ఆస్తిపన్ను సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తిరుపతి యాక్టివిస్టు,రాయలసీమ ఉద్యమ నాయకుడు నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఆయన విజ్ఞాపన లోని ముఖ్యాంశాలు (వీడియో)
1) రాష్ట్ర ప్రజలపై”ఆస్తిపన్ను”భారం మోపకండి అర్ధ సంవత్సరం పన్ను మినహాయింపు ప్రభుత్వం ప్రకటించి అండగా నిలవండి!
2) ఆంధ్రప్రదేశ్ లో అన్ని ఆర్థిక వ్యవస్థలు వ్యాపారాలు లేక కుప్పకూలిపోయాయి!
3) ఆస్తిపన్ను చట్ట సవరణకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి!
4) రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆస్తిపన్ను సవరణ చట్టం పై అధికార పార్టీ నాయకులు,ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు,ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీలకు అతీతంగా స్పందించి ప్రజలు తిరస్కరిస్తున్న వాస్తవ సమాచారాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలి!
5) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్తిపన్ను చట్టాన్ని సవరణ చేస్తూ G.O M S No 198 ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసి 2021-22 రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా ఆస్తిపన్ను లెక్కించడం అంటే “మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టు” ప్రజల పరిస్థితి తయారైంది!
6) రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఏడాది అద్దె ప్రాతిపదికన ఆస్తిపన్ను విధించడం జరుగుతుంది కొంతకాలం అలాగే కొనసాగించి పరిస్థితులు చక్కబడ్డాక ఆస్తిపన్ను పై సీఎం నిర్ణయం తీసుకోవాలి!
7) దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ పుణ్యమా అని పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి!
8) కేంద్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు”నోట్ల రద్దు””జిఎస్టి” లాంటి వరుస దెబ్బలతో దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా కోలుకోలేని స్థితికి వెళ్లిపోయారు! దీనికితోడు
9) కరోనా వైరస్ ,అకాల వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేయడంతో 2020 సంవత్సరం ప్రారంభం నుంచి నేటి వరకు వ్యాపారాలు లేక బ్యాంకు,ప్రైవేటువ్యక్తుల నుంచి అధిక వడ్డీకి తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించలేక చాలామంది ఆస్తులను అమ్ముకుంటున్నారు!
10) రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆస్తిపన్ను సవరణ చట్టం పై రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజల్లో వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తెలుసుకొని 198 జీ ఓ ను ఉపసంహరించుకుంచుకోవాలి!