మొన్న సొమవారం నాడు రాయదుర్గం నియోజకవర్గం లో ఇసుక స్మగ్లింగ్ కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఒక కార్యక్రమం నిర్వహించింది. వైసిపి నేతలు ఇసుకను అక్రమంగా మైనింగ్ చేసి పక్కనే ఉన్న కర్నాటకు స్మగ్గింగ్ చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్నది. ఈ స్మగ్లింగ్ మొత్తం రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలోసాగుతున్నదని పార్టీ మాజీ ఎమ్మెల్యే , పాలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు ఆరోపిస్తున్నారు. ఇసుక స్మగ్లింగ్ కోసం వైసిపి నేతలుస్మశానాలను కూడా వదలడం లేదని, సమాధులను కూడా పెకలించేసి ఇసుక దోపిడి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ నియోజకవర్గంలో ఇలా స్మశానం తవ్వి ఇసుక దొంగతనం చేస్తున్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు. జుంజురాం పల్లె, కూడ్లూరు ఇసుకరీచ్ లను ఆయన పార్టీ నాయకులతో కలసి పరిశీలించారు. ఇసుకను అక్రమంగా మైనింగ్ చేసి కర్నాటకకు తరలించారని చెప్పేందుకు ఇసుక రీచ్ లలో ఏర్పడిన లోయలాంటి గుంతలో సాక్ష్యమని ఆయన చెప్పారు.
ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఇసుక స్మగ్లింగ్ కోట్ల రుపాయల కొల్లగొట్టారని , ఆయన లారీలు, టిప్పర్లు రేయింబగళ్లు ఇసుకను బెంగుళూరుకు, పక్కనే ఉన్న బళ్లారికి తరలిస్తున్నాయని ఆయన చెప్పారు. ఈ స్మగ్లింగ్ వల్లనే వేదవతి హగరి నది గుంతలమయమయిందని ఆయన చెప్పారు.
విషయమేంటే, ఈ ఇసుక స్మగ్లింగ్ కు వ్యతిరేకంగా కాలువ శ్రీనివాసులు ఏర్పాటుచేసిన ఈ చిన్న కార్యక్రమానికి విపరీతంగా స్పందన రావడం. సుమారు నాలుగుయిదు వేల మంది ప్రజలు హాజరయ్యారు. మొన్న 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే ఈ స్పందనను వూహించలేం.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలలో 12స్థానాలను వైసిపి గెల్చుకుంది. రెండు ఎంపిలను(అనంతపురం, హిందూపురం) ఎంపిలను కూడా వైసిపియే గెల్చుకుంది.2019 ఎన్నికల్లో జిల్లాలోని ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్, హిందూపురం నుంచి బాలకృష్ణ. ఇలాంటి చోట ఏడాదిన్నరకే తెలుగుదేశం పార్టీ ఇంత పెద్ద ఎత్తున జనాన్ని పోగేయడం విశేషం.
చాలా కాలం అనంతపురం జిల్లా టిడిపికి బలమయిన కేంద్రమని అనుకునే వాళ్లు.జిల్లాలో 1989లో కూడా రెండు స్థానాల్లో మాత్రమే గెలిచిన టీడీపీ1994వచ్చేసరికి మిత్రపక్షం సిపిఐ తో కలిపి 13స్థానాల్లో విజయ దుందుభి మోగించింది.1989లో ధర్మవరం నుండి నాగిరెడ్డి,హిందూపూర్ నుండి ఎన్టీఆర్ మాత్రమే గెలిచారు.
అయితే, 2019 ఎన్నికలు దీనిని వమ్ము చేశాయి. ఇపుడు మళ్లీ టిడిపి పుంజుకుంటున్నదా అని అనిపించేలా ఈ ఇసుక ర్యాలీ జరిగింది.టిడిపి జిల్లాను మళ్లి కైవసం చేసుకునే దిశలో నడుస్తున్నదా అనిపించేలా ఈ ర్యాలీ జరిగింది.
ఎన్నికల్లో పూర్తిగా ఉనికి కోల్పోయిన పార్టీ కార్యక్రమాలకు రావాలంటే ప్రజలు భయపడతారు. ఓటమి తర్వాత పార్టీ కార్యకర్తల్లో కూడా బాగా నిరుత్సాహం ఉంటుంది. దానికి తోడు రూలింగ్ పార్టీ నుంచి కక్ష సాధింపులుంటాయని కార్యకర్తలు స్థానిక నాయకులు భయపడతారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జంకుతారు. అయితే, కాల్వ శ్రీనివాస్ నాయకత్వంలో జరిగిన ఈ ఇసుక స్మగ్లింగ్ వ్యతిరేక కార్యక్రమానికి టిడిపి కూడా ఉహించనంత పెద్ద సంఖ్యలో జనం రావడం పార్టీ వర్గాల్లో బాగా ఉత్సాహాన్ని నింపింది.
ఇక జిల్లా మొత్తం ప్రభుత్వ వైఫ్యలాల మీద కార్యక్రమాలుచేపడతామని, ప్రజలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన మీద అసంతృప్తి చెందడం మొదలయిందని ‘ట్రెండింగ్ తెలుగు న్యూస్ ’ తో మాట్లాడుతూ కాల్వ శ్రీనివాసులు అన్నారు.