బిజెపి షాక్, కెసిఆర్ లో ఎంత మార్పు! భారత్ బంద్ కు మద్దతు

జిహెచ్ ఎంసి ఎన్నికల్లో తగిలిన దెబ్బతో టిఆర్ ఎస్ వ్యూహమే మారిపోయింది. తొలిసారిగా మోదీప్రభుత్వానికి వ్యతిరేకంగా క్లియర్ స్టాండ్ తీసుకుంది.  ఢిల్లీలో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా  డిసెంబర్ 8న రైతులు   తలపెట్టిన భారత్ బంద్ కు టిఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది.  అంతే కాదు, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు స్వయంగా ప్రకటించారు.
కెసియార్ లో ఎంత మార్పు!
మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న ఒక జాతీయ నిరసన కార్యాచరణకు  కెసిఆర్  ఇలా బహిరంగ మద్దతు తెలపడం ఇదే మొదటిసారి. చాాలా విషయాల్లో మోదీ విధానాలను వ్యతిరేకించినా, దీనికి వ్యతిరేకంగా పార్లమెంటులో  నిరసన ప్రకటనలు జారీ చేసిన, ప్రతిపక్షాల కార్యాచరణ లో తెలంగాణా రాష్ట్ర సమితి పాల్గొనలేదు.
ఎందుకంటే,దీనివెనక చాణక్య రాజకీయం ఉంది.
టిఆర్ ఎస్ భిన్నమైందని, మోదీని వ్యతిరేకించినా, ప్రతిపక్షాలతో చేతులు కలపడంలేదనొ, మోదీని ఇరుకున పెట్టాలనే దుష్టలక్ష్యం  టిఆర్ ఎస్ కు లేదని, కెసిఆర్ మంచివాడని మోదీ నుంచి మంచి మార్కులు కొట్టేసేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తూ వచ్చారు.
మొన్నటికి మొన్న అఖిల భారత ట్రేడ్ యూనియన్లు మోదీ తీసుకువస్తున్న కార్మిక చట్టాల సంస్కరణకు వ్యతిరేకంగా ఒక రోజుసమ్మె చేసినపుడు ఇదే కెసిఆర్ ఒక్క మాటా మాట్లాడలేదు. ఎందుకంటే అప్పటికింకా టిఆర్ ఎస్ కు బిజెపి దెబ్బతగల్లేదు.
బిజెపిఎపుడూ తెలంగాణలో టిఆర్ ఎస్ ను ఎదిరించేస్థాయికి ఎదగని ఆయన నమ్ముతూ వచ్చారు. అందుకే తనకు ఎపుడూపోటీ లేని మోదీతో గొడవెందందుకు అనుకున్నారు. మోదీని వ్యతిరేకించినా  ప్రతిపక్షంతో మాత్రం ఎపుడూ  కలవకుండా జాగ్రత్త పడ్డారు. ఒక వేళ ప్రతిపక్షమంతా పార్లమెంటులో మోదీకి వ్యతిరేకంగా గొడవచేస్తున్నపుడు ఏదో తెలంగాణ సమస్య లెేవనెత్తిగొడవ లో కలిసి వారు టిఆర్ ఎస్ సభ్యులు. ఇలా ” నేను మిమ్మల్ని వ్యతిరేంచినా, ప్రతిపక్షం  మనిషిని కాదు,,” అనే మెసేజ్ ను మోదీకి కెసిఆర్ పంపిస్తూ వచ్చారు.  బిజెపికి ఆయన ఈ విధంగా పరొక్షంగా సహకరిస్తూ వచ్చారు.
అయితే,బిజెపి మోదీ ధ్యేయం వేరు. ఏదో ఒకరోజు గోల్కొండ మీద కాషాయ జండా ఎగరేయాలనేది ఆయన ధ్యేయం. మోదీ ఈ కోర్కెని  ఎపుడూబయటపెట్టలేదు.సరిగదా 2014,2019 ఎన్నికల్లో తన బొమ్మ పనిచేయకపోవడంతో మోదీ కొత్యవూహం వేశారు.ఆ వ్యూహంలొ భాగాంగా ఖట్టర్ బిజెపి సేనాపతిని కెసిఆర్  మీద ప్రయోగించారు.
