మహాత్మాగాంధీ మనవడు సతీష్ ధూపేలియా (66) జొహాన్నెస్ బర్గ్ లో చనిపోయారు.
ఆయన కోవిడ్ -19 వల్ల వచ్చిన ఆరోగ్య సమస్యల వల్లఆదివారం నాడు చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మూడు రోజుల కిందటే ఆయన 66 జన్మదినం జరుపుకున్నారు.
ఆయన మరణ వార్తను సోదరి ఉమా ధుపేలియా మేస్త్రీ ధృవకరించారు. సతీష్ న్యూమోనియా బాధపడుతూ చికిత్సకోసం ఆసుపత్రిలో చేరారు.
తర్వాత ఆయన కరోనా సోకింది. దీని పర్యవసానంగా ఆయన ఆరోగ్యపరిస్థితి విషమించింది. చివరకు ఆదివారం నాడు గుండెపోటు వచ్చి జోహన్నెస్ బర్గ ఆసుప్రతిలో చనిపోయారని ఆమె ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు.
ఆయనకు కీర్తి మేనాన్ అనే మరొకసోదరి కూడా అక్కడ ఉన్నారు.
దక్షిణా ఫ్రికా నుంచి తిరిగొచ్చేటప్పుడు మహాత్మాగాంధీ తన కుమారుడు మణిలాల్ గాంధీని అక్కడే ఉంచేసి వచ్చారు. ఆదేశంలో తాను ప్రారంభించిన పనులను కొనసాగించే బాధ్యతను ఆయన మణిలాల్ కు అప్పగించారు. సతీష్,ఉమ,కీర్తి ఆయన సంతానమే.
గాంధీజీ దక్షిణాఫ్రికాలో రెండు దశాబ్దాలున్నారు. 1915 జనవరి 9 లో ఆయన భారత్ తిరిగొచ్చారు. ఆరోజు బొంబాయి అపోలో బందర్ రేవులో భారత భూభాగం మీద కాలుమోపారు.