4 లక్షల సిసిటివి కెమెరాల నిఘాలో జిహెచ్ ఎంసి పోలింగ్…

ఆదివారం సాయంకాలం ఆరుగంటలకు జిహెచ్ ఎంసి ఎన్నికల క్యాంపెయిన్ ముగిసింది. డిసెంబర్ 1న పోలింగ్. పోలింగ్ శాంతియుతంగా జరిగేందు తీసుకున్న ఏర్పాట్ల గురించి  పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ వివరించారు. 4లక్షల సీసీ కెమెరాలతో పరిస్థితిని మానిటరింగ్ చేస్తున్నామని ఆయన చెప్పారు. ఇప్పటికే డిజిపి మహేందర్ రెడ్డి ఒక హెచ్చరిక చేశారు. హైదరాబాద్ మతవిద్వేషాలు సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తమదగ్గిర సమాచారం ఉందని ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో కమిషనర్ పోలింగ్ కోసంచేసిన భద్రత ఏర్పాట్లను వివరించారు.
కమిషనర్ చెప్పిన వివరాలు:
బల్దియా ఎన్నికల కోసం 22 వేల మంది పోలీసులతో అన్ని భద్రత పరమైన ఏర్పాట్లు చేశారు.
స్టేట్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం అన్ని ప్రాంతాల్లో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశాము. కేంద్ర రాష్ట్ర బలగాలు రెండు రంగంలో ఉన్నాయి.
నార్మల్, సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్, క్రిటికల్ పొలిగ్ కేంద్రాల వద్ద సి ఐ స్థాయి అధికారి నేతృత్వం లో భద్రత ఏర్పాటు చేశాము..
స్ట్రైకింగ్ ఫోర్స్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అందుబాటులో వుంటారు.
293 హైపర్ సెన్సిటివ్ కేంద్రాల పికెట్ భద్రత ఏర్పాటు చేసాము..
క్రిటికల్ హైపర్ సెన్సిటివ్ పోలీస్ కేంద్రాల వద్ద 6 ఆర్ముడు పోలీస్ బృందాలను ఏర్పాటు చేశాను.
హైదరాబాద్ కమిషనరేట్ లో 89 వార్డ్ లు ఉన్నాయి
పోలింగ్ స్టేషన్ లు  4979 వున్నాయి
2016 తో పోలిస్తే 817 కొత్త పోలింగ్ స్టేషన్ లు ఏర్పాటు. నార్మల్ పోలింగ్ స్టేషన్ లు 2146, సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ లు 1517, అత్యంత సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ లు 167 ఉన్నాయి.
406 మొబైల్ పార్టీ లతో నిరంతరం మానిటరింగ్
హైదరాబాద్ లో 29 బార్డర్ చెక్ పోస్ట్ లు ఏర్పాటుచేశారు.
హైపర్ సెన్సిటివ్ ఏరియా ల్లో 293 పికెట్ లు ఏర్పాటు చేశారు.
4187 తుపాకులను డిపాజిట్ చేసిన నేతలు
3066 మంది రౌడీ షీటర్ లు బైండోవర్
ఎన్నికల సందర్బంగా 1.45 కోట్ల రూపాయల స్వాధీనం
మత్తు పదార్థాలు , మద్యం అన్ని కలిపి 10 లక్షలు విలువ చేసే పదార్థాలు స్వాధీనం. ఎన్నికల నియమావళికి సంబంధించి 63 ఫిర్యాదులో 55 ఎఫ్ ఐ అర్ లు నమోదు.
ప్రతి పోల్ల్లింగ్ స్టేషన్ కు జియో ట్యాగింగ్
సోషల్ మీడియా పై ప్రత్యేక నిఘా ఉంచాం
4లక్షల సీసీ కెమెరాలతో మానిటరింగ్ చేస్తున్నాము, డిసిపి, ఏ సిపి ఆఫీస్ లో రౌండ్ ది క్లాక్ పర్యావెేక్షణ ఉంటుంది.
ఎన్నికల అనంతరం లైవ్ స్ట్రీమింగ్ పెట్టాము, స్ట్రాంగ్ రూమ్ వద్ద నిఘా పెట్టాము. ఉదయం 7 నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయం వుంది. ఓటర్ లు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోండి.
ఈరోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఆయ పార్టీల నేతలు బయట నుండి వచ్చిన వారి హైదరాబాద్ నుండి వెళ్లిపోవాలి..
ఎన్నికల గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి..
ఎలక్షన్ ఏజెంట్ కి ప్రత్యేక వాహనం అనుమతి వుండదు.ఓటర్ లు 200 మీటర్ ల వద్ద తమ వాహనాలు పార్క్ చేయండి..
ఓటర్ లను తరలించడం చట్ట విరుద్ధం అల చేస్తే వాహనాలు సీజ్ చేస్తాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *