అప్పిరెడ్డి వెంకటరెడ్డి స్మారక రాయలసీమ పాటల పోటీల విజేతలను రాయలసీమ సాంస్కృతిక వేదిక నిర్వాహక బృందం ఆదివారం నాడు విడుదల చేసారు. మొత్తం పదివేల రుపాయలు ఈ సందర్భంగా విజేతలకు అందజేస్తారు. మొత్తం 103 పాటలను పుస్తకంగా వెలువరిస్తామని ప్రకటించారు.
ప్రథమ బహుమతి (3000 రుపాయలు) శ్రీ గురువేపల్లి నరసింహులు, అష్టావధాని, కవి, పరిశోధకులు, కళ్యాణదుర్గం, అనంతపురము జిల్లా.
ద్వితీయ బహుమతి (2000 రుపాయలు) శ్రీ ధర్మశెట్టి వెంకటరమణయ్య , పాటల రచయిత, గాయకులు, స్వరకర్త, మైదుకూరు, కడప జిల్లా.
తృతీయ బహుమతి (1000 రుపాయలు) శ్రీ కె.సి మల్లికార్జున, కవి, తెలుగు ఉపాధ్యాయుడు, ఉన్నత పాఠశాల, సంతేకూడ్లూరు గ్రామం, ఆదోని తాలుకా, కర్నూలు జిల్లా.
ప్రోత్సాహక బహుమతులు
( ఒక్కొక్కరికి 500 రుపాయలు చెప్పున 8 మందికి)
1. శ్రీ గోసల నారాయణ స్వామి, అనంతపురము. 2. శ్రీ పెరికల రంగస్వామి, కర్నూలు. 3. శ్రీ డా. నెమిలేటి కిట్టన్న, తిరుపతి. 4. శ్రీమతి ఆర్. శ్రీవాణీ శర్మ, కడప. 5. శ్రీ భూమిరెడ్డి సోమన్న, ప్రొద్దుటూరు. 6. శ్రీమతి నీలోజి సువర్ణాదేవి, కడప. 7. శ్రీ మతి అడుగూరు అనితాదేవి, రైల్వేకోడూరు. 8. శ్రీ పరాంకుశ నాగరాజు, పుంగనూరు.