టిఆర్ఎస్ జమానా, 60 తప్పుల ఖజానా: బిజెపి చార్జ్ షీట్

టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి అరాచకాలపై బీజేపీ చార్జ్‌షీట్‌ విడుదల చేసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం హైదరాబాద్‌కు చేరుకున్న కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ దీనిని విడుదల చేశారు. ఇందులో 60 వైఫల్యాలను బిజెపి సంధించింది.
అందులో కొన్ని:
1. హైదరాబాద్ లోట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు మూసిపై 42 కిలోమీటర్లమేర 6లేన్లరోడ్ ను నిర్మిస్తామన్నారు. ఐదేళ్లయినా పనులు మొదలు కాలేదు..కనీసం ప్రణాళికను కూడా ప్రకటించలేదు
2. కంపు కొట్టే హుస్సేన్ సాగర్ లోగబ్బు నీళను్ల తోడిమంచినీళతో నిం ్ల పుతామన్న మాట నిజంకాదా? 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగాహుస్సేన్ సాగర్ చుట్టూ ఆకాశ హర్మ్యాలతో సాగర్ నీళ్లను కొబ్బరి నీళ్లను చేస్తామన్న సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు.
3. ఉమ్మడిరాష్ట్రంలోపునాది పడిన మెట్రోరైల్ నిర్మాణాన్ని, టిఆర్ఎస్ప్రభుత్వమేదగ్గరుండి కట్టించినట్లుగా చెప్పుకున్నది నిజంకాదా? రూ. 17,290 కోట్లు ఖర్చు చేశామన్న మంత్రి కేటీఆర్, ఓల్డ్సిటీ వరకు మెట్రోలైన్ ఎందుకు వేయలేదు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు ఏడాది లోగాపూర్తి చేస్తామని జేబీఎస్ ప్రారంభోత్సవంలో చెప్పినప్రభుత్వం… ఏడాదైన పనులు ఎందుకు మొదలు పెట్టలేదు.
prakash javadekar (from facebook timeline)
4. తెలంగాణ వచ్చాకటీఎస్పీఎస్సీ ద్వారాఎన్ని నియామకాలు చేపట్టారో ప్రభుత్వం వైట్ పేపర్ రిలీజ్ చేయాలి? 18 వేలమంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను క్రమబద్ధీకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని జీహెచ్ఎంసీ మేనిఫెస్టో లో పెట్టి, ఆతర్వాత ఆహామీని గాలికి వదిలేశారు.
5. MMTS రెండోదశపూర్తి చేస్తామన్నారు. కేంద్రప్రభుత్వం తన వంతు వాటాను విడుదల చేసినా,,రాష్ట్రం తనవాటా నిధులను విడుదల చేయలేదు. దీంతో ఈ ప్రతిపాదన అమల్లోకిరాలేదు. ఎం ఎం టి ఎస్ సెకండ్ఫేస్, మెట్రోలైన్ విస్తరణ ఆగిపోవడానికి రాష్ట్రప్రభుత్వ నిధులు కేటాయించక పోవడమే అసలు కారణం కాదా?
6. కరోనాకష్టకాలంలోఉపాధికోల్పోయి.చిన్నచిన్న వ్యాపారాలునడవకకుటుంబాన్ని పోషించలేని స్థితి లోఎల్ఆర్ఎస్  కోసం ఒక్కో ప్లాట్ల యజమాని వద్ద రూ.50 వేల నుంచి 2 లక్షల వరకువసూలు చేసేందుకు సర్కార్ సిద్దం కావడం సిగ్గుమాలిన చర్య. ఎల్ఆర్ఎస్ కోసం వచ్చిన 25 లక్షల దరఖాస్తుదారుల నుంచి రూ.20 వేలకోట్లు రాబట్టాలనేఆలోచన లోప్రభుత్వం ఉందంటే..రాష్ట్రంలో దోపిడీ ఏ స్థాయిలో జరగబోతుందో అర్థంం చేసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *