప్రభుత్వం ఉరితీసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *