నివార్ తుఫాను, తీవ్ర అల్పపీడనంగా బలహీనపడి దక్షిణ కోస్తాంధ్ర, దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొన సాగుతోందని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
దానికి అనుబంధ గా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5 కిమీ ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది. తూర్పు హిందూమహా సముద్రం, దానిని ఆనకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం మీద 5.8 కిమీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉన్నదని భారత వాతావరణ శాఖ బులెటీన్ విడుదల చేసింది.
వివరాలు:
దీని ప్రభావం వల్ల రాగల 48 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది తదుపరి 24 గంటల్లో వాయుగుండం గా బల పడి, ఆ తరువాత మరింత బల పడు తుంది. ఇది పశ్చిమ దిశగా ప్రయాణిం చి, తమిళనాడు – పాండి చే రి తీరాన్ని డిసెంబర్ 2 వ తేదీకి చే రే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన :*
ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం :
ఈ రోజు :
ఉరుము లు మెరుపులతో- పాటు – తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లా : విశాఖ పట్నం. అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాలు :
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు.
రేపు
ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా చోట్ల కురిసే అవకాశం ఉంది.
ఎల్లుండి
ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర :
ఈ రోజు:
ఉరుములు, మెరుపులతో- పాటు – తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాలు :కృష్ణ, గుంటూరు. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాలు : ప్రకాశం , నెల్లూరు.
రేపు
దక్షిణకోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లా: ప్రకాశం, గుంటూరు జిల్లా లు.
ఎల్లుండి దక్షిణకోస్తా ఆంధ్రాలో:
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. –
రాయలసీమలో…
ఈ రోజు
రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాల చోట్ల కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లా లు : కడప, అనంతపురం,చిత్తూరు .
రేపు
రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
ఎల్లుండి