24న రాష్ట్రపతి తిరుపతి రాక, నగరంలో ఆంక్షలు

భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాధ్ కొవింద్ 24.11.2020న తిరుపతి – తిరుమల పర్యటనకు వస్తున్నారు. ఈ స౦ధర్బ౦గా తిరుపతి, చుట్టుపక్కల ప్రాంతాలలో వాహనాల దారులను  మళ్లిస్తున్నారు. దీనికి ప్రజలు సహకరించాలని పోలీసులు కోరారు.
24.11.2020 ఉదయం 10:00 గంటల నుండి 11-45 గంటలవరకు,  మరల 3.00 గంటల నుండి 4.00 గంటల వరకు బస్టాండ్ నుండి తిరుమల, ఇతర ప్రదేశములకు పోవు బస్సులను వి‌వి‌ఐ‌పి దారి కాకుండా వేరే దారిలో మళ్లిస్తారు.
ఉదయం 9 గంటలు నుండి సాయంత్రం 4 గంటలు వరకు కడప, శ్రీకాళహస్తి, నెల్లూరు, విజయవాడ, నగిరి, పుత్తూర్ మరియు చెన్నై నుండి వచ్చే  పోయే వాహనాలను పాత రేణిగుంట, కరకంబాడి రోడ్ల గుండా తిరుపతిలోకి అనుమతిస్తారు. ఇదే దారిలో బయటకు వెళ్లాల్సి ఉంటుంది.
మదనపల్లి, పీలేరు, వేలూరు, చిత్తూర్ నుండి వచ్చే పోయే వాహనములను చెర్లోపల్లి క్రాస్, జూపార్క్, గరుడ సర్కిల్ మరియు లీలా మహల్ మీదుగా తిరుపతి బస్స్టాండ్ లోనికి  రావడానికి అనుమతిస్తారు.
అదే విధంగా చంద్రగిరి, రంగంపేట, చెర్లోపల్లే, శ్రీనివాసమంగాపురము నుండి వచ్చు షేర్ ఆటొలు చెర్లోపల్లి క్రాస్, జూపార్క్, గరుడ సర్కిల్ మరియు లీలా మహల్ మీదుగా తిరుపతి పట్టణము లోనికి అనుమతిస్తారు.
తదుపరి ఉదయం నుండి పర్యటన ముగింపు వరకు రాష్ట్రపతి పర్యటన చేయు మార్గము అనగా రామానుజ పల్లి కూడలి నుండి అలిపిరి వరకు ఇరువైపుల గల దుకాణాదారులు దుకాణాల ముందు ఏవరినీ అనుమతించరు ఎటువంటి వాహనాలకు ఈ దారిలో అనుమతి లేదు.
రాష్ట్రపతి ప్రయాణించు మార్గము ఇరువైపులా ఫుట్  ఎలాంటి వాహనాలు అనుమతించారు అక్కడ ఏ వస్తువులు సామాన్లను ఉంచరాదు.
అత్యవసర వాహనములు అనగా అంబులెన్సు, అగ్నిమాపక వాహనము లాంటివి పై మళ్లింపులు నుంచి మినహాయింపు ఇవ్వడమైనది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *