ఓటరుగుర్తింపుకార్డుకు ప్రత్యామ్నాయంగా మరో 18 గుర్తింపుకార్డులు అనుమతించాలని జిహెచ్ ఎంసి పోలింగ్ అధికారులు నిర్ణయించారు.
జిహెచ్ ఎంసి ఎన్నికలకు డిసెంబర్ 1న జరిగే పోలింగ్‌లో ఓటరుగుర్తింపుకార్డులేకున్నా ఓటు వేయడానికి ఏదో ఒక ప్రభుత్వం సంస్థనుంచి వచ్చినా కార్డుంటే చాలునని జిల్లా ఎన్నికల అధికారి లోకేష్ కుమార్ చెప్పారు.
ఓటరు ఐడికి ప్రత్యామ్నాయ కార్డులు:
1. ఆధార్ కార్డు, 2. పాస్‌పోర్ట్, 3. డ్రైవింగ్ లైసెన్స్, 4. ఫోటోతో కూడిన సర్వీస్ ఐడెంటిఫైకార్డ్, 5. ఫోటోతో కూడిన బ్యాంకు పాస్‌బుక్, 6. పాన్ కార్డు, 7. ఆర్.జి.ఐ, ఎన్.పి.ఆర్ స్మార్ట్ కార్డు, 8. జాబ్ కార్డు, 9. హెల్త్ కార్డు, 10. ఫోటోతో కూడిన పింఛన్ డాక్యుమెంట్, 11. ఎం.ఎల్.ఏ, ఎం.పి, ఎమ్మెల్సీలకు జారీచేసిన అధికారగుర్తింపు పత్రం, 12. రేషన్ కార్డు, 13. కుల ధృవీకరణ పత్రం, 14. ఫ్రీడమ్ ఫైటర్ ఐడెంటిఫై కార్డు, 15. ఆర్మ్స్ లైసెన్స్ కార్డు, 16. అంగవైకల్యం సర్టిఫికేట్, 17. లోక్ సభ, రాజ్యసభ మెంబర్ ఐడెంటిఫై కార్డు, 18. పట్టదారు పాస్ బుక్