విజయనగరం కలెక్టర్ కు ‘మ్యాన్ ఆఫ్ ఎక్స్ లెన్స్’ అవార్డు

 విజయనగరం  జిల్లా కలెక్టర్ డా. ఎం.హరిజవహర్ లాల్ కు మ్యాన్ ఆఫ్ ఎక్స్ లెన్స్ అవార్డు ను ప్రకటించారు.
ఢిల్లీ కి చెందిన ఇండియన్ అచీవర్స్ ఫోరం ఆయనను మ్యాన్ ఎక్స్ లెన్స్ గా గుర్తించింది.
జిల్లాలో కమాన్ మ్యాన్ కలెక్టర్ గా ఆయనకు పేరుంది. సాధారణ ప్రజల్లో సులభంగా కలసిపోయే స్వభావం ఉన్న కలెక్టర్ హరిజవహర్ లాలా.
జల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, ఇతర సామాజిక కార్యక్రమాలను చేపడుతూ జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు నడిపించినందుకు  ఈ అవార్డును ప్రకటించారు.
దేశంలో వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరచిన వారికి గత 25 సంవత్సరాలుగా ఈ  అవార్డులు బహుకరిస్తున్నారు.

ఈ అవార్డు మీద వ్యాఖ్యానిస్తూ ఇది  విజయనగరం జిల్లాకు దక్కిన గుర్తింపుగా గౌరవంగా జిల్లా కలెక్టర్ హరి జవహర్ పేర్కొన్నారు.
జాయింట్ కలెక్టర్ నుండి గ్రామ వాలంటీర్ వరకు అన్ని స్థాయిల అధికారులు, సిబ్బంది మనస్ఫూర్తిగా పనిచేసిన ఫలితంగా ఈ అవార్డు వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *