ప్రచారం మొత్తంగా తీసుకుంటే కొద్దిగా వెనకబడి ఉన్నట్లు కనిపించినా,చివరికొచ్చేసరికి కాంగ్రెస్ ప్రచారం వూపందుకుంది. ఎంపి రేవంత్ రెడ్డి, పిసిసిఅధ్యక్షుడుఉత్తమ్ కుమార్ రెడ్డి మొత్తానికి కాంగ్రెస్ బాణిని వినడేలా చేశారు. ఆదివారంనాటికి వాళ్లకి టిఆర్ ఎస్, బిజెపి, ఎంఐఎంల ప్రచారాన్ని తిప్పికొట్టే నినాదం బలంగా వినిపించగలిగారు. అదే టిఆర్ ఎస్, ఎంఐఎం, బిజెపిలు అన్నీ ఒకే తాను ముక్కలే…
ఈ మూడు పార్టీలు ఏదో విధంగా మత విద్వేషాలను రెచ్చగొట్టి ఓటు లబ్ది పొందాలని చేస్తున్నాయని చెప్పగలిగారు. బిజెపికి వ్యతిరేకంగా ఎంఐఎం ముస్లింలను రెచ్చగొడితే, ఓల్డ్ సిటి బయట ఉన్న ముస్లిం వోట్లు టిఆర్ఎస్ కు పడతాయని రూలింగ్ పార్టీ నేతలు ఆశిస్తున్నారు. అంటే బిజెపి , ఎంఐఎం లు మతావేశాలు రెచ్చగొడితే లబ్దిపొందాలన్నటిఆర్ ఎస్ ఆశ అని ఉత్తమ్, రేవంత్ గట్టిగా చెప్పగలిగారు. ఇదే సందేశమిస్తూ ఆదివారం నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఉత్తమ్ మీడియా సమావేశం విశేషాలు:
బీజేపీ నేతల ప్రవర్తన హైదరాబాద్ వాసులను అవమాన పరిచేలా ఉంది.
బీజేపీ, టీ.ఆర్.ఎస్ , ఎం.ఐ.ఎమ్ అన్నీ ఒక తాను ముక్కలే.
వరదల్లో వంద మంది చనిపోతే.. హోంమంత్రి గా అమిత్ షా హైదరాబాద్ వైపు కన్నెత్తి చూల్లేదు. ఒక్కరినీ పరామర్శ చేయలేదు.
మున్సిపల్ ఎన్నికల లో ఓట్ల కోసం ఇపుడు ఢిలీ నేతలంతా పోలోని వస్తున్నారు.
ప్రధానమంత్రి మోదీ.. కరోనా వ్యాక్సిన్ పరిశీలన పేరుతో డ్రామా చేసి వెళ్లారు.
మోదీ రాకపోతే వ్యాక్సిన్ తయారు కాదా?
ఓట్ల కోసం ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరమా..
యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ కూాడా హైదరాబాద్ వచ్చారు సొంత రాష్ట్రంలో దళిత మహిళ లపై రేపులు, హత్యచారాలు జరుగుతుంటే మిన్నకుండీ పోయారు.ఇపుడాయన హైదరాబాద్ లో బిజెపిని గెలిపించడానిక వచ్చారు. ఇదే పరిపాలన.
యూపీ సీఎం వచ్చి హైదరాబాద్ పేరు మారుస్తామంటారు.. మీరు ఎవరు ఆ మాట అనడానికి
తెలంగాణ రాష్ట్రం లో అవినీతి పాలన జరుగుతుంటే కేంద్ర సంస్థలు ఏం చేస్తున్నాయి.
తెలంగాణ బిజెపి అధ్యక్షుడయినా బండి సంజయ్ ..కరీంనగర్ కార్పొరేటర్ స్థాయి నాయకుడే. ఆయనకు హైదరాబాద్ గురించి మాట్లాడటానికి ఏం సంబంధం ఉంది?
ఇపుడు కేంద్రం హైదరాబాద్ కు ఏం చేసింది?.. గ్రేటర్ అభివృద్ధి చేసిందంతా కాంగ్రెస్ హయాంలో నే.
మొన్న వరదలు వచ్చినప్పుడు కేంద్ర బలగాలు ఎందుకు రాలేదు? ఈ రోజు మున్సిపల్ ఎన్నికల కోసం బలగాలను దింపుతారా?
పాతబస్తీ పై సర్జికల్ స్ట్రైక్ చేస్తారా? ఇంతకు బుద్ధి ఉండే మాట్లాడుతున్నారా?
బీజేపీ విషపూరిత ప్రచారం చేస్తుంటే.. మీడియా చూపడం దురదృష్టకరం.
కేసీఆర్ తెలంగాణ ను ఏడేళ్ల పాటు దోచుకున్నారు.
నీన్న ఎల్ బిస్టేడియం మీటింగ్ లో ఒక్క అభివృద్ధి కార్యక్రమం గురించి మాట్లడలేదు. సభ అట్టర్ ప్లాప్
టీ.ఆర్.ఎస్ పతనానికి గ్రేటర్ ఎన్నికలే నాంది.
హైదరాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ వల్లే సాధ్యమైంది.. మునుముందు కూడా చేసి చూపుతాం.
హైదరాబాద్ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం.. కాంగ్రెస్ ఓటు వేయండి.