ఈ ఫోటో గుర్తుందా?
తెలంగాణ ఉద్యమం కాలంనాటిది. ఈ ఫోటోలో కెటి రామారావు ఉద్యమకారుడుగా కనిపిస్తున్నాడు. ఆయన పోలీసులు వేసిన ముళ్లకంచెను దాటే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు ఆయన ముందుకు రాకుండా అడ్డుకుంటున్నారు. ఇది గతం.
అపుడు ఎపుడో తెలంగాణ ఉద్యమంలో టిఆర్ ఎస్ నేతలు రోడ్డెక్కారు. బంద్ లు , వంటా వార్పులు, మిలియన్ మార్చ్ లు… ఇలా ఒకటేమిటి ఎపుడూ ఏదో ఒక కార్యక్రమంతో రోడ్లమీద ఉండేవారు. ఇందులో కెటిఆర్ కూడా పాల్గొనే వారు.
2014 లోతెలంగాణ వచ్చాకఉద్యమ పార్టీ టిఆర్ ఎస్ రూలింగ్ పార్టీ అయిపోయింది. ఉద్యమాల అవసరం తీరిపోయింది. అంతా ఉద్యమం వీడి ప్రభుత్వంలో చేరిపోయారు. అంతేకాదు,ఎవరూ ఉద్యమాలు చేయడానికి వీళ్లేదన్నారు. ఉద్యమాల అసవరం ఉండదనుకున్నారు.
కాలం తలకిందులయింది. రూలింగ్ పార్టీ మళ్లీ రోడ్డెక్కుతున్నది. రేపు మంగళవారంనాడు టాప్ టు బాటమ్ అంతా రోడ్డెక్క బోతున్నారు. బిజెపి వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రోడ్ల మీద బైటాయిస్తున్నారు. బిజెపి డౌన్ డౌన్ అని నినాదాలివ్వబోతున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితినాయకులంతా డైరెక్టుగా రంగంలోకి దిగాలని ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపునిచ్చారు.
దీనితో టిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెశిడెంట్, మునిసిపల్, ఐటి , పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు రేపు హైవే మీద ఆందోళన చేపడుతున్నారు.
పార్టీకి చెందిన ఇతర సీనియర్ నాయకులతో కలసి ఆయన భారత్ బంద్ లో స్వయాన పాల్గొంటున్నారు. బంద్ కు నాయకత్వం వహిస్తున్నారు.
హైదరాబాద్-బెంగళూరు హైవే మీద ఆయన భారత్ బంద్ ను విజయవంతం చేస్తున్నారు.
పొద్దున పదిగంటలకు షాద్ నగర్ సమీపంలోని బూర్గుల వద్ద ఆయన హైవే మీద బైఠాయిస్తున్నారు.
ఈ రోజు ముఖ్యమంత్రి కెసిఆర్ మరొక సారి బంద్ విజయవంతం చేయాలని పిలునిచ్చారు. పార్టీ నాయకులంతా డైరెక్టుగా ఉద్యమంలోకి దూకాలన్నారు.బంద్ సూపర్ హిట్ చేయమని ఆయన తెలంగాణ ప్రజలకు పిలుపు నిచ్చారు.
కెటిఆర్ కూడా విలేకరులతో ఉద్యమనేత లాగా మాట్లాడారు. గడ్డకట్టే చలిలో ఢిల్లీ ఊరి బయటు రైతులు చేస్తున్న ఆందోళన చూసి కెసిఆర్ చలించిపోయారని, అందుకు పార్టీకార్యకర్తలకు,ప్రజలకు పిలుపునిచ్చి భారత్ బంద్ ఉద్యమలో ప్రత్యక్షంగా పాల్గొనాలని కోరారని చెప్పారు.
Want to refresh the memory of some Telangana Scamgress men who keep hallucinating that I landed straight into a ministry in 2014
Where were you when I was in the movement for 8 years (2006-14) alongside people of Telangana?
Guess you were busy plotting to suppress the agitation pic.twitter.com/536tQlXB2s
— KTR (@KTRTRS) October 15, 2018