ఎన్నికలకు మద్యం అమ్మకాలకు బలమయిన బంధం ఉంది. అందుకే ఎన్నికల ప్రకటన వచ్చినప్పటినుంచి మద్య విక్రయాలు విపరీతంగా పెరుగుతాయి. ఇలాంటపుడు ప్రధాని మోదీ చెప్పినట్లు ఒక దేశం- ఒకఎన్నిక అమలు జరిగితే మద్యం పరిశ్రమకు ఎంత నష్టమో. మద్యం ప్రియులకది మంచి వార్త కాదు. ఇది వేరే కథ.
ఇపుడు హైదరాబాద్ లో మద్యం సీజన్ నడుస్తున్నది . జిహెచ్ ఎంసి ఎన్నికలు మొదలయ్యాక మద్యం సేల్స్ బాగా పెరిగాయి. ఒక్క నవంబర్ 29న 108 కోట్ల రుపాయల విలువయిన మద్యం అమ్ముడు వోయిందని అధికారులు చెబుతున్నారు.
మీడియా రిపోర్టుల ప్రకారం నవంబర్ 23న రు. 135 కోట్లరుపాయల మద్యం అమ్ముడువోయింది.
నవంబర్ 25న రు. 102 కోట్ల సరుకు, నవంబర్ 26న 58కోట్లు, నవంబర్ 27న మరీ ఎక్కువగా 170 కోట్లరుపాయల మద్యం అమ్ముడయింది.
అదే నవంబర్ 28న మద్యం అమ్మకాలు సీజన్ రికార్డు సృష్టిస్తూ 176 కోట్ల రుపాయలకు చేరింది.
సగటున ఈ జిహెచ్ ఎమ్ సి ఎన్నికల సీజన్ లో రోజూ 100 కోట్లవిలువయన మద్యం మనవాళ్లు సేవించారట.
గత ఏడాది నవంబర్ 29 దాక రు. 2,239 కోట్ల విలువయిన మద్యం అమ్ముడువోయింది. అపుడుఎన్నికలు లేవుగా. కాని, ఈ ఏడాది సేల్స్ లాక్ డౌన్ అమలులో ఉండినా రికార్డు సృష్టించాయి. ఈ ఏడాది ఇప్పటిదాకా మద్యం విక్రయాలు రు.2,567 కోట్లకు చేరాయి. అంటే దాదాపు 500 కోట్ల రుపాయల వ్యాపారం ఎక్కువన్నమాట.
నవంబరు 17 నుంచి 29 వరకు హైదరాబాద్లో రూ.154 కోట్ల విలువైన మద్యం అమ్ముడైతే, రంగారెడ్డి జిల్లాలో 317 కోట్ల, మేడ్చల్ జిల్లాలో రూ. 42 కోట్ల, మెదక్ జిల్లాలో రూ.100 కోట్ల మద్యం సేల్ అయింది.
ఇదే సరళి ఫలితాలు ప్రకటించాక కనీసం మూడు నాలుగు రోజులు కొనసాగుతుందని అధికారులు ఆశిస్తున్నారు.