తిరుమల శ్రీవారి ఆలయంలో అనాదిగా వస్తున్న సాంప్రదాయాలను పక్కన పెట్టి శ్రీరంగం ఇతర ఆలయాలతో పోల్చుతూ వైకుంఠ ద్వారాలు 10 రోజులు తెరిచేలా నిర్ణయాలు తీసుకోవడంపై టీటీడీ అధికారులు ధర్మకర్తల మండలి పునః పరిశీలన చేయాలని తిరుపతి యాక్టివిస్టు , కాంగ్రెస్ నాయకుడు నవీన్ కుమార్ రెడ్డి కోరుతున్నారు.
తిరుమల శ్రీవారి ఆలయ సాంప్రదాయాలు కైంకర్యాలకు దశాబ్దాల నాటి చరిత్ర,ఓ ప్రత్యేకత ఉంది ఇతర ఆలయాలతో పోల్చి చూడకండి “భక్తుల సౌకర్యార్థం అన్న సాకుతో” ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం మహా అపచారం!
తిరుమలలో శ్రీవారి సాంప్రదాయాలు “శాశ్వతం” ఐఏఎస్ అధికారులు ధర్మకర్తల మండలి “అశాశ్వతం” అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలని ఆయన అభిప్రాయపడుతున్నారు.ఆయన ఇంకా ఏమంటున్నారో వీడియో చూడండి…
ఆయన ఇంకా ఏమన్నారంటే…
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వారాలను పదిరోజులపాటు తెరవమని టిటిడి ని ఎవరు కోరారు??
రేపు మరో ప్రభుత్వం,ధర్మకర్తల మండలి అధికారంలోకి వచ్చి “365 రోజులు వైకుంఠ ద్వారాలు తెరుస్తాం” అని ప్రకటిస్తే పెద్ద జీయర్,ప్రధాన అర్చకులు,ఆగమ సలహామండలి అనుమతిస్తారా?
టిటిడి ఉన్నతాధికారులు సొంత మార్క్ కోసం గతంలో “లఘు” “మహాలఘు” దర్శనం ప్రవేశపెట్టి సామాన్య భక్తులకు శ్రీవారిని దూరం చేశారు నేడు వైకుంఠ ద్వారాలను పది రోజులు తెరిచి ఆలయ సంప్రదాయాలకు విఘాతం కలిగించే ప్రయత్నాలకు స్వస్తి పలకండి!
* తిరుమలలో వందల సంవత్సరాల నుంచి ఎంతో వైభవంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలను సైతం కరోనా వైరస్ కారణంగా ఏకాంతంగా నిర్వహించారు,”శ్రీవారి చక్రస్నానం” సైతం ఆలయంలో చిన్న “తోట్టి” నిర్మించి జరిపించారు,అలాంటిది వైకుంఠ ద్వారం 10 రోజులు తెరిచి భక్తులను అనుమతిస్తే భక్తుల మధ్య భౌతిక దూరం ఎలా పాటిస్తారు!
* టీటీడీ ఉన్నతాధికారులు, ధర్మకర్తల మండలి ఆలయ సాంప్రదాయాలకు విరుద్ధంగా వైకుంఠ ద్వార దర్శనంపై చేసిన ప్రకటనను ఆలయ పెద జీయర్,చిన్న జీయర్ స్వాములు,ప్రధాన అర్చకులు,ఆగమ సలహా మండలి సమర్ధిస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా? బహిరంగ ప్రకటన ద్వారా భక్తులకు తెలియచేయాలని శ్రీవారి భక్తునిగా విజ్ఞప్తి చేస్తున్నా