కమ్యూనిస్టు పార్టీ మాజీ నాయకులు, నాగార్జున సాగర్ టిఆర్ ఎస్ శాసన సభ్యులు, పేద, కార్మిక వర్గాల పక్షపాతి నోముల నర్సింహ్మయ్య అనారోగ్యంతో మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్ లో తుదిశ్వాస విడిచారు.
ఆయన గురించిన వివరాలు
ఉస్మానియా యూనివర్శిటీలో లా చదివే సమయంలోనే విద్యార్థి రాజకీయాల్లో పనిచేశారు.
నల్లగొండ, నకిరేకల్ కోర్టుల్లో న్యాయవాదిగా పనిచేసిన నోముల
న్యాయవాది గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
సీపీఎం సీనియర్ నేత నర్రా రాఘవరెడ్డి ప్రోత్సహంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు.
1987, 1999 వరకు 12 ఏళ్ల పాటు నకిరేకల్ ఎంపీపీగా పనిచేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో 1999, 2004 లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి సీపీఎం తరుపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
సీపీఎం శాసనసభా పక్ష నేతగాఉండి మంచి వక్తగా పార్లమెంటేరియన్ గా పేరు తె్చుకున్నారు.
2009లో రిజర్వేషన్ మారడంతో అప్పుడే ఏర్పడిన భువనగిరి లోక్ సభ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
2014 ఎన్నికల సమయంలో సీపీఎం నుంచి హుజూర్ నగర్ సీటు కోసం ప్రయత్నించారు.
సీపీఎం నుంచి టికెట్ రాకపోవడంతో టిఆర్ఎస్ లో చేరారు. నాగార్జునసాగర్ టికెట్ సాధించి,
2014 లో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి చేతిలో ఓడిపోయారు.
2018 ఎన్నికల్లో తిరిగి పోటీ చేసి జానారెడ్డి విజయయాత్రకు చెక్ పెట్టిన నోముల
జానారెడ్డిపై అనూహ్య విజయం సాధించారు.
నకిరేకల్ మండలం పాలెం లో 1956, జనవరి 9న జన్మించారు. ఉస్మానియా యూనివర్శిటీలో 1981 లో ఎల్ఎల్ బి, 1983లో ఎంఏ పూర్తి చేశారు.
తల్లితండ్రులు: మంగమ్మ, నోముల రాములు
ఐదుగురి సంతానంలో నోముల నర్సింహ్మయ్య రెండవ సంతానం
అందరూ ఉన్నత చదువులు చదివిన వారే
భార్య: లక్ష్మీ
ఇద్దరు కూతుర్లు: ఝాన్సీ రాణి, అరుణ జ్యోతి వివాహితులు (ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు)
ఒక కుమారుడు : నోముల భగత్ కుమార్, హైకోర్టు న్యాయవాది.
30 సంవత్సరాలకు పైగా రాజకీయ, ప్రజా జీవితంలో తనకంటూ ప్రత్యేక తను చాటి చెప్పే వాగ్దాటితో బహుజనం బాగు కోసం పాటు పడ్డారు. పేదల కోసం నిరంతరం తపించిన బలహీన వర్గాల పెన్నిది.
ఆయన ఎందరికో తన వంతు స్పూర్తి. ఆయన మృతితో తెలంగాణ బడుగులు ఒక మంచి మిత్రుని కోల్పోయారు.