పూర్వం ఢిల్లీ సుల్తానులు ఈ పనే చేసే వారు. ఎంతో అవసరమయితే తప్ప సుల్తాన్ స్వయంగా కత్తిబట్టి యుధ్దానికి వచ్చే వాడు కాదు. కాగల పనినంతా సేనాపతులు చేసుకుని పోయేవారు.
ఇపుడు జిహెచ్ ఎంసి లో అనూహ్య విజయం సాధించి కెసిఆర్ కుబిజకపి మానసిక అశాంతి కలిగించింది. బహుశా కెసిఆర్ ను ఇంతగా ఎవరూ ఎపుడూ భయపెట్టి ఉండరు.కెసిఆర్ కూడా ఇంతగా ఎపుడూ భయపడి ఉండదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ ఎస్ మళ్లీ గెలవచ్చు. చెప్పలేం. అయితే, టిఆర్ ఎస్ కోట్ల బీటలు అనే వార్త ఇపుడు ఆ సేతు హిమాచలం వినబడుతూ ఉంది. కెసిఆర్ ఇంకా చాలా కలల్ని నిజం చేసుకోవలసి ఉంది. ఇలాంపుడు ఇంత తొందరగా  బిజెపి ముప్పు కొంచుస్తుందనిఆయన వూహించి ఉండరు. అందుకే భయం. ఈ భయం ఆయన ఎల్ బి స్టేడియం ప్రసంగం చూచాయగా కనిపించింది. భారత్ బంద్ మద్దతులో స్పష్టంగా కనిపించింది.
బిజెపి ముప్పు ముంచుకొస్త న్నదని అనేక మందిప్రతిపక్ష నాయకులు చెబుతున్నపుడు తనకే ప్రమాదం లేదని, బిజెపి ఎపుడూ తెలంగాణ సాహెన్షా ను కదిలించలేదని   కెసిఆర్ భ్రమపడ్డారు.
ఇపుడు బిజెపి ముప్పు దేశంలో ఏ ఇతర పార్టీలకు లేనంతగా కెసిఆర్ కే ఉంది. దీనితో ఆయన బిజెపి మీద ఇక యుద్ధం ప్రకటించకతప్ప దనే నిర్ణయానికి వచ్చాడు. దీని ప్రభావమే డిసెంబర్ 8 భారత్ బంద్ కు మద్దతు.
ఇది ఉత్తి నోటి మాట మద్దతు కాదు, కార్యాచరణ మద్దతు. టిఆర్ఎస్ శ్రేణులు బంద్ లో ప్రత్యక్షంగా పాల్గొంటారని ప్రకటించారు. మోదీ ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ కొనసాగుతున్న  రైతుల పోరాటం న్యాయమైనదని కేసీఆర్ సమర్థించారు.
‘ఈ చట్టాలు రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. అందుకే  పార్లమెంటులో వ్యవసాయ బిల్లులను టిఆర్ఎస్ వ్యతిరేకించింది,’ కేసీఆర్ గుర్తు చేశారు.
అంతేనా, ఈ కొత్త వ్యవసాయ చట్టాలను మోదీ ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకు పోరాతటం కొనసాగించాల్సిందేనని తన పట్టుదలను కూడా ప్రకటించారు.
టిఆర్ ఎస్ పార్టీ రైతుల భారత్ బంద్ ని  విజయవంతం చేసేందుకు కృషి చేస్తుందని,   రైతులకు అండగా నిలిచేందుకు తెలంగాణ ప్రజలు   బంద్ లో పాల్గొనాలని పిలుపు నిచ్చారు.
ఇది ఇలా ఉంటే,  దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళన ఎముకలు కొరికే చలిలోనే 11వ రోజుకు చేరింది. ఈ  ఉద్యమానికి మద్దతుగా దేశంలోని వివిధప్రాంతాలనుంచి పెద్ద ఎత్తున రైతులుఢిల్లీ చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోరైతులకు, కేంద్రానికిమధ్య మరొక సారి ఈ నెల 9న చర్చలు జరుగుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *