ఒక్కోసారి క్రికెటర్లు కూడా చిలిపి పనులు, చిత్రమైన, కొండకచో తిక్క పనులు చేస్తుంటారు. అవి మైదానం బయట కొన్ని, మైదానం లోపల కొన్ని ఉంటాయి. అలాంటివి కొన్ని చూద్దాం.
2005 లో , భారత క్రికెట్ జట్టు ఆటగాళ్ళు తమ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పై చిలిపి ఆట ఆడారు. ఆ చిలిపి పని వల్ల గంగూలీ కన్నీటి పర్యంతం అయ్యాడు. ఇంకా తన కెప్టెన్సీ నీ కూడా వదిలేందుకు సిద్ధమయ్యాడు. దీని వెనక సూత్రధారి యువరాజ్ సింగ్. కొచ్చిలో పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా ఇది జరిగింది.
మామూలుగా డ్రెస్సింగ్ రూమ్ లోకి వచ్చిన గంగూలీకి నిశ్శబ్ద కరమైన వాతావరణం కనబడింది. గంగూలీకి ఏమీ అర్థం కాలేదు. ఒక ఇంటర్వ్యూ(ఫేక్) వచ్చిన న్యూస్ పేపర్ యువరాజ్ గంగూలీ కి చూపించాడు. అందులో గంగూలీ గతంలో పలు క్రికెటర్లపై చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి.
గంగూలీ ఈ సంఘటన గుర్తు చేసుకుంటూ ఇలా అన్నాడు “నా కళ్ళలో దాదాపు కన్నీళ్లు వచ్చాయి. నేను వారి తరఫున ఎన్నో సార్లు వకాల్తా పుచ్చుకున్న ఆటగాళ్లు వాళ్లంతా. వారు అకస్మాత్తుగా ఈ విషయాలన్నీ ఎందుకు చెబుతున్నారో నాకు అర్థం కాలేదు. సౌరవ్ కెప్టెన్సీకి రాజీనామా చేయటానికి కూడా ముందుకొచ్చాడు మరియు తాను ఎప్పుడూ అలాంటి ప్రకటన చేయలేదని పునరుద్ఘాటించాడు. నిజం బయటపడినప్పుడు – “నేను ఇబ్బందిపడటం కంటే ఎక్కువ ఉపశమనం పొందాను” అని గంగూలీ జోడించారు.
అందరూ సంతకం చేసిన షీట్‌ను అతనికి అందజేశారు. అతను చదవడానికి ధైర్యం కనుగొనలేకపోయాడు, కానీ అతను అలా చేసినప్పుడు అతని హృదయం బరువెక్కింది.
“దాదా, మేమంతా నిన్ను ప్రేమిస్తున్నాము” అని అందులో రాసి ఉంది.
కెప్టెన్ వెంటనే ప్రతి ఒక్కరినీ కౌగిలించుకున్నాడు, కాని అలాంటి చిలిపి పనిని పునరావృతం చేయవద్దని వారికి కఠినమైన హెచ్చరిక ఇచ్చాడు.
Online ఛానల్ క్రికెట్ లాంజ్ కు ఇంటర్వ్యూ ఇస్తూ యువరాజ్ ఇలా చెప్పాడు” మేము గంగూలీ యొక్క పాత ఇంటర్వ్యూలను తీసుకొని వాటిని ఒక చోట అరేంజ్ చేసి ప్రింట్ అవుట్ తీసి ఉంచాము.అది అతనికి చూపించినప్పుడు, తను అలాంటి ఇంటర్వ్యూ ఇవ్వలేదని అతను వేడుకున్నాడు.”
గతంలో జింబాబ్వేతో జరిగిన ఐసీసీ 2000 టోర్నమెంట్లో యువరాజ్ సింగ్ పై గంగూలీ వేసిన ప్రాక్టికల్ జోక్ దీనికి కారణం. అప్పుడు యువరాజ్ సింగ్ తన మొదటి వన్డే మ్యాచ్ ఆడబోతున్నాడు.
యువరాజ్ సింగ్ దగ్గరికి వచ్చిన గంగూలీ ” ఓపెనింగ్ చేస్తావా?” అని అడిగాడు. యువరాజ్ సరే అన్నాడు. మర్నాడు పొద్దున గంగూలీ యువరాజ్ తో ” అది జోక్ ఊరికే అన్నాను” అని చెప్పాడు. అదీ విషయం. యువరాజ్ ఆ విధంగా గంగూలీపై ప్రాక్టికల్ జోక్ వేసి బదులు తీర్చుకున్నాడు.