కర్నూలు పోలీసులకు గొప్ప ఆలోచన వచ్చింది. కర్నూలు లో జరుగుతున్న పవిత్ర తుంగభద్ర పుష్కరాలకు స్థానికంగా ఉన్న వృద్ధాశ్రం సభ్యలను తీసుకువచ్చి పూజల్లో పాల్గొనే అవకాశం కల్పించాలనుకున్నారు. ఈ ఆలోచన వచ్చిందే తడవుగా జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ దాని అమలులో పెట్టారు. ఏకంగా వృద్ధాశ్రమలో వృద్ధులను సంకల్ బాగ్ పుష్కర్ ఘాట్ కు తీసుకువచ్చే ఏర్పాట్లు చేసి వాళ్లంతా కోలుకోలేనంతగా ఆశ్చర్యపోయేలా చేశారు. వీళ్లందరిని విఐపి ఘాట్ కు రప్పించారు.పుష్కర పూజలు తిలికించేలా చేశారు. గొప్పఆలోచన. ప్రపంచంలో ఎవ్వరికీ పట్లనట్లుండే వృద్దాశ్రమవాసులకు ఇది గొప్ప ఊరట.
కర్నూలు పట్టణంలో తుంగభద్ర పుష్కరాల గత 9 రోజులుగా కొనసాగుతున్నాయి. ఈ రోజు 9 వ రోజైన శనివారం నాడు కర్నూలు నగరంలోని సంకల్ భాగ్ విఐపి పుష్కర ఘాట్ లో పేద వృద్ధులు ప్రత్యక్ష మయ్యారు.
కర్నూలు నగరంలోని బళ్ళారి చౌరస్తా వద్ద ఉన్న సాయిరామ్ వృద్దాశ్రమం , నరసింహారెడ్డి నగర్ లోని వృధ్దాశ్రమంకు చెందిన వయో వృద్దులకు తుంగభద్ర నది పుష్కర దర్శన భాగ్యం కలిగించారు ఎస్ పి. అక్కడ వారంతా పుష్కరస్నానం చేశారు.
సంప్రదాయబద్ధంగా, శాస్త్రోక్తంగా పూజారులు మంత్రాలు చదివారు. వేదపండితులు వారందరికి ఆశ్వీరచనం చేశారు.
పుష్కర నీటి స్నానం తర్వాత పుష్కర ఘాట్ లో ఉన్న యాగశాలలో జరుగుతున్న హోమం చుట్టూ వృద్దులు ప్రదక్షిణలు చేశారు.
శీతాకాలం దృష్టిలో ఉంచుకుని బెడ్ షీట్లు, మిఠాయిలు, శానిటైజర్లను పోలీసు అధికారులు వృద్దులకు అందజేశారు.
అనంతరం ఈ సంధర్బంగా పోలీసు అధికారులు మీడియాతో మాట్లాడారు.
కోవిడ్ -19 నిబంధనలు అతిక్రమించకుండా పుష్కర్ ఘాట్ లో వృద్దులకు పుష్కర పూజ కార్యక్రమం ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 22 మందిలో 8 మంది మహిళలు ఉన్నారన్నారు.
వృద్దుల కొరకు ఒక ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి పుష్కర భాగ్యం కల్పించామన్నారు.
రేపు (29.11.2020)ఆదివారం కోవిడ్ 19 ప్రోటోకాల్ ప్రకారం అనాథ ఆశ్రమంలోని 12 సంవత్సరాలు పై బడిన వారికి తుంగభద్ర పుష్కర స్నానం , పూజ కార్యక్రమాలలో పాల్గొనే ఏర్పాట్లు చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎల్. అర్జున్ , కర్నూలు పట్టణ డిఎస్పీ శ్రీ కె.వి మహేష్, హోంగార్డు డిఎస్పీ వై. రవీంద్రా రెడ్డి, సిఐలు శ్రీ మహేశ్వర రెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఎస్సైలు ఉన్నారు.
అనాథ ఆశ్రమంలోని 12 సంవత్సరాలు పై బడిన వారికి తుంగభద్ర పుష్కర స్నానం , పూజ కార్యక్రమాలలో పాల్గొనే ఏర్పాట్లు చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎల్. అర్జున్ , కర్నూలు పట్టణ డిఎస్పీ శ్రీ కె.వి మహేష్, హోంగార్డు డిఎస్పీ వై. రవీంద్రా రెడ్డి, సిఐలు శ్రీ మహేశ్వర రెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఎస్సైలు ఉన్నారు